బీమా రంగంలోకి భారీ విదేశీ పెట్టుబడులు: జైట్లీ | Insurance sector to get lot of foreign investment: Arun Jaitley | Sakshi
Sakshi News home page

బీమా రంగంలోకి భారీ విదేశీ పెట్టుబడులు: జైట్లీ

Published Sat, Mar 21 2015 12:28 AM | Last Updated on Tue, Oct 2 2018 4:19 PM

బీమా రంగంలోకి భారీ విదేశీ పెట్టుబడులు: జైట్లీ - Sakshi

బీమా రంగంలోకి భారీ విదేశీ పెట్టుబడులు: జైట్లీ

న్యూఢిల్లీ: పార్లమెంటులో ఆర్థిక రంగానికి సంబంధించి కీలక బీమా, మైనింగ్, బొగ్గు కేటాయింపుల బిల్లుల ఆమోదం పట్ల ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ శుక్రవారం సంతృప్తి వ్యక్తం చేశారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో దేశ బీమా రంగంలోకి భారీ పెట్టుబడులు వస్తాయన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. పార్లమెంటు బడ్జెట్ తొలి విడత సమావేశాల పూర్తి సందర్భాన్ని పురస్కరించుకుని ఆయన విలేకరులతో మాట్లాడారు.

బీమా రంగంలోకి పెట్టుబడుల పరిమితిని 49 శాతానికి పెంచడానికి ఉద్దేశించిన బిల్లుసహా కీలక బిల్లుల ఆమోదం సంతృప్తిని ఇచ్చినట్లు తెలిపారు. రిజర్వ్ బ్యాంక్ అధికారాలకు ప్రభుత్వం కత్తెర పెడుతోందన్న వార్తలను జైట్లీ కొట్టి పారేశారు. ప్రభుత్వ బాండ్ల ట్రేడింగ్‌పై నియంత్రణాధికారాలను ఆర్‌బీఐ నుంచి మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి బదలాయించనున్నట్లు బడ్జెట్‌లో జైట్లీ పేర్కొన్న సంగతి తెలిసిందే.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement