Headmaster sexual harassment
-
క్లాసులంటూ పిలిచి.. పసిమొగ్గలపై అఘాయిత్యం
సాక్షి, కొత్తగూడెం : చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన గురువే కీచకుడిగా మారాడు. స్కూళ్లు తెరవకున్నా క్లాసులు చెబుతానంటూ తీసుకొచ్చి మరీ విద్యార్థినులపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన వివరాలు మంగళవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం మైలారం గ్రామపంచాయతీ పరిధిలోని చింతవర్రెలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో 11 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరిలో ఐదుగురు బాలికలున్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు దొడ్డే సునీల్‌కుమార్ వీరిపై కొద్దిరోజులుగా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. ఈ విషయం ఎవరిౖకైనా చెబితే చంపేస్తానని చిన్నారులను బెదిరించాడు. దీంతో భయపడ్డ వారు మిన్నకుండి పోయారు. చదవండి: పరువు పోయిందని.. ప్రాణం తీసుకుంది ఈ క్రమంలోనే లైంగికదాడి కారణంగా ఓ విద్యార్థిని ఆస్పత్రి పాలైంది. ఈ విషయం విద్యార్థిని తల్లిదండ్రులకు తెలియగా.. మిగిలిన విద్యార్థినుల తల్లిదండ్రులతో కలసి ఆ హెచ్ఎంను నిలదీశారు. గత రెండ్రోజులుగా ఈ విషయంపై మరో పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ నిర్వహించాడు. అది కాస్త బయటకు పొక్కడంతో గ్రామస్తులందరూ ఉపాధ్యాయుడిని మంగళవారం నిలదీసి దేహశుద్ధి చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు, తహసీల్దార్ భద్రకాళి, ఎంపీడీఓ రామారావు, సీడీపీఓ కనకదుర్గ, సీఐ గురుస్వామి, ఎస్సై అంజయ్య, రెవెన్యూ అధికారులు సంఘటన స్థలానికి వెళ్లి ఆ చిన్నారులతో మాట్లాడారు. గ్రామస్తులు, తల్లిదండ్రులతో విషయంపై చర్చించారు. పోలీసులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు. ఈ నేపథ్యంలోనే డీఈఓ సోమశేఖరశర్మ.. సునీల్‌కుమార్‌ను సస్పెండ్ చేసినట్లు ప్రకటించారు. దీనిపై స్థానిక ఎస్సై అంజయ్యను వివరణ కోరగా.. ఆస్పత్రిలో చేరిన విద్యార్థిని తల్లి ఫిర్యాదు మేరకు నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. -
కీచకోపాధ్యాయుడు
తండ్రి తర్వాత తండ్రిలా వ్యవహరించాల్సిన ప్రధానోపాధ్యాయుడు గతి తప్పాడు.విద్యార్థినుల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తూ వచ్చాడు. విద్యాబుద్ధులు నేర్పించాల్సిన సమయంలో సహ ఉపాధ్యాయినిల పట్ల కీచకుడిగా మారాడు. ఈ పరిస్థితి ఎక్కడో కాదు.. తాడిపత్రిలోని టైలర్స్ కాలనీలో ఉన్న శ్రీ ప్రకాశం మున్సిపల్ ఉన్నత పాఠశాలలోనిది. ప్రధానోపాధ్యాయుడివైఖరితో విసుగు చెందిన బాధితులు వారం రోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినా ఎలాంటి ఫలితం దక్కలేదు. కీచకోపాధ్యాయుడిపై కేసు నమోదు చేసి, అరెస్ట్ చేయాల్సిన పోలీసులు మీనమేషాలు లెక్కిస్తూ వచ్చారు.చివరకు సమస్యపై స్పందించిన సీఎం పేషీ.. తక్షణమేఆ కీచక ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేయాలంటూ ఉత్తర్వులుజారీ చేసింది. వివరాల్లోకి వెళితే.. అనంతపురం, తాడిపత్రి: తాడిపత్రిలోని శ్రీ ప్రకాశం మున్సిపల్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎం.వి.