Heavy investments
-
ఎఫ్‌పీఐల దూకుడు
న్యూఢిల్లీ: విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు) భారత ఈక్విటీల పట్ల దూకుడు వైఖరి ప్రదర్శిస్తున్నారు. గడిచిన కొన్ని నెలలుగా అమ్మకాలు సాగిస్తూ వచ్చిన ఎఫ్‌పీఐలు, ఈ నెలలో మాత్రం భారీ పెట్టుబడులకు మొగ్గు చూపించారు. డిసెంబర్ నెలలో మొదటి ఆరు ట్రేడింగ్ రోజుల్లో (8వ తేదీ నాటికి) ఏకంగా రూ.26,505 కోట్ల మేర కొనుగోళ్లు చేశారు. ఇటీవల ఎన్నికల ఫలితాలు బీజేపీకి అనుకూలంగా ఉండడం, మూడు రాష్ట్రాల్లో బీజేపీ బంపర్ మెజారిటీ సాధించడంతో 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత ప్రస్తుత ప్రభుత్వమే కొనసాగుతుందన్న స్పష్టత ఎఫ్‌పీఐల్లో సానుకూలతకు దారితీసింది. అక్టోబర్ నెలలోనూ ఎఫ్‌పీఐలు నికరంగా రూ.9,000 కోట్ల పెట్టుబడులు పెట్టారు. అంతకుముందు ఆగస్ట్, సెపె్టంబర్ నెలలో రూ.39,300 కోట్ల మేర పెట్టుబడులను వారు ఉపసంహరించుకోవడం గమనార్హం. ఇక మీదట ఎఫ్‌పీఐల పెట్టుబడులు కొనసాగుతాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజిస్ట్ వీకే విజయ్‌కుమార్ అభిప్రాయపడ్డారు. రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో రాజకీయ స్థిరత్వం కొనసాగుతుందన్న సంకేతాల ఫలితమే ఎఫ్‌పీఐల పెట్టుబడులు భారీగా రావడానికి కారణమని ఫిడెల్‌ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్ వ్యవస్థాపకుడు కిస్లే ఉపాధ్యాయ పేర్కొన్నారు. ‘‘2024 సాధారణ ఎన్నికల అనంతరం రాజకీయ స్థిరత్వం, భారత ఆర్థిక వ్యవస్థ బలమైన పనితీరు, ద్రవ్యోల్బణం తగ్గడం, అమెరికా బాండ్ ఈల్డ్స్ స్థిరంగా తగ్గుతూ వస్తుండడం, బ్రెండ్ క్రూడ్ ధరల్లో దిద్దుబాటు భారత్‌కు అనుకూలించే అంశాలు’’అని విజయ్ కుమార్ వివరించారు. వీటిల్లో పెట్టుబడులు ‘‘వచ్చే ఏడాది మొదటి త్రైమాసికం నుంచి రేట్ల కోత ఉంటుందని యూఎస్ ఫెడరల్ రిజర్వ్ సంకేతం ఇవ్వడం, అధిక వడ్డీ రేట్ల వాతావరణం నుంచి మళ్లనున్నట్టు సూచించడమే అవుతుంది. దీంతో ఇతర కరెన్సీలతో యూఎస్ డాలర్ బలహీనపడడం మొదలైంది’’అని మార్నింగ్ స్టార్ ఇండియా రీసెర్చ్ మేనేజర్ హిమాన్షు శ్రీవాస్తవ తెలిపారు. యూఎస్ ట్రెజరీ బాండ్ ఈల్డ్స్ క్షీణించడంతో ఎఫ్‌పీఐలు భారత ఈక్విటీల్లో ఉన్న రిస్్క–రాబడుల తీరును తిరిగి మదించడానికి దారితీసినట్టు చెప్పారు. బ్యాంకులు, ఐటీ, టెలికం, ఆటోమొబైల్, క్యాపిటల్ గూడ్స్ కంపెనీల్లో ఎఫ్‌పీఐల కొనుగోళ్లు ప్రధానంగా ఉన్నాయి. ఈ ఏడాది మొత్తం మీద ఇప్పటి వరకు ఎఫ్‌పీఐలు ఈక్విటీల్లో రూ.1.31 లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేయగా, డెట్ మార్కెట్లో రూ.55,867 కోట్ల పెట్టుబడులు పెట్టారు. -
వృద్ధి అవకాశాల్లో భారత్ నెంబర్ వన్
న్యూఢిల్లీ: అమెరికా నెట్వర్క్ పరికరాల తయారీ సంస్థ– సిస్కో భారత్‌లో తన భారీ పెట్టుబడుల ప్రణాళికలను ప్రకటించింది. రూటర్లు, స్విచ్‌ల వంటి ఉత్పత్తుల తయారీకి సంబంధించిన భారత ప్రణాళికలను చైర్మన్, సీఈఓ చక్ రాబిన్స్ ప్రకటించారు. డిజిటల్ మౌలిక సదుపాయాలపై దేశం అద్భుతమైన పురోగతిని సాధించిందని పేర్కొంటూ, వచ్చే దశాబ్దపు వృద్ధి అవకాశాలకు సంబంధించి భారత్ మొదటి అవకాశంగా ఉందని అన్నా రు. తయారీ రంగానికి కేంద్రంగా భారత్ రూపుదిద్దుకుంటోందని ఆయన అన్నారు. బహుళ పథకా లు ఇందుకు దోహదపడుతున్నట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తమ తయారీ కార్యకలాపాలు సిస్కో కాంట్రాక్ట్ తయారీదారుల ద్వారా ప్రారంభమవుతాయని తెలిపారు. బిలియన్ డాలర్ల ఎగుమతులు సమీపకాలంలో జరుగుతాయని తాము భావిస్తున్నామన్నారు. ప్రధాని నరేంద్రమోదీ, విదేశాంగమంత్రి ఎస్ జైశంకర్ తదితర సీనియర్ అధికారులతో ఆయన సమావేశమయ్యారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీతో ఆయన భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ముఖ్యాంశాలు... ► ప్రపంచ స్థూల ఆర్థిక అనిశ్చితులు, అమెరికా బ్యాంకింగ్ సంక్షోభం భౌగోళిక రాజకీయ భయాల నేపథ్యంలో టెక్ డిజిటలైజేషన్ వ్యూహాత్మక విలువ మందగించాలి. కానీ అలా జరక్కపోవడం హర్షణీయం. పైగా ఇది పురోగతి బాటన నడుస్తోంది. టెక్నాలజీకి సంబంధి ప్రతి దేశం సాధిస్తున్న విజయానికి ఇది సంకేతం. ► డిజిటలైజేషన్, 5జీ రోల్అవుట్, నైపుణ్య సామర్థ్యాలు, స్టార్టప్ వ్యవస్థ దీనిని బలపరిచే మౌలిక వ్యవస్థ భారత్‌కు కలిసివస్తున్న అంశాలు. ► భారత్ డిజిటలైజేషన్లో భారీగా పురోగమించింది. మహమ్మారి సమయంలో అలాగే తీవ్ర సవా ళ్ల సమయాల్లో డిజిటలైజేషన్లో దేశం పటిష్ట పురోగతిని సాధించింది. పురోగతి విషయంలో భారత్ ఆశయం చాలా స్పష్టంగా ఉంది. ఇది హర్షణీయ పరిణామం. ప్రధానమంత్రి, పలువురు మంత్రులు, పారిశ్రామికవేత్తలు అనేక అంశాల గురించి మాట్లాడారు. తయారీ నుంచి నైపుణ్యత, సిస్కో కార్యకలాపాలు, ఆర్టిఫిషీయల్ ఇంటిలిజెన్స్, 5జీ, సుస్థిర అభివృద్ధి వరకూ అన్ని అంశాలపై ప్రధాని మోదీతో చర్చించడం జరిగింది. భారతదేశంలో తయారీ పురోగతి విషయంలో సహకారం ఇచ్చే విషయంలో మా నిబ ద్ధతను ఈ సందర్భంగా పునరుద్ఘాటించాను. ► ఒక్క డిజిటలైజేషన్‌లోనే కాదు. భౌతికంగా మౌలిక సదుపాయాల కల్పనలోనూ భారత్ దూసుకుపోతోంది. ► మేడిన్ ఇండియా సిస్కో ప్రొడక్టులు ఈ ప్రాంతానికి, యూరప్‌కు ఎగుమతి అవుతాయి. దేశంలో క్రమంగా మా వ్యాపార కార్యకలాపాలను విస్తరిస్తాం. ముఖ్యంగా 5జీ పై మాకు ఎక్కువ ఆసక్తి ఉంది. ప్రతి చోటకూ కనెక్టివిటీ హైస్పీడ్‌కు దోహపపడే అంశం ఇది. ► ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ రంగంలో చోటుచేసుకుంటున్న ఉద్యోగాల కోత ఫలితాలు, పర్యవసానాలు మున్ముందు ఎలా మారతాయన్న విషయాన్ని ఇప్పుడే చెప్పలేం. విదేశాంగశాఖ మంత్రి ఎస్ జైశంకర్‌తో సిస్కో సీఈఓ చక్ రాబిన్స్ భేటీ -
భారత్‌కు గూగుల్ దన్ను!
న్యూఢిల్లీ: టెక్ దిగ్గజం గూగుల్ తాజాగా భారత్‌లో భారీ పెట్టుబడి ప్రణాళికలను ఆవిష్కరించింది. వచ్చే 5–7 సంవత్సరాల్లో సుమారు రూ. 75 వేల కోట్లు (దాదాపు 10 బిలియన్ డాలర్లు) ఇన్వెస్ట్ చేయనున్నట్లు కంపెనీ సీఈవో సుందర్ పిచాయ్ వెల్లడించారు. ఇందుకోసం గూగుల్ ఫర్ ఇండియా డిజిటైజేషన్ ఫండ్ ఏర్పాటును ప్రకటించారు. ’గూగుల్ ఫర్ ఇండియా’ కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సోమవారం పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు వెల్లడించారు. భారత్‌పైనా, భారత డిజిటల్ ఎకానమీ భవిష్యత్‌పైనా తమ కంపెనీకి ఉన్న నమ్మకాన్ని తాజా పెట్టుబడులు ప్రతిబింబిస్తాయని పిచాయ్ తెలిపారు.‘గూగుల్ ఫర్ ఇండియా డిజిటైజేషన్ ఫండ్ ఆవిష్కరిస్తున్నందుకు సంతోషంగా ఉంది. దీని ద్వారా వచ్చే 5–7 ఏళ్లలో భారత్‌లో రూ. 75,000 కోట్లు (సుమారు 10 బిలియన్ డాలర్లు) ఇన్వెస్ట్ చేస్తాం. ఈక్విటీ, వ్యూహాత్మక భాగస్వామ్యాలు, ఇతరత్రా మౌలిక సదుపాయాల కల్పన తదితర మార్గాల్లో ఈ పెట్టుబడులు ఉంటాయి‘ అని పిచాయ్ తెలిపారు. నాలుగు ప్రధానాంశాలపై దృష్టి... భారత్ డిజిటలీకరణకు తోడ్పడేలా ప్రధానంగా నాలుగు విభాగాల్లో ఈ ఇన్వెస్ట్మెంట్లు ఉంటాయని సుందర్ తెలిపారు. ప్రతి భారతీయుడికి తమ తమ ప్రాంతీయ భాషల్లో సమాచారం అందుబాటులో ఉండేలా చూసే ప్రాజెక్టు కూడా ఇందులో ఒకటని వివరించారు. అలాగే, ప్రత్యేకంగా భారత్ అవసరాలకు అనుగుణంగా కొత్త ఉత్పత్తులు, సర్వీసుల రూపకల్పనపైనా ఇన్వెస్ట్ చేయనున్నట్లు సుందర్ పేర్కొన్నారు. వ్యాపార సంస్థలు డిజిటల్‌కు మళ్లేందుకు అవసరమైన తోడ్పాటు అందిస్తామన్నారు. చివరిగా సామాజిక శ్రేయస్సుకు తోడ్పడేలా వైద్యం, విద్య, వ్యవసాయం వంటి రంగాలు మరింత మెరుగుపడేలా టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)ని మరింత వినియోగంలోకి తేవడంపై దృష్టి పెడతామని సుందర్ తెలిపారు. భారత్ ప్రత్యేకం... ప్రస్తుతం భారతీయులు టెక్నాలజీ తమ దాకా వచ్చేంత వరకూ నిరీక్షించాల్సిన అవసరం ఉండటం లేదని.. కొత్త తరం టెక్నాలజీలు ముందుగా భారత్‌లోనే ఆవిష్కృతమవుతున్నాయని సుందర్ తెలిపారు. ‘భారత్‌తో పాటు యావత్ ప్రపంచం ప్రస్తుతం గడ్డుకాలం ఎదుర్కొంటోందని అనడంలో సందేహం లేదు. మన ఆరోగ్యాలు, మన ఆర్థిక వ్యవస్థలకు ఎదురైన పెను సవాళ్లు.. మన పనితీరును, జీవన