money demanded
-
సోదాల పేరుతో సీబీఐ అధికారుల రచ్చ
న్యూఢిల్లీ: ఓ వ్యాపారవేత్త నుంచి డబ్బులు గుంజేందుకు సోదాల పేరుతో హంగామా సృష్టించిన సీబీఐ అధికారులు నలుగురు అడ్డంగా దొరికిపోయారు. ఉన్నతాధికారులు వారిని డిస్మిస్ చేయడంతోపాటు అరెస్ట్ చేశారు. ఈనెల 10వ తేదీన సీబీఐ అధికారులమని చెబుతూ కొందరు తన ఆఫీసులోకి వచ్చి, నానా హంగామా సృష్టించారని చండీగఢ్‌కు చెందిన వ్యాపారవేత్త ఒకరు ఫిర్యాదు చేశారు. తనకు ఉగ్రవాదులతో సంబంధాలున్నాయంటూ బెదిరించి, రూ.25 లక్షలివ్వాలని డిమాండ్ చేశారని అందులో పేర్కొన్నారు. తమ సిబ్బంది ఒకరిని పట్టుకోగా, మిగతా వారు పరారయ్యారని వివరించారు. ఈ ఫిర్యాదుపై సీబీఐ డైరెక్టర్ సుబోధ్‌కుమార్ జైశ్వాల్ వెంటనే స్పందించారు. విచారణ జరిపి ఈ నలుగురూ ఢిల్లీ సీబీఐ ఆర్థిక నేరాలు, ఇంటర్‌పోల్ ప్రొటోకాల్ డివిజన్లో బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఎస్సైలు సుమిత్ గుప్తా, అంకుర్ కుమార్, ప్రదీప్ రాణా, అకాశ్ అహ్లావత్లుగా గుర్తించారు. వీరి నివాసాలపై సోదాలు చేపట్టి, కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. నలుగురినీ అరెస్ట్ చేయడంతోపాటు వెంటనే విధుల నుంచి తొలగిస్తూ ఆదేశాలిచ్చారు. వీరిపై ఆరోపణలు రుజువైతే 10 ఏళ్ల నుంచి జీవితకాల జైలు శిక్ష పడే అవకాశాలున్నాయి. -
HMDA: స్వీపర్లకు శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్ల వేధింపులు
సాక్షి, ఉప్పల్(హైదరాబాద్): ఉప్పల్ సర్కిల్ పరిధిలోని శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్ (ఎస్ఎఫ్ఏ)ల ఆగడాలు రోజు రోజుకు తారా స్థాయికి చేరుతున్నాయి. చివరకు డబ్బులిస్తేనే ఉద్యోగం చేయాలని అన్నట్లు వ్యవహారిస్తున్నట్లు ఆరోపణలు నిత్యం వెల్లువెత్తుతున్నాయి. నెల జీతం వచ్చిందంటే చాలు అప్పులోల్ల వలే ఇచ్చేదాక వెంటపడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇవ్వని వారిని నయాన్నో, భయాన్నో దారిన తెచ్చుకుంటున్నారు. అడిగినంత ఇవ్వకుంటే వేధింపులు గురిచేస్తూ స్వీపర్లను నానా హింసలు పెడుతున్నట్లు బాధితులు బాహాటంగానే ఫిర్యాదులు చేస్తున్నారు. డబ్బులు ఇవ్వని వారికి అత్యవసర సమయాల్లో సెలవులు ఇవ్వరు. మెడ తిప్పనీయకుండా పనులు చెబుతూ ఆజమాయిషి చేలాయిస్తున్నారు. ఇదేమని ప్రశ్నించే అవకాశం ఇవ్వకుండా బయోమెట్రిక్ వారి చేతులోనే ఉంటుంది కావునా ఆడిందే ఆటగా ఎస్ఎఫ్ఎలు చలామని అవుతున్నారు. ఇదే విషయం ఉన్నతాధికారులకు తెలిసినా సున్నితంగా మందలించి వదిలేస్తూ పట్టీ పట్టనట్లుగా వ్యవహారిస్తున్నారని బాధితులు వాపోతున్నారు. ఒక్కో స్వీపరు వద్ద ప్రతినెలా రూ. 500 నుంచి రూ.1000 వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం. లేకపోతే వేధింపులు తప్పవని బాధితులు కిమ్మనకుండా అడిగినంతా ఇచ్చుకుంటున్నట్లు సమాచారం. జీహెచ్ఎంసీ పరిధిలోని ఉప్పల్ సర్కిల్లో ఎస్ఎఫ్ఎలు 22 మంది, జవాన్లు 11 మంది, 476 మంది స్వీపర్లు నిత్యం విధులు నిర్వహిస్తున్నారు. వీరంతా శానిటరీ సూపర్ వైజర్ ఆధీనంలో ఉంటూ పనిచేస్తున్నారు. ప్రస్తుతం డీఈ స్థానంలో గతంలో ఏఎంఓహెచ్ ఉండే వారు. గత సంవత్సర కాలంగా ఉప్పల్ సర్కిల్లో ఆ పోస్టు ఖాళీగానే ఉంది. అదే స్థానంలో సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్ డీఈని అపాయింట్ చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటాం.. ఎస్ఎఫ్ఐల వేధింపులు మా దృష్టికి రాలేదు. వేధింపులకు పాల్పడే వారిని గుర్తించి తగు చర్యలు తీసుకుంటాం. బాధితులు ఎవ్వరైన ఉంటే నేరుగా సంప్రదించి ఫిర్యాదు చేయాలి. ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతాం. బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. – చందన, సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్ డీఈ చదవండి: West Godavari: కాల్వలోకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరు మృతి -
Tirupati: సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో చిరుద్యోగి భారీ దందా
