ప్రమాదపు అంచుల్లో..
పుల్కల్: ఓ ట్రాక్టర్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల కొంతసేపైతే కొన్ని ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి. కానీ చివరి నిమిషంలో ట్రాక్టర్ ముందుకు వెళ్లలేని పరిస్థితుల్లో ఆ ప్రమాదం తప్పిపోవడంతో అందులో ప్రయాణిస్తున్నవారు ఊపిరి పీల్చుకున్నారు. సింగూర్ ప్రాజెక్టు 9 గేట్ల ద్వారా శనివారం మధ్యాహ్నం నీటిని విడుదల చేశారు. దీంతో ఉధృత్తగా ప్రవహిస్తున్న నీరు రోడ్డుపైకి వచ్చి చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి.
ఈ క్రమంలో సుమారు 15 నుంచి 20 మందిని తీసుకొని మలపాడ్ వైపు నుంచి సింగూర్ వైపు ఒక ట్రాక్టర్ వస్తోంది. రోడ్డు మధ్యలోకి రాగానే నీరు ట్రాక్టర్ ఇంజన్ మునిగిపోయే వరకు చేరింది. అప్పటికే పోలీసులు రావద్దు అని అరుస్తున్నా ట్రాక్టర్ డ్రైవర్ ముందుకు వచ్చే ప్రయత్నం చేశాడు. కానీ నీటి ఉధృతి పెరగడంతో వెనక్కి వెళ్లాడు.