విధానాలను పునఃసమీక్షించుకునేలా చేశాయి. అయితే, ఇలాంటి సవాళ్లే కొంగొత్త ఆవిష్కరణలకు దారితీస్తాయి‘ అని ఆయన పేర్కొన్నారు. కొత్త తరం ఆవిష్కరణలతో ప్రయోజనం పొందడం మాత్రమే కాదు.. వాటి రూపకల్పనలోనూ భారత్ ముందుండేలా చూడటం తమ లక్ష్యమని సుందర్ చెప్పారు. ముందుగా భారత్ కోసం ఉత్పత్తులు తయారు చేయడమన్నది.. మిగతా ప్రపంచ దేశాలకు మరింత మెరుగైన ఉత్పత్తులను అందించే దిశలో గూగుల్‌కు ఎంతగానో ఉపయోగపడిందని గూగుల్ చీఫ్ పేర్కొన్నారు. ప్రధాని మోదీతో పిచాయ్ భేటీ... డేటా భద్రత, ఆన్లైన్ విద్య తదితర అంశాలపై చర్చ ప్రధాని నరేంద్ర మోదీతో గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ సోమవారం వర్చువల్‌గా సమావేశమయ్యారు. డేటా భద్రత, గోప్యతపై సందేహాలు, రైతాంగానికి సాంకేతికతను మరింతగా చేరువ చేయడం, ఆన్లైన్ విద్య విధానాన్ని విస్తరించడం తదితర అంశాలపై ఈ భేటీలో చర్చించినట్లు ప్రధాని కార్యాలయం (పీఎంవో) తెలిపింది. ‘డేటా భద్రతపై సందేహాలను పారద్రోలేందుకు టెక్ కంపెనీలు మరింతగా కృషి చేయాలని ప్రధాని సూచించారు. అలాగే, సైబర్ దాడుల ద్వారా జరిగే సైబర్ నేరాలు, ముప్పుల గురించి ప్రస్తావించారు. రైతులకు టెక్నాలజీ ప్రయోజనాలు అందించడం, వ్యవసాయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగాలు వంటి అంశాలపై చర్చించారు. విద్యార్థులతో పాటు రైతులకు కూడా ఉపయోగపడేలా వర్చువల్ ల్యాబ్స్ ఏర్పాటు ఆలోచన గురించి ప్రస్తావించారు‘ అని పీఎంవో తెలిపింది. వ్యవసాయ రంగంలో సంస్కరణలు, కొత్త ఉద్యోగాల కల్పన కోసం తీసుకుంటున్న చర్యలు మొదలైన అంశాలను ప్రధాని వివరించారు. కరోనా వైరస్ సంబంధ సమాచారం, తీసుకోవాల్సిన జాగ్రత్తల వివరాలను అందించడంలోనూ .. అపోహలు, తప్పుడు వార్తలకు అడ్డుకట్ట వేయడంలోనూ గూగుల్ క్రియాశీలక పాత్ర పోషించిందని ప్రశంసించారు. ‘సుందర్‌పిచాయ్‌తో భేటీలో రైతులు, యువత, ఔత్సాహిక వ్యాపారవేత్తల జీవితాలను మార్చగలగడంలో టెక్నాలజీ వినియోగం గురించి చర్చించాం‘ అని మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్లో ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ‘సమావేశానికి సమయం కేటాయించినందుకు మీకు కృతజ్ఞతలు. డిజిటల్ ఇండియాకి సంబంధించి మీ విజన్‌ను సాకారం చేసే దిశగా మేము కూడా కృషి చేయడం కొనసాగిస్తాం‘ అని ప్రతిగా సుందర్ పిచాయ్ ట్వీట్ చేశారు. మరిన్ని భాగస్వామ్యాలు.. భారత మార్కెట్లో ప్రణాళికల్లో భాగంగా ప్రసార భారతితో కూడా జట్టు కడుతున్నట్లు గూగుల్ తెలిపింది. డిజిటల్ సాధనాలతో ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా వ్యాపారాలను మల్చుకునేలా చిన్న సంస్థల్లో అవగాహన పెంచేందుకు దూరదర్శన్‌లో ఎడ్యుటెయిన్‌మెంట్ సిరీస్‌ను ప్రారంభించింది. అలాగే, 2020 ఆఖరు నాటికి భారత్‌లో 22,000 పైచిలుకు పాఠశాల్లో 10 లక్షల మంది పైగా ఉపాధ్యాయులకు శిక్షణ అందించేందుకు సీబీఎస్ఈతో జట్టుకట్టామని గూగుల్ వెల్లడించింది. ఇక గ్లోబల్ డిస్టెన్స్ లెర్నింగ్ ఫండ్ ద్వారా అల్పాదాయ వర్గాల కోసం కైవల్య ఎడ్యుకేషన్ ఫౌండేషన్‌కు గూగుల్‌డాట్‌ఆర్గ్ ద్వారా మిలియన్ డాలర్లు గ్రాంట్ అందిస్తున్నట్లు పేర్కొంది. చిన్న సంస్థల డిజిటలీకరణ.. చిన్న వ్యాపార సంస్థలు డిజిటల్ బాట పట్టడంలో గూగుల్ గణనీయంగా తోడ్పాటు అందిస్తోందని సుందర్ చెప్పారు. ప్రస్తుతం 2.6 కోట్లకు పైగా ఎస్‌ఎంబీలను (చిన్న, మధ్య స్థాయి వ్యాపారాలు) సెర్చి, మ్యాప్స్‌లో చూడవచ్చని, వీటికి ప్రతి నెలా 15 కోట్ల మంది పైగా యూజర్లు ఉంటున్నారని ఆయన వివరించారు. కరోనా వల్ల డిజిటల్ సాధనాల వినియోగం మరింత పెరిగిందన్నారు. ‘మా బామ్మకు కూరగాయల వాళ్లతో బేరాలడటం కుదరకపోవడం అనే ఒక్క లోటు తప్ప..లాక్డౌన్ వేళ వివిధ ఉత్పత్తులు, సర్వీసులను పొందేందుకు డిజిటల్ చెల్లింపుల విధానం బాగా ఉపయోగపడింది’ అంటూ సరదాగా చెప్పుకొచ్చారు. -
వేవ్‌రాక్‌లో టిష్‌మెన్ స్పేయర్స్ పెట్టుబడులు!
- రూ.1,000 కోట్ల జాయింట్ వెంచర్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హైదరాబాద్‌లోని వేవ్‌రాక్ ఆఫీస్ ప్రాజెక్ట్‌లో సింగపూర్‌కు చెందిన రియల్ ఎస్టేట్ సంస్థ టిష్‌మెన్ స్పేయర్స్ భారీ పెట్టుబడులు పెట్టింది. ఈ జాయింట్ వెంచర్ విలువ రూ.1,000 కోట్లని టిష్‌మెన్ స్పేయర్స్ ఎండీ, కంట్రీ హెడ్ (ఇండియా) అవినాష్ సింగ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం 2.5 మిలియన్ చ.అ.ల్లో విస్తరించి ఉన్న వేవ్‌రాక్ ప్రాజెక్ట్‌ను దశల వారీగా పూర్తి చేస్తున్నామని.. ఇప్పుటికే ఫేజ్-1, 2ల్లో 1.5 మిలియన్ చ.అ.లను 2010, 2014లో పూర్తి చేశామన్నారు. ఫేజ్-3ను వచ్చే రెండేళ్లలో పూర్తి చేస్తామని పేర్కొన్నారు. -
మరిన్ని సంస్కరణలు తెస్తాం..