తిరుపతి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో ఆయన ఓ చిరుద్యోగి.. ఖరీదైన దుస్తులతో ఆర్భాటంగా కనిపిస్తాడు.. అధికారుల అండదండలతో రూ.కోట్లకు పడగలెత్తాడు.. సొంత సిబ్బంది సాయంతో యథేచ్ఛగా పైరవీలకు పాల్పడుతున్నాడు.. మామూళ్లు ముట్టజెప్పనిదే రిజిస్ట్రేషన్ సాగనివ్వడు.. తన ఆదేశాలను బేఖాతర్ చేస్తే నానా రభస సృష్టిస్తాడు.. ప్రశ్నించిన వారిని కించపరుస్తాడు.. అడ్డొచ్చిన వారిని హడలెత్తిస్తాడు.. కారుణ్య నియామకంతో ఉద్యోగంలో చేరి కార్యాలయాన్నే శాసిస్తున్నాడు.. బదిలీ చేసినా మళ్లీ యథాస్థానానికే పోస్టింగ్ తెచ్చుకున్న ఘనుడు.. వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన ఈ చిరుద్యోగి వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. సాక్షి, తిరుపతి(చిత్తూరు): తిరుపతి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో వాటాల రగడ చర్చనీయాంశంగా మారింది. కొందరు అధికారులు తమ అవసరాల కోసం పెంచి పోషించిన అవినీతి వృక్షం శాఖోపశాఖలుగా విస్తరించింది. పదేళ్ల క్రితం కారుణ్య నియామకం కింద కార్యాలయంలో చేరిన ఓ చిరుద్యోగి ధాటికి ప్రస్తుతం ఉన్నతాధికారులే హడలిపోయే పరిస్థితి ఏర్పడింది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో లోటుపాట్లను క్షుణ్ణంగా తెలిసిన సదరు ఉద్యోగి విధులు.. సిబ్బంది అడిగిన ఫైళ్లు, టీ, కాఫీలు తెచ్చివ్వడం. కానీ ఆయన ఏనాడూ ఆ పనిని చేసిన పాపాన పోలేదు. తాను సొంతంగా వేతనాలు చెల్లించి ముగ్గురు వ్యక్తులను నియమించుకుని, వారితో ఆయా పనులను చేయిస్తున్నాడు. వారి ద్వారా రిజిస్ట్రేషన్లకు సంబంధించిన లావాదేవీలను నడిపిస్తున్నాడు. ఆయన వైఖరిని భరించలేక బదిలీ చేసినా ట్రిబ్యునల్‌కు వెళ్లి మరీ తిరుపతి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయానికే పోస్టింగ్ తెచ్చుకోవడం గమనార్హం. రిజిస్టేషన్‌కు రూ.2వేలు ప్రతి రిజిస్ట్రేషన్‌కు రూ.2వేలను సదరు చిరుద్యోగికి సమర్పించాల్సిందే. ఇలా రోజుకు సుమారు వంద రిజిస్ట్రేషన్లు జరుగుతున్నట్లు తెలిసింది. తాను నియమించుకున్న వ్యక్తుల ద్వారా ఈ సొమ్మును వసూలు చేయిస్తుంటాడు. మామూళ్ల నగదులో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం సిబ్బందికి సైతం వాటాలు ఉన్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వాటాల పంపిణీలో వివాదం ఏర్పడడం వల్లే మంగళవారం సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో గొడవ జరిగిందని పలువురు గుసగుసలాడుకుంటున్నారు. ఒక చిరుద్యోగి ఇంత భారీస్థాయిలో అక్రమాలకు పాల్పడుతున్నా ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది. సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో పారదర్శక లావాదేవీలకు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయా? లేదా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అనధికారిక సిబ్బంది కార్యాలయంలో యథేచ్ఛగా సంచరిస్తున్నా చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. రూ.కోట్లకు పడగలెత్తాడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ప్రతి సమాచారం ఇట్టే తెలుసుకుంటాడు. ఆయన నియమించుకున్న ముగ్గురు అనధికారిక ఉద్యోగులు రోజూ ఎన్ని రిజిస్ట్రేషన్లు జరిగాయి.. ఎవరు ఏ పనిచేశారు.. ఎవరికి ఎంత ముట్టింది అనే విషయాలను ఎప్పటికప్పుడు సదరు చిరుద్యోగికి అందిస్తుంటారు. డాక్యుమెంట్ రైటర్స్ పైనా పెత్తనం చేస్తుంటారు. మాట వినకుంటే దౌర్జన్యాలకు సైతం దిగుతుంటారు. ఇందుకోసం ముగ్గురికి రోజూ రూ.6వేల చొప్పున ఇస్తుంటాడు. ఆయన మాత్రం కనీసం రూ.50వేలు జేబులో వేసుకోనిదే ఇంటికి వెళ్లే ప్రసక్తే ఉండదని తెలిసింది. అక్రమ సంపాదనతో రూ.కోట్లు కూడబెట్టినట్లు సమాచారం. తిరుపతి నగర నడిబొడ్డులో మూడు భవనాలు, విలాసవంతమైన మూడు కార్లు, ఖరీదైన ఐదు మోటారుసైకిళ్లు ఆయన సొంతం. ఇవి కాకుండా మరిన్ని విలువైన ఆస్తులు ఉన్నట్లు పలువురు సిబ్బంది చర్చించుకుంటున్నారు. ఆయన పూటకో వాహనంలో కార్యాలయానికి వస్తుంటాడు. చేతి పది వేళ్లకు ఉంగరాలు వేసుకుని ఖద్దర్ దుస్తులతో ఆర్భాటంగా తిరుగుతుంటాడు. చదవండి: నేపాలీ గ్యాంగ్: దోచేస్తారు.. దేశం దాటేస్తారు! -
హైవేపై కిలేడీ గ్యాంగ్.. సామాజిక సేవ పేరుతో..
సాక్షి, ఖిలా వరంగల్: ఏడుగురు సభ్యులతో కూడిన ఓ మహిళా ముఠా హైవేలపై తిష్ట వేసి వాహనదారులను లక్ష్యంగా చేసుకుని వసూళ్లకు పాల్పడుతున్నారు. జీన్స్ పాయింట్, టీషర్ట్ ధరించి ఉన్నారని వాహనం ఆపితే అంతే సంగతులు. స్వచ్ఛంద సంస్థలు, సామాజిక సేవ పేరుతో వాహనాలను నిలిపి చందాలు వసూళ్లు చేస్తున్నారు. ఇలాంటి ఘటనే మంగళవారం మధ్యాహ్నం వరంగల్– ఖమ్మం జాతీయ రహదారిపై బొల్లికుంట క్రాస్ రోడ్డు వద్ద జరగగా బుధవారం సాయంత్రం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వీరంతా రాజస్తాన్‌కు చెందిన మహిళలుగా అనుమానిస్తుండగా, మూఠాగా ఏర్పడి వచ్చి వెళ్లే వాహనదారులను చందాల పేరిట నిలువు దోపిడీ చేస్తున్నారు. వీరిని గమనించిన ఓ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి గట్టిగా నిలదీయడంతోపాటు సెల్ఫోన్లో వీడియో తీస్తుండగా ఆటోలో పరారయ్యారు. ఏడుగురు జీన్స్ పాయింట్, టీషర్ట్స్ ధరించి ఉన్నారని, సడన్‌గా వాహనం ఆపి సామాజిక సేవ పేరుతో డబ్బులు అడిగారని పలువురు తెలిపారు. ఈ విషయం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి మామునూరు పోలీసులు చేరుకుని వివరాలను సేకరించి గాలిస్తున్నట్లు తెలిసింది. -
దారి తప్పిన పోలీసు!
జిల్లాలోని కొందరు పోలీలసుల తీరు తరచూ వివాదాస్పదమవుతోంది. వారి వ్యవహార శైలి మొత్తం పోలీసు శాఖకే మచ్చ తెస్తోంది. క్రమశిక్షణతో ఉండాల్సిన ఖాకీలు కట్టు తప్పుతున్నారు. అక్రమార్జనలో కొందరు సిబ్బంది బరి తెగిస్తున్నారు.! వివాదాల్లో తల దూర్చడం, సెటిల్ మెంట్లు చేయడం, నిందితులకు కొమ్ము కాయడం, అక్రమార్కులతో చేతులు కలుపుతూ భారీగానే దండుకుంటున్నారు. ఇలాంటి వ్యవహారాలు ఇటీవలి కాలంలో తరచూ వెలుగు చూస్తున్నాయి. సంబంధిత అధికారులపై ఉన్నతాధికారులు వేటు వేస్తున్నా సిబ్బంది పనితీరు మాత్రం మారడంలేదు. తాజాగా ఇందల్వాయి ఎస్సై వ్యవహారంబయటకు రావడంతో పోలీసుల వ్యవహార శైలిపై జిల్లాలో మరోమారు చర్చ జోరుగా సాగుతోంది. తరచూ వెలుగులోకి.. క్రమశిక్షణతో కూడిన ఉద్యోగం, బాధ్యతాయుతంగా విధులు నిర్వహించడం, ప్రజల రక్షణ కోసం ప్రాణాలు అర్పించడం పోలీసు శాఖ ప్రధాన విధి.కానీ కొందరు అధికారుల తీరు ఆ శాఖకే మచ్చగా మారింది. కొందరు ఎస్సైలు, సీఐలు సివిల్ వివాదాల్లో తలదూర్చుతూ, అక్రమ దందాలను ప్రోత్సహిస్తూ డబ్బులు దండుకుంటున్నారనే ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నాయి. నిందితులు,బాధితుల నుంచి వసూళ్లు చేస్తున్న చేస్తున్న ఘటనలు తరచూ బయట పడుతున్నాయి. అక్రమంగా డబ్బులు తీసుకుంటూ ఏసీబీకి చిక్కడం, ఇతరఆరోపణలతో సస్పెన్షన్లకు గురికావడం జిల్లాలో సాధారణంగా మారింది. జిల్లాలో మూడు (నిజామాబాద్, బోధన్ ,ఆర్మూర్) పోలీసు సబ్ డివిజన్లు, వాటి పరిధిలో 33 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. ఇందులో కొన్ని ఠాణాల పరిధిలో ఇసుకతో పాటు కొన్ని అక్రమ దందాలు ఎక్కువగా నడస్తున్నాయి. మరికొన్ని స్టేషన్ల పరిధిలో లక్కీ డ్రాలు, గంజాయి, గుట్కా విక్రయాలువిచ్చలవిడిగా సాగుతున్నాయి. ఆయా ఠాణాల్లో పని చేసే పోలీసు అధికారుల తీరు తరచూ వివాదస్పదమవుతోంది. కొందరు పోలీసు అధికారులు అక్రమార్కులకు అండగా నిలబడడంతో పాటుఆడవారితో అసభ్యంగా ప్రవర్తించడం, అక్రమ సంబంధాలు వంటివి చర్చకు దారి తీస్తున్నాయి. నిందితులతో చేయి కలిపి.. కొన్ని కేసుల్లో పోలీసులు నిందితులతో చేతులు కలపడం విమర్శలకు తావిస్తోంది. కేసుల నుంచి తప్పించడంతో పాటు మామూలు సెక్షన్లు పెట్టి వదిలేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి!. ఇటీవలకమ్మర్పల్లి మండలం హాసాకొత్తూర్‌కు చెందినయువకుడి హత్య కేసులో నిందితుడికి పోలీసుస్టేషన్లో రాచమర్యాదలు చేయడం సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ఆ గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసు వాహనాన్ని ధ్వంసం చేయడంతో పాటు పోలీసులను గ్రామం నుంచి బయటకు వెళ్లగొట్టారు. నిందితుడికి రాచమర్యాదలు చేసిన ఘటనపై జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశం కావడంతో ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేయడంతో పాటు ఎస్‌హెచ్‌వోకు మోమో జారీ చేశారు. పేరుకే నెలవారీ సమీక్ష? పోలీసు శాఖలో ప్రతి నెలా నెలవారీ సమీక్ష నిర్వహించడం పరిపాటి. ఇందులో పోలీస్స్టేషన్లకు సంబంధించి క్రైం రేటు తగ్గించడం, బందోబస్తు, దొంగతనాల నివారణ తదితర అంశాలపై ఉన్నతాధికారులు చర్చిస్తారు. అలాగే కొందరు పోలీసులవ్యవహార శైలిపై ఈ సందర్భంగా హెచ్చరిస్తుంటారు. అయినా కొందరు అధికారుల తీరుమారడం లేదు. కట్టు తప్పుతున్న వారిపై ఉన్నతాధికారులు కొరఢా ఝళిపిస్తున్నా వారిలో మార్పుకనిపించక పోవడం గమనార్హం. అంతా ‘మామూలే’.. జిల్లాలోని కొందరు పోలీసులకు అక్రమ దందాలు వరంగా మారాయి. గుట్కా, గంజాయి, లక్కీ డ్రాల నిర్వాహకులు పెద్ద మొత్తంలో పోలీసు అధికారులకు ముట్టజెబుతున్నారన్న ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. ఆర్మూర్ డివిజన్ లోని బాల్కొండ కేంద్రంగా నిర్వహించే లక్కీ డ్రా సజావుగా సాగేందుకు నిర్వాహకులు.. ఓ అధికారికి నెలకు రూ.లక్ష లంచం ఇస్తున్నారంటే వసూళ్ల పర్వం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. జిల్లా కేంద్రంలోనూ 20 వరకు లక్కీ డ్రాలు నిర్వహిస్తుండగా, పోలీసులకు పెద్ద మొత్తంలో మామూళ్లు అందుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. నిబంధనలకు విరుద్ధంగా సాగే వ్యవహారాల్లో లంచాలు తీసుకుంటూ ఏసీబీకి దొరుకుతుండడంతో పోలీసు శాఖ పరువు బజారునపడుతోంది.నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం, లంచం తీసుకుంటూ పట్టుబడిన ఘటనల్లో చాలా మంది పోలీసులపై వేటు పడింది. బోధన్ లోని నకిలీ పాస్‌పోర్టుల వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగాసంచలనం రేపిన సంగతి తెలిసిందే. బంగ్లాదేశ్లకులకు పాస్‌పోర్టుల జారీలో డబ్బులు తీసుకొని సహకరింనట్లు విచారణలో తేలింది. దీంతో 75 నకిలీ పాస్‌పోర్టులు వెలుగులోకి వచ్చాయి. ఈ ఉదంతంలో ఎస్‌బీతో పాటు సివిల్ ఉన్నతాధిరి సిబ్బంది పోలీసు సిబ్బందిపై సస్పెండ్ చేశారు. మహిళా కానిస్టేబుల్‌తో అక్రమ సంబంధం కారణంగా ఆమె భర్త ఆత్మహత్యకు కారణమైన ఇందల్వాయి ఎస్సై శివప్రసాద్‌రెడ్డి ఉదంతం ఉమ్మడి జిల్లాలో చర్చకు దారి తీసింది. ఈ వ్యవహారం మొత్తం పోలీసు శాఖకే ఇబ్బందికరంగా మారింది. దీంతో ఆయనను సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇంకా ప్రొబేషనరీ గడువు కూడా పూర్తి చేసుకోని శివప్రసాద్‌రెడ్డి.. ఇందల్వాయి పరిధిలో అక్రమ ఇసుక రవాణా,లక్కీ డ్రాలు, వివిధ కేసుల్లో వసూళ్లకుపాల్పడి నట్లు ప్రచారం జరుగుతోంది.దంపతుల గొడవలో డబ్బులు తీసుకున్నట్లు ఆరోపణలు రావడంతో ధరల్లి ఎస్సై సస్పెండ్ కుగురయ్యారు. అక్కడి సీఐపై బదిలీ వేటు పడింది. ► ఓ కేసులో రూ. లక్ష విలువైన ఫోన్ ను లంచం తీసుకుంటూ బోధన్ లోని ఓ సీఐ ఏసీబీకి పట్టుబడడం అప్పట్లో జిల్లా వ్యాప్తంగా కలకలం రేపింది. ► కేసు విచారణలో బాధ్యతాయుతంగా వ్యవహరించండం లేదని నిజామాబాద్ రూరల్ ఎస్‌హెచ్‌వో మధుసూద¯న్గౌడ్పై వేటు పడింది. ► పెండింగ్ కేసులు పేరుకు పోవడంతో డిచ్పల్లి సీఐ వెంకటేశ్వర్లును సస్పెండ్ చేశారు. ► జిల్లాలో సీఐగా పని చేసిన జగదీష్‌ను.. కామారెడ్డి లో ఐపీఎఎస్‌ల బెట్టింగ్ వ్యవహారంలో లంచం తీసుకుంటూ పట్టుబడడంతో ఏసీబీ అరెస్టు చేసింది. ► టాస్క్ఫోర్సు పోలీసుల వ్యవహార శైలి మొదటినుంచి వివాదాస్పదంగా మారింది. ► ఇసుక తరలింపులో డబ్బులు తీసుకుంటున్నారని నందిపేట ఎస్సైపై ప్రజాప్రతినిధులు ఫిర్యాదు చేయడంతో అతనిపై బదిలీ వేటు పడింది. -