నటరాజ్ వైఖరి వివాదస్పదంగా మారింది. వందల సంఖ్యలో ఇక్కడ బాల, బాలికలు ఆరు నుంచి పదో తరగతి వరకు చదువుకుంటున్నారు. స్కూల్ అసిస్టెంట్ స్థాయి నుంచి హెచ్ఎం వరకూ ఐదేళ్లుగా ఈ పాఠశాలలో పనిచేస్తూ వస్తున్న నటరాజ్.. తరగతి గదుల్లో పాఠాలు చెప్పకుండా అనుచిత ప్రవర్తనలతో విద్యార్థులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంటాడు. అతని వెకిలి చేష్టలకు చిన్నారుల మనసులు గాయపడ్డాయి. విషయాన్ని తల్లిదండ్రులకు గాని, ఇతరులకు గాని చెబితే హాజరుపట్టిలో అబ్సెంట్ వేస్తానని బెదిరిస్తూ తన పబ్బం గడుపుకుంటూ వచ్చాడు. మాట కాదంటే పైశాచికం తన మాట వినలేదన్న అక్కసుతో గతంలో ఎనిమిదో తరగతి విద్యార్థి వెంకటరమణను నటరాజ్ తీవ్రంగా చితకబాదాడు. ఘటనలో వెంకటరమణ చెయ్యి విరిగింది. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. రూ.30 వేలు చెల్లిస్తూ దుప్పటి పంచాయితీతో బయటపడ్డాడు. స్కూల్ అసిస్టెంట్‌గా ఉంటూ వచ్చిన నటరాజ్ ఈ ఏడాది జూన్ 19న ప్రధానోపాధ్యాయుడిగా ప్రమోషన్ పొంది, తిరిగి ఇదే పాఠశాలలో బాధ్యతలు స్వీకరించాడు. హెచ్ఎం అన్న అహంకారంతో అతను మరింత రెచ్చిపోతూ.. ఈ సారి ఏకంగా ఉపాధ్యాయినులను టార్గెట్ చేస్తూ వచ్చాడు. అతని వెకిలి చేష్టలతో విసుగు చెందిన ఉపాధ్యాయినులు.. గ్రీవెన్స్‌లో మండల స్థాయి అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై అతన్ని అప్పటి తహసీల్దార్ రామకృష్ణారెడ్డి, ఎంఈఓ, మున్సిపల్ కమిషనర్ తీవ్రంగా మందలించారు. అయినా అతనిలో మార్పు రాలేదు. ఉపాధ్యాయినుల పట్ల మరింత వేధింపులు మొదలయ్యాయి. ఎవరికీ చెప్పుకోలేని స్థితిలో మహిళా టీచర్లు ఇబ్బంది పడుతూ వచ్చారు. తన మాట వినకపోతే కులం పేరుతో దూషిస్తున్నాడంటూ నటరాజ్‌పై ఇద్దరు మహిళా టీచర్లు ఈ నెల 9న పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద పోలీసులు కేసు నమోదు చేశారు కానీ, నటరాజ్ అరెస్ట్ చూపలేకపోయారు. పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న నటరాజ్‌ను తక్షణమే సస్పెండ్ చేయాలంటూ ఈ నెల 11న సీఎం పేషీ నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. విషయం తెలుసుకున్న నటరాజ్ అప్పటి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. -
యోగా పేరుతో హెచ్ఎం వికృతచేష్టలు
అనంతపురం : చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన టీచర్లే వక్రబుద్ధితో ప్రవర్తిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఉపాధ్యాయుల వికృతచేష్టలకు తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మహబూబాబాద్‌లో సోమవారం ఉపాధ్యాయుడి వెకిలిచేష్టలు మరువాక ముందే తాజాగా అనంతపురం జిల్లాలో మరో ప్రధానోపాధ్యాయుడు అసభ్యకర ప్రవర్తన వెలుగులోకి వచ్చింది. పాఠశాలలోనే మద్యం తాగటంతోపాటు విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న ప్రధానోపాధ్యాయుడు తమకొద్దంటూ గార్లదిన్నె మండలం యర్రగుంట్ల గ్రామస్తులు ఆందోళనకు దిగారు. గ్రామంలోని ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయునిగా పనిచేస్తున్న విజయభాస్కర్ చేష్టలతో విద్యార్థులు బయటపడుతున్నారు. ఐదో తరగతి విద్యార్థులకు పాఠాలు బోధించే సమయంలో విద్యార్థులను యోగా పేరిట కళ్లు మూసుకోమని మద్యం తాగి..బాటిల్‌ను బయటకు విసిరేసేవాడు. అలాగే విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. ఇతని చేష్టలకు విసుగు చెందిన తల్లిదండ్రులు మంగళవారం పాఠశాలకు తాళం వేశారు. హెచ్ ప్రవర్తనపై ఎంఈఓ సత్యనారాయణ దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన పాఠశాలకు చేరుకున్నారు. విజయభాస్కర్‌పై రాతపూర్వకంగా తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఎంఈవో స్పందిస్తూ ఆయన్ను డీఈవోకు సరెండర్ చేస్తామని చెప్పారు.