భారీ పెట్టుబడులు పెట్టాలని విదేశీ ఇన్వెస్టర్లకు ఆర్థిక మంత్రి ఆహ్వానం సింగపూర్‌లో ఇన్వెస్టర్లతో సమావేశం సింగపూర్ : రానున్న రోజుల్లో మరిన్ని సంస్కరణలు తెస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ హామీ ఇచ్చారు. భారీగా ప్రభుత్వం పెట్టుబడులు పెట్టనున్నదని చెప్పారు. భారత వృద్ధి కథలో పాలుపంచుకోవలసిందిగా ఆయన విదేశీ ఇన్వెస్టర్లను ఆహ్వానించారు. పెట్టుబడులకు అనుకూలమైన పరిస్థితులు కల్పిస్తామని, సంస్కరణలు కొనసాగిస్తామని ఆయన అభయం ఇచ్చారు. వ్యాపారం చేయడానికి, పెట్టుబడులకు ఆకర్షణీయమైన దేశంగా భారత్‌ను తీర్చిదిద్దుతున్నామని పేర్కొన్నారు. దివాళా చట్టం సిద్ధంగా ఉందని, ఆర్బిట్రేషన్ చట్టాల్లో మార్పులు చేస్తున్నామని, మరిన్ని సంస్కరణలు రానున్నాయని చెప్పారు. విదేశీ ఇన్వెస్టర్లు, ప్రభుత్వ నాయకులతో సమావేశమవ్వడానికి ఆయన శుక్రవారం ఉదయం సింగపూర్‌కు వచ్చారు. దాదాపు 300కు పైగా సింగపూర్‌కు చెందిన వ్యాపార ప్రముఖులు, ఇన్వెస్టర్లతో ఆయన సమావేశమయ్యారు. విస్తృతంగా జరిగిన ఈ సమావేశంలో అమెరికా, యూరప్‌లకు చెందిన దిగ్గజ కంపెనీల ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. పెట్టుబడులు, సంస్కరణలు, వృద్ధి తదితర అంశాలపై ఆయన మాట్లాడారు. భారత్‌పై భారీగా ఆశలు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇన్వెస్టర్లు భారత్‌లో ఇటీవల సంస్కరణల పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారని, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కీలకమైన దేశంగా భారత్‌పై భారీగా ఆశలున్నాయని అరుణ్ జైట్లీ వివరించారు. బ్రిక్స్ దేశాల నుంచి భారత్‌ను తొలగించాలని కొందరు నిపుణులు పేర్కొన్నారని, ప్రస్తుతం బ్రిక్స్ దేశాల్లో వేగంగా వృద్ధి సాధిస్తున్న దేశంగా భారత్ నిలిచిందని చెప్పారు. విధానాల నిష్క్రియాపరత్వం, పన్నుల్లో అనిశ్చితి తదితర నిరాశామయ పరిస్థితులు ఇక భారత్‌లో ఉండబోవని ఆయన భరోసా ఇచ్చారు. భారత్‌లోని రాష్ట్రాలు పెట్టుబడులు ఆకర్షించడానికి ఒకదానితో ఒకటి పోటీపడుతున్నాయని వివరించారు. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గుతుండటం భారత్‌కు భారీగా ప్రయోజనకరమని తెలిపారు. ద్రవ్యోల్బణం, ద్రవ్యలోటు తగ్గాయని పేర్కొన్నారు. సమస్యలు ఎదుర్కొంటున్న ఉక్కు, విద్యుత్తు, తదితర రంగాలపై దృష్టిసారిస్తున్నామని, ఈ రంగాల సమస్యల పరిష్కారాల కోసం కృషి చేస్తున్నామని వివరించారు. బ్యాంకులకు మరింతగా మూలధన నిధులు అందిస్తున్నామని, వాటి పనితీరు మెరుగుపడే చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అంతటా మందగమనం. ఇక్కడ జోరుగా వృద్ధి.. జీఎస్టీ బిల్లు ఆమోదం పొందలేకపోయిందని