మావోయిస్టుల పేరిట వసూళ్లు
సాక్షి, సాలూరు (విజయనగరం): తాము మావోయిస్టులమని అడిగినంత డబ్బులు ఇవ్వకపోతే నీతోపాటు నీ కుటుంబాన్ని కూడా లేపేస్తామని బెదిరించిన వ్యవహారంలో నలుగురు వ్యక్తులను వలపన్ని పట్టుకుని రిమాండ్‌కు తరలించినట్టు పార్వతీపురం ఏఎస్పీ సుమిత్ గరుడ్ తెలిపారు. మంగళవారం సాయంత్రం సాలూరు సర్కిల్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఇన్చార్జి సీఐ రాంబాబుతో కలిసి ఏఎస్పీ మాట్లాడారు. సాలూరు మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన ఆర్నిపల్లి ధనుంజయ్‌నాయుడు సాలూరు పట్టణంలోని బంగారమ్మ కాలనీలో నివాసముంటూ లారీ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. అతని వద్ద లారీ క్లీనర్‌గా పని చేస్తున్న మక్కువ మండలం శంబరకు చెందిన భానుప్రకాష్, బంగారమ్మ కాలనీకి చెందిన విద్యాసారధి, మక్కువ మండలం చెముడు గ్రామానికి చెందిన కలిపిండి ఏడుకొండలు కలిసి డబ్బున్న వ్యక్తులను గుర్తించి, వారిని మావోయిస్ట్‌లమని ఫోన్లో బెదిరిస్తూ డబ్బులు వసూలు చేయడం ప్రారంభించారు. సోమవారం మక్కువ మండలం చెముడు గ్రామానికి చెందిన మినీ కాంట్రాక్టర్ అక్యాన రామినాయుడుకు ఫోన్ చేసి మావోయిస్ట్‌లమంటూ, తాము అడిగిన 3లక్షల రూపాయలు చెప్పిన చోటుకు తీసుకురావాలని, లేకపోతే నీతోపాటు నీ కుటుంబాన్ని లేపేస్తామని బెదించినట్టు తెలిపారు. మీ గ్రామానికి చెందిన ఇద్దరి నుంచి ఇలాగే డబ్బులు వసూలు చేసామని, ఇవ్వకపోతే పర్యావసానాలు ఎలా వుంటాయో వారిని అడిగి తెలుసుకోమని హెచ్చరించడంతో సదరు కాంట్రాక్టర్ తన స్నేహితుడికి ఉప్పందించాడన్నారు. దీంతో ఆయన మక్కువ ఎస్ఐ షేక్ శంకర్‌కు సమాచారం అందివ్వడంతో వలపన్ని పాచిపెంట మండలంలోని పారమ్మకొండ సమీపంలో నలుగురు వ్యక్తులను పట్టుకున్నామన్నారు. వారి నుంచి లక్షా 35వేల రూపాయల నగదు, నాలుగు సెల్ఫోన్లతో పాటు హోండా ఏక్టివా ద్విచక్ర వాహనాన్ని స్వాధీనపరచుకున్నామన్నారు. ఈ వ్యవహారంలో భాగస్వాములైన మరో ఇద్దరిని అరెస్ట్ చేయాల్సి వుందన్నారు. గతంలో అక్రమ వసూళ్లు ఇదిలా వుండగా గతంలో మక్కువ మండలం చెముడు గ్రామానికి చెందిన ఎల్ఐసీ ఏజెంట్ బోగి గౌరినా«ధ్ నుంచి వీరు 2లక్షల రూపాయలు, పార్టీ మారావంటూ మాజీ సర్పంచ్ బొంగు చిట్టినాయుడు నుంచి 3లక్షల రూపాయలను వసూలు చేసినట్టు ఏఎస్పీ వివరించారు. ఎవరైనా బెదిరింపులకు దిగితే తక్షణమే పోలీసులకు సమాచారం అందివ్వాలని ఆయన కోరారు. ఎస్ఐకు అభినందనలు ఎస్ఐగా కొత్తగా ఉద్యోగంలో చేరినప్పటికీ మక్కువ ఎస్ఐ షేక్‌శంకర్ చాకచక్యంగా వ్యవహరించారని ఏఎస్పీ ఆయనను అభినందించారు. సమాచారం బాధితుడి నుంచి అందకపోయినా వేరే వ్యక్తి ద్వారా విషయం తెలిసినా, చురుగ్గా వ్యవహరించి, నిందితులను పట్టుకున్నారన్నారు. సమావేశంలో పట్టణ ఎస్ఐ ఎస్ శ్రీనివాస్, సాలూరు రూరల్ ఎస్ఐ నరసింహమూర్తి పాల్గొన్నారు. -
బాలుడు కిడ్నాప్.. క్షేమం
సాక్షి, ఒంగోలు: జిల్లా కేంద్రమైన ఒంగోలు నగరంలో ఓ విద్యార్థి కిడ్నాప్‌నకు గురయ్యాడు. గురువారం సాయంత్రం పాఠశాల నుంచి ఇంటికెళ్తున్న గుర్రం ప్రణవ్(11) అనే బాలుడిని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. అనంతరం అతని తల్లిదండ్రుల నుంచి రూ.70 లక్షలు డిమాండ్ చేశారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగి కిడ్నాపర్ల కోసం గాలిస్తున్నారు. కాగా, గంటల వ్యవధిలోనే కిడ్నాప్ కేసును ఛేదించి కిడ్నాపర్ల ముఠాలోని ఒకరిని ప్రకాశంజిల్లా పోలీసులు గుంటూరులో అదుపులోకి తీసుకున్నారు. దీంతో బాలుడు క్షేమంగా ఉన్నాడు. తమ పిల్లవాడు తిరిగి రావడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. -
తెలిసినవాడే చంపేశాడు!
♦ వీడిన అభయ్ కిడ్నాప్,హత్య కేసు మిస్టరీ ♦ గతంలో పక్కింట్లో పనిచేస్తూ అభయ్‌తో స్నేహం చేసిన సాయి ♦ చనిపోయిన తర్వాత తండ్రితో బేరసారాలు.. ఆపై రెలైక్కి విజయవాడకు పరార్ ♦ ముగ్గురు నిందితులను పట్టుకున్న పోలీసులు! సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధానిలో పదో తరగతి విద్యార్థి అభయ్ కిడ్నాప్, హత్య కేసులో మిస్టరీ వీడింది! అభయ్‌ని చంపింది గతంలో వారింటి సమీపంలో పని చేసిన సాయిగా తేలింది. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఇతడు.. అదే ప్రాంతానికి చెందిన మరో ముగ్గురు నలుగురితో కలిసి ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. దుండగుల కోసం ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, రాజమండ్రి, శ్రీకాకుళం ప్రాంతాల్లో టాస్క్‌ఫోర్స్ బృందాలు గాలించాయి. శుక్రవారం సాయంత్రం రాజమండ్రిలో సాయితో పాటు మరో ఇద్దరు నిందితులను పట్టుకున్నట్లు తెలిసింది. కాగా, అభయ్ వినియోగించిన ద్విచక్ర వాహనాన్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పని కోసం వచ్చి కన్నేసి.. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు సమీప ప్రాంతానికి చెందిన సాయి బతుకుతెరువు కోసం నగరానికి వలస వచ్చాడు. అభయ్ కుటుంబం నివసించే ఓంకాలనీలోనే ఓ ఇంట్లో పని చేస్తూ ఇటీవలే మానేశాడు. అక్కడ పని చేస్తుండగా సమీపంలో ఉండే పిల్లలతో పరిచయం పెంచుకున్నాడు. తరచుగా అభయ్ సహా మరికొందరిని కలవడం, వారితో కలిసి క్రికెట్ ఆట డం చేసేవాడు. అభయ్ తండ్రి రాజ్‌కుమార్ పెద్ద వ్యాపారవేత్తని భావించిన సాయి.. అతడి వ్యాపార రహస్యాలు తెలుసుకున్నాడు. ప్రస్తుతం ఏపీలో ఉంటున్న సాయి.. ఆర్థిక ఇబ్బందులు నేపథ్యంలో తేలిగ్గా డబ్బు సంపాదించేందుకు ఈ కిడ్నాప్ స్కెచ్ వేశాడు. విజయవాడ, ఏలూరు పరిసర ప్రాంతాలకు చెందిన పరిచయస్తులు, స్నేహితులు నలుగురైదుగురితో ముఠా కట్టాడు. అభయ్‌ని కిడ్నాప్ చేసి డబ్బు గుంజాలని పథకం వేశాడు. పది రోజుల క్రితం నగరానికి వచ్చి ఓ ప్రాంతంలో షెల్టర్ ఏర్పాటు చేసుకున్నాడు. అక్కడ్నుంచే అభయ్ చదువుకునే ‘స్లేట్’ స్కూల్ వద్దకు వచ్చిపోతుండేవాడు. కిడ్నాప్ కుట్రకు ముందే మారుపేర్లతో నాలుగు సిమ్‌కార్డులు తీసుకున్నాడు. ఈ నంబర్‌తోనే కిడ్నాప్ తర్వాత రాజ్‌కుమార్‌కు ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేశాడు. మాటువేసి.. కాపుగాసి.. ఓంకాలనీలోని రాజ్‌కుమార్ ఇంటి ఎదురుగా ఖాళీ స్థలం ఉంటుంది. ఆ ప్రాంతానికి చెందిన పలువురు కార్లను అక్కడే పార్క్ చేసుకుంటారు. బుధవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలోనే అక్కడకు చేరుకున్న సాయి.. అభయ్ బయటకు వచ్చేం త వరకు ఎదురు చూశాడు. సాయంత్రం 4:30 గంటల ప్రాంతంలో అభయ్ తన ద్విచక్ర వాహ నం (స్కూటీ)పై జ్ఞాన్‌బాగ్‌కాలనీ సీతారాంపేట్‌లో ఉండే మహాలక్ష్మీ టిఫిన్ సెంటర్‌కు వెళ్లడం గమనించి అనుసరించాడు. అక్కడకు వెళ్లిన తర్వాత మాటలు కలిపిన సాయి... బాలుడిని ఎలాంటి అనుమానం రాకుండా తానే వాహనం నడుపుతూ దారుస్సలాం వరకు తీసుకువెళ్లాడు. అక్కడ అప్పటికే వాహనంలో సిద్ధంగా ఉన్న అనుచరులతో కలిసి అభయ్‌ను కిడ్నాప్ చేశాడు. సాయిని గుర్తించిన కవల సోదరుడు కిడ్నాప్ సమయంలో సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ఫీడ్‌ను పోలీసులు సేకరించారు. ఇందులో విద్యార్థిని వెనుక ఎక్కించుకుని వెళ్తున్న వ్యక్తిని అభయ్ కవల సోదరుడు అభిషేక్‌తోపాటు ఆ ప్రాంతానికి చెందిన ఇతరులు సాయిగా గుర్తించారు. అతడు ఓంకాలనీలో పని చేయడం, ఇటీవల తరచుగా స్కూలు వద్దకు రావడం, బుధవారం మధ్యాహ్నం అభయ్ ఇంటి ఎదురుగా తచ్చాడటం తదితర అంశాలను చెప్పడంతో కేసులో చిక్కుముడి వీడింది. ముక్కుకు టేపు వేయడంతో మృతి! అభయ్‌ను కిడ్నాప్ చేసి వాహనంలో తరలిస్తున్న కిడ్నాపర్లు.. బాలుడి నోటికి, చేతులకు సర్జికల్ టే పు చుట్టారు. ఈ టేపు ముక్కును కూడా కప్పేయడంతో అభయ్ మరణించి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. బాలుడు చనిపోయాడని తెలుసుకున్న కిడ్నాపర్లు.. మృతదేహాన్ని పార్శిల్ చేసి సికింద్రాబాద్‌లోని అల్ఫా హోటల్ వద్ద వదిలేసి అక్కడ్నుంచి రైల్లో విజయవాడ చేరుకున్నారని భావిస్తున్నారు. విజయవాడ రైల్వే స్టేషన్ సమీపంలో సెల్‌ఫోన్‌ను పడేసి ఉడాయించారు. ఈ సెల్‌ఫోన్ స్థానికంగా కొందరికి దొరకడంతో అక్కడకు వెళ్లిన టాస్క్‌ఫోర్స్ బృందాలు వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించాయి. గాలింపు తర్వాత ఓ నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అభయ్ చనిపోయిన తర్వాత కూడా దుండగులు రాజ్‌కుమార్‌తో బేరసారాలు చేశారు. ఇది పోలీసుల్ని తప్పుదోవ పట్టించడంతో పాటు, నగరం దాటి వెళ్లిపోవడానికే అయి ఉంటుందని అధికారులు అంటున్నారు. -
