సాక్షి, హైదరాబాద్ : హవాలా అక్రమ మనీ రవాణా దందాను కొనసాగిస్తున్న ముఠాను హైదరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. మొత్తం అయిదుగురు.. ఎమ్ ఈశ్వర్‌రెడ్డి, రాజేష్ శర్మ, రాంరాజ పరం, ప్రకాష్ సింగ్, విశాల్ సావాత్‌ను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి రూ. కోటి 1 లక్ష యాభై వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. పోలీసులకు అందిన సమాచారం మేరకు రాజ్ కుమార్ ట్రావెలింగ్ బ్యాగ్‌లో డబ్బులు తరలిస్తుండగా పట్టుకున్నామని హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ తెలిపారు. స్వీట్ హౌజ్ యాజమాని ఈశ్వర్‌రెడ్డి ద్వారా మిగతా నలుగురిని విచారణ చేశామని, దీనిపై విచారణ కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు.
మరోవైపు డ్రగ్స్ రవాణా చేస్తున్న ముఠాలోని ముగ్గురిని సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో ముగ్గురు ముఠా సభ్యులు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. వీరి నుంచి 5 గ్రాముల హెరాయిన్, 28 ఎల్ ఎస్టీ స్లీప్స్, 32 లంఫేటమిన్ డ్రగ్ ప్యాకెట్లు, 3 కిలీల గంజా స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ 2.5 లక్షలు ఉంటాయని తెలిపారు. గ్యాంగ్ లీడర్‌గా ప్రాన్సిస్ జేవియర్ తమిళనాడుకు చెందిన వ్యక్తిగా పోలీసులు పేర్కొన్నారు. 25 ఏళ్ల క్రితమే ఫ్రాన్సిస్ కుటుంబం హైదరాబాద్‌కు వచ్చిందని. ఫ్రాన్సిస్‌కు ఇంటర్ నుంచే డ్రగ్స్ అలవాటు ఉన్నట్లు విచారణలో తేలిందన్నారు. అలాగే బార్, హోటళ్ల యాజమానులు జాగ్రత్తగా ఉండాలని, న్యూ ఇయర్ వేడుకల్లో ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకూడదని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment