జర్మనీ మాజీ చాన్స్లర్ మృతి
బెర్లిన్:
జర్మనీ మాజీ చాన్స్లర్ హెల్మ్త్ కొహ్ల్(87) శుక్రవారం మృతిచెందారు. రిన్లాండ్-పాలాటినాట్లో లుడ్విగ్షఫెన్లోని తన నివాసంలో అనారోగ్యంతో హెల్మ్త్ కొహ్ల్ తుది శ్వాస విడిచారు.
జర్మనీ పునరేకీకరణ పితామహుడుగా హెల్మ్త్ కొహ్ల్ కు మంచి పేరుంది. సమకాలీన యూరోపియన్ చరిత్రలో హెల్మ్త్ తన కంటూ ఓ స్థానం సంపాదించుకున్నారు.