చంపేసి, ఆపై బేరసారాలు
► రాజధానిలో కిడ్నాపర్ల ఘాతుకం ► టెన్త్ విద్యార్థిని ఎత్తుకెళ్లి చంపేశారు ► మృతదేహాన్ని అట్టపెట్టెలో పెట్టి పడేశారు ► 10 కోట్లివ్వాలంటూ తండ్రిని బెదిరించారు ► పరిచయస్తుల పనేనని అనుమానం హైదరాబాద్: పదో తరగతి విద్యార్థిని గొంతు నులిమి చంపేశారు. అట్టపెట్టెలో కుక్కి పడేశారు. ఆ తర్వాత తీరిగ్గా తండ్రికి ఫోన్ చేసి, రూ.10 కోట్లివ్వాలంటూ పలుమార్లు బేరసారాలకు దిగారు! రాజధానిలో బుధవారం జరిగిన ఈ దారుణం కలకలం సృష్టించింది. హైదరాబాద్‌లోని షా ఇనాయత్‌గంజ్ ఓం కాలనీలో తమ్ముడి కుటుంబంతో పాటు కలిసి నివసిస్తున్న వ్యాపారవేత్త రాజ్‌కుమార్, అనురాధ దంపతులకు అభయ్ మోదానీ (16), అభిషేక్ మోదానీ కవల పిల్లలు. అబిడ్స్‌లోని స్లేట్ స్కూల్లో పదో తరగతి చదువుతున్నారు. అభయ్ గురువారం సాయంత్రం 4:30 ప్రాంతంలో జ్ఞాన్‌బాగ్‌కాలనీ సీతారాంపేట్ మహాలక్ష్మి టిఫిన్ సెంటర్లో ఇడ్లీ, దోశ తెచ్చేందుకు ఇంటి నుంచి బయల్దేరాడు. గంట దాటినా ఇంటికి రాకపోవడంతో తల్లి ఫోన్ చేసింది. 5 నిమిషాల్లో వస్తానని బదులిచ్చాడు. అరగంట దాటినా రాకపోవడంతో మరోసారి ఫోన్ చేయగా స్విచాఫ్ అయింది. ఆమె కంగారుపడి వెంటనే భర్తకు చెప్పింది. పరిసరాల్లో గాలించినా లాభం లేకపోవడంతో రాత్రి షా ఇనాయత్‌గంజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు నాలుగు బృందాలతో పలుచోట్ల గాలించినా లాభం లేకపోయింది. రాత్రి పదింటికి ‘7842276480’ నంబర్ నుంచి రాజ్‌కుమార్ మరదలు కవితకు కిడ్నాపర్లమంటూ ఫోన్ వచ్చింది. రూ.10 కోట్లిస్తే కొడుకును వదిలేస్తామన్న కిడ్నాపర్, మరోసారి ఫోన్ చేసి 5 కోట్ల వరకు రాజ్‌కుమార్‌తో బేరసారాలాడాడు. అంత డబ్బులేదని రూ.7 లక్షలు, బంగారం ఇవ్వగలనని ఆయన వేడుకున్నాడు. రాత్రి 10.25కు విషయాన్ని పోలీసులకు తెలిపాడు. దాంతో వారు వేట ముమ్మరం చేశారు. కిడ్నాపర్ సికింద్రాబాద్ నుంచి మాట్లాడినట్టు ఫోన్ లోకేషన్ ఆధారంగా గుర్తించారు. నాలుగు బృందాలు అక్కడ దుండగుల కోసం గాలించాయి. అట్టపెట్టెలో శవమైన బాలుడు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఎదురుగా అల్ఫా హోటల్ సమీపంలోని పెట్రోల్ బంకులో రాత్రి 10.30 సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు ఓ అట్టపెట్టె వదిలి వెళ్లడాన్ని సిబ్బంది గమనించారు. గంట తర్వాత కూడా అదక్కడే ఉండటంతో పోలీసులకు సమాచారమిచ్చారు. రాత్రి 11.30కు మారేడ్‌పల్లి పోలీసులు బాంబ్ స్క్వాడ్‌తో పరీక్షించి పెట్టె తెరిచి చూడగా బాలుడి మృతదేహం బయటపడింది. నోటికి, వెనక్కు విరిచిన చేతులకు దుండగులు ప్లాస్టర్ వేసి ప్లాస్టిక్ తాడుతో కట్టేశారు. అది అభయ్దని ఫొటోల ఆధారంగా గుర్తించారు. అతని జేబులోని రూ.750, చేతికున్న ఖరీదైన వాచీ అలానే ఉన్నాయి. మృతదేహాన్ని అల్ఫా వద్ద వదిలేశాక కూడా రాత్రి 11:14కు దుండగులు రాజ్‌కుమార్‌కు మళ్లీ ఫోన్ చేసి బేరసారాలకు దిగారు! ఆ సమయంలో వాళ్లు నల్లగొండ జిల్లాలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. తెలిసినవారి పనే! ఈ హత్య రాజ్‌కుమార్ కుటుంబానికి తెలిసిన వారి పనేనని, కక్షతోనో మరో కారణంతోనో ఘాతుకానికి ఒటిగట్టి ఉంటారని భావిస్తున్నారు. ఎందుకంటే బుధవారం సాయంత్రం ఇంటి నుంచి బయటికెళ్లిన అభయ్, కిడ్నాపర్‌గా భావిస్తున్న వ్యక్తితో కలిసి ద్విచక్రవాహనంపై వెళ్తుండటం స్థానిక సీసీ కెమెరాల్లో నమోదైంది. ఆ వాహనాన్ని కిడ్నాపర్లు దారుస్సలాం వద్ద వదిలేసి అభయ్‌ను కారులో తీసుకెళ్లినట్టు పోలీసులు భావిస్తున్నారు. కిడ్నాపర్లను అభయ్ గుర్తుపట్టిన కారణంగానే చంపేశారనుకుంటున్నారు. గురువారం గాంధీ మార్చురీలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించారు. వారి రోదనల మధ్య అఫ్జల్‌గంజ్ శ్మశానవాటికలో అంత్యక్రియలు జరిగాయి. ఆచూకీ చెబితే రూ.లక్ష దుండగుల ఆచూకీ చెప్పిన వారికి రూ.లక్ష రివార్డు ఇస్తామని హైదరాబాద్ పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి గురువారం రాత్రి ప్రకటించారు. అభయ్‌ను ద్విచక్ర వాహనం వెనుక ఎక్కించుకుని తీసుకువెళ్తూ సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ఫీడ్ ఫొటోలను ఆయన విడుదల చేశారు. సమాచారం తెలిసిన వారు పశ్చిమ మండల డీసీపీ ఏ.వెంకటేశ్వరరావు (9490616552) లేదా నగర పోలీసు వాట్సాప్ (9490616555)లకు తెలపాలని, వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని కొత్వాల్ స్పష్టం చేశారు. -
ముక్కులో పేపర్లు కుక్కి...