జైట్లీఅంగీకరించారు. ప్రత్యక్ష నగదు బదిలీ కారణంగా సబ్సిడీల భారం తగ్గిందని, ప్రభుత్వ వ్యయంలో హేతుబద్ధీకరణ చోటు చేసుకుందని తెలిపారు. ఈ స్కీమ్‌ను ఆహార, ఎరువులకూ వర్తింపజేస్తామన్నారు. గత కొన్నేళ్లుగా మందగించిన మౌలిక సదుపాయాల అభివృద్ధిని వేగవంతం చేస్తున్నామని పేర్కొన్నారు. అందరి కోరికా... రేట్ల తగ్గింపే!: జైట్లీ సింగపూర్: వృద్ధి ఊపందుకోడానికి తక్కువ వడ్డీరేటు వ్యవస్థ అవసరమని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ పేర్కొన్నారు. పాలసీ నిర్ణేతలుసహా ప్రతి ఒక్కరూ రేట్ల తగ్గింపునే కోరుకుంటున్నారని అన్నారు. అయితే తాను ఇందుకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నిర్ణ యం తీసుకోవడంపై ఎటువంటి ప్రభావం చూపబోనని స్పష్టం చేశారు. ఇక్కడ ఆయన ఒక చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఆర్బీఐ తన బాధ్యతలను అత్యుత్తమ స్థాయిలో నిర్వహిస్తుందని అన్నారు. దేశీయ, అంతర్జాతీయ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని రేట్ల కోతపై ఒక నిర్ణయం తీసుకుం టుందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. పాలసీ చర్యకు తగిన సమయం: సిన్హా ఇదిలావుండగా న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆర్థిక శాఖ సహాయమంత్రి జయంత్ సిన్హా మాట్లాడుతూ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రేటు కోతకు ఇది తగిన సమయమని అన్నారు. ద్రవ్యోల్బణం దిగువ స్థాయిల్లో ఉండడం, అమెరికా ఫెడ్ నిర్ణయం వంటి అంశాలను ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. -
బీమా రంగంలోకి భారీ విదేశీ పెట్టుబడులు: జైట్లీ
న్యూఢిల్లీ: పార్లమెంటులో ఆర్థిక రంగానికి సంబంధించి కీలక బీమా, మైనింగ్, బొగ్గు కేటాయింపుల బిల్లుల ఆమోదం పట్ల ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ శుక్రవారం సంతృప్తి వ్యక్తం చేశారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో దేశ బీమా రంగంలోకి భారీ పెట్టుబడులు వస్తాయన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. పార్లమెంటు బడ్జెట్ తొలి విడత సమావేశాల పూర్తి సందర్భాన్ని పురస్కరించుకుని ఆయన విలేకరులతో మాట్లాడారు. బీమా రంగంలోకి పెట్టుబడుల పరిమితిని 49 శాతానికి పెంచడానికి ఉద్దేశించిన బిల్లుసహా కీలక బిల్లుల ఆమోదం సంతృప్తిని ఇచ్చినట్లు తెలిపారు. రిజర్వ్ బ్యాంక్ అధికారాలకు ప్రభుత్వం కత్తెర పెడుతోందన్న వార్తలను జైట్లీ కొట్టి పారేశారు. ప్రభుత్వ బాండ్ల ట్రేడింగ్‌పై నియంత్రణాధికారాలను ఆర్బీఐ నుంచి మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి బదలాయించనున్నట్లు బడ్జెట్లో జైట్లీ పేర్కొన్న సంగతి తెలిసిందే.