హైదరాబాద్ : పాతబస్తీలో సంచలనం రేపిన 15 ఏళ్ల అభయ్ కిడ్నాప్ మిస్టరీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసుకు సంబంధించి ముగ్గురు నిందితులను విజయవాడలో అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశౄరు. అరెస్ట్ చేసినవారిని విజయవాడ నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. ఈ సందర్భంగా వెస్ట్ జోన్ డీసీపీ వెంకటేశ్వరరావు గురువారం సాయంత్రం మీడియాతో మాట్లాడుతూ అభయ్‌ను హతమార్చింది బంధువులా, పని మనుషులా, ఇతర వ్యక్తులా అనేది తెలియాల్సి ఉందన్నారు. కిడ్నాపర్లు హత్య చేసిన తర్వాతే అభయ్ తండ్రికి ఫోన్ చేసి ఉంటారని అన్నారు. షాహీనాయత్ గంజ్‌లోని శ్రీకాలనీకి చెందిన అభయ్.. బుధవారం మధ్యాహ్నం అల్పాహారం తెచ్చుకునేందుకు బయటకొచ్చాడు. అప్పటికే పక్కా ప్లాన్‌తో ఉన్న దుండగులు అభయ్‌ను కిడ్నాప్ చేశారు. అభయ్ ఇంటికి రాకపోవడంతో కంగారుపడ్డ తల్లిదండ్రులు సాయంత్రం 5గంటల సమయంలో స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు... అభయ్ కోసం వెతకడం మొదలుపెట్టారు. బుధవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో కిడ్నాపర్ల నుంచి అభయ్ తండ్రికి ఫోన్ వచ్చింది. త్రరూ. 10 కోట్లు ఇవ్వాలంటూ అభయ్ తండ్రి రాజ్ కుమార్ కు దుండగులు ఫోన్ చేశారు. తండ్రి అందుకు నిరాకరించడంతో అభయ్ ముక్కులో పేపర్లు కుక్కి శ్వాస ఆడకుండా చేసి హత్య చేసినట్టు సమాచారం. మరోవైపు అభయ్ తల్లిదండ్రులతో నిందితుల ఫోన్ సంభాషణ ఆడియో టేపులు విడుదలయ్యాయి. కిడ్నాపర్లు అభయ్ తండ్రికి ఫోన్ చేసి 10 కోట్లు డిమాండ్ చేశారు. అయితే రాత్రికి రాత్రే ఐదు కోట్లు ఇవ్వాలని పట్టుబట్టారు. లేకుంటే అభయ్ ప్రాణాలతో దక్కడని బెదిరించాడు. కనీసం 5 కోట్లు అయినా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇప్పటికిప్పుడు అంత డబ్బు తన దగ్గర లేదని, 20 లక్షల వరకైతే ఇవ్వగలనని అభయ్ తండ్రి ప్రాధేయపడ్డాడు. అయినా కిడ్నాపర్లు కనికరించలేదు.. డబ్బు తీసుకుని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు రావాలని చెప్పి కిడ్నాపర్ ఫోన్ పెట్టేశాడు. ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ కిడ్నాపర్లు అభయ్‌ను హతమార్చి, మృతదేహాన్ని అట్టపెట్టెలో పెట్టి సికింద్రాబాద్ ఆల్ఫా కేఫ్ వద్ద వదిలి పరారయ్యారు. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు....కాటన్ బాక్స్‌ను ఓపెన్ చేసి చూడడంతో మృతదేహం బయటపడింది. కాగా అభయ్ మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయింది. -
విషాదంగా మారిన అభయ్ కిడ్నాప్
హైదరాబాద్: పాతబస్తీలో బుధవారం కిడ్నాప్ అయిన బాలుడి కథ విషాదంగా ముగిసింది. పాతబస్తీలో నిన్న కిడ్నాపయిన బాలుడు దారుణహత్యకు గురయ్యాడు. 15 ఏళ్ల అభయ్ ని కిడ్నాపర్లు హత్య చేశారు. పోలీసులు తెలిపిన వివారల ప్రకారం... బుధువారం మధ్యాహ్నం షాహినాయత్ గంజ్ కు చెందిన అభయ్ కిడ్నాప్ అయ్యాడు. సాయంత్రం 5 గంటలకు ఆ బాలుడి తల్లిదండ్రులు షాహినాయత్ గంజ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రాత్రి 11 గంటలు దాటిన తర్వాత రూ. 10 కోట్లు ఇవ్వాలంటూ అభయ్ తండ్రి రాజ్ కుమార్ కు దుండగులు ఫోన్ చేశారు. తండ్రి అందుకు నిరాకరించడంతో బాలుడిని చంపి మృతదేహాన్ని కాటన్ బాక్స్ లో పెట్టి సికింద్రాబాద్ ఆల్ఫా హోటల్ సమీపంలో దుండగులు వదిలివెళ్లారు. విచారణ వేగవంతం చేసినట్లు పోలీసులు తెలిపారు.