Nikita Kaushik: సిటీకి పల్లె కళ
గ్రామీణ మహిళా కళాకారులను ప్రోత్సహించడానికి, వారి వారసత్వ కళను, ఫ్యాబ్రిక్ క్రాఫ్ట్‌ను భారతదేశం అంతటా పరిచయం చేయడానికి ది వోవెన్ ల్యాబ్ పేరుతో కృషి చేస్తున్నారు భూపాల్ వాసి నిఖితా కౌశిక్. ముంబైలోని నిఫ్ట్ పూర్వవిద్యార్థి అయిన నిఖిత జీరోవేస్ట్ పాలసీతో పాతికమంది గ్రామీణ మహిళల చేత పట్టణ మహిళల కోసం ఆధునికంగా డ్రెస్‌లను డిజైన్ చేయించి, వారికి ఉపాధి కల్పిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ‘స్టైల్ తత్త్వ’ ఎగ్జిబిషన్లో క్రాఫ్ట్స్, హ్యాండ్లూమ్ క్లస్టర్స్‌కి వారధిగా ఉంటూ చేస్తున్న కృషిని వివరించారు. ‘‘ఈ రోజు మనం భారతీయులమని చెప్పుకోవడానికి గర్విస్తున్నామంటే మన దేశంలోని విభిన్న సంస్కృతులూ, సంప్రదాయాలూ కారణం. వేటికవి సొంత మార్గాలలో ప్రత్యేకమైనవి. ఫలితంగా మన జీవితంలో దుస్తులు ముఖ్యమైన అంశంగా మారాయి. మన గ్రామీణ మహిళా కళాకారుల హస్తకళ శిల్ప నైపుణ్యాన్ని చేతితో నేసిన వస్త్రాలను మరింత మెరుగుపరచడంలో మా పని కీలకంగా ఉంటుంది. చిట్ట చివరగా ఉపయోగించే చిన్న ఫ్యాబ్రిక్ పీస్తో కూడా ‘కళ’ద్వారా అందంగా డిజైన్ చేస్తాం. ఇందుకోసం నిరంతరం పరిశోధన జరుగుతూనే ఉంటుంది. అందుకే, మా బ్రాండ్‌కు ‘ది వోవెన్ ల్యాబ్’ అని పేరు పెట్టాం.జీరో వేస్ట్ పాలసీ రాజస్థాన్, గుజరాత్ భోపాల్.. ్రపాంతాల్లోని గ్రామీణ, గిరిజన మహిళల చేతుల్లో రూపుదిద్దుకున్న మా దుస్తుల డిజైన్స్ బయట షాపుల్లో లభించవు. ఎగ్జిబిషన్లు, ఆన్లైన్ ద్వారా అమ్మకం చేస్తుంటాం. మన దేశీ కాలా పత్తితో పాటు టెన్సెల్, రీసైకిల్ ఫ్యాబ్రిక్స్, పర్యావరణ అనుకూలమైన క్లాత్‌తోనే డిజైన్ చేస్తున్నాం. అరుదైన కాటన్ ఫ్యాబ్రిక్, ్రపాచీన కళా వైభవం గల మోడర్న్ డిజైనరీ డ్రెస్సులు కాబట్టే వీటి ఖర్చు ఎక్కువే. కానీ, ఎక్కడ ఉన్నా ప్రత్యేకతను చాటుతుంటాయి.మహిళా సాధికారతమా సంస్థకు ఉన్న బలమైన స్తంభాలలో ఒకటి మహిళా సాధికారత. ఇప్పటికి పాతిక మంది గ్రామీణ మహిళలు ఈ డిజైన్స్ కోసం కృషి చేస్తున్నారు. కళ పట్ల ఆసక్తి ఉన్న గ్రామీణ బాలికలను ఎంపిక చేసుకొని, శిక్షణ ఇవ్వడమే కాకుండా, వారి ్రపాథమిక విద్య కూడా సవ్యంగా జరిగేలా చూస్తున్నాం. ఒక డ్రెస్ కొనుగోలు చేస్తే ఆ మొత్తంతో ఆ కళాకారుల ఇల్లు నెలంతా ఏ ఇబ్బంది లేకుండా గడిచి΄ోతుంది. భవిష్యత్తు తరాలు ఆ కళావైభవాన్ని సొంతం చేసుకోవాలన్నదే నా కల. చాలావరకు సేకరించే కాటన్ ఫ్యాబ్రిక్ ఐవరీ, గ్రే కలర్ వే ఎంచుకుంటాం. కొన్నింటికి మాత్రం నేచురల్ రంగులతో డైయింగ్ ప్రక్రియ ఉంటుంది. వ్యర్థాలను నివారిస్తూ, పర్యావరణ అనుకూలమైన ఉత్పత్తులను వెలుగులోకి తీసుకురావాలన్నదే మా ప్రయత్నం తప్ప ఫాస్ట్ ఫ్యాషన్ ΄ోటీ పరుగులో చేరం.రాబోయే తరాలకు మన కళప్రాచీన హ్యాండ్ వర్క్స్‌ని వదిలేస్తే అవి అంతే సులువుగా మరుగున పడి΄ోతాయి. క్రాఫ్ట్స్ క్లస్టర్స్ ఆఫ్ ఇండియాతో అనుబంధంగా వర్క్ చేస్తున్నాను కాబట్టి దేశంలోని హ్యాండ్లూమ్ క్లస్టర్స్తోనూ, ఈ మార్గంలో వచ్చే అంతరాలను పూడ్చేందుకు నిఫ్ట్‌లోని వివిధ కేంద్రాలతో అనుబంధంగా వర్క్ చేస్తున్నాను.ఫ్యాబ్రిక్ సేకరణ, డిజైన్స్ సృష్టి, వ్యర్థాలు మిగలకుండా జాగ్రత్తపడటం అనేది ఓ సవాల్‌గా ఉంటుంది. కానీ, పర్యావరణ హితంగా, మనసుకు నచ్చిన పని చేస్తుండటం ఎప్పుడూ ఉత్సాహాన్ని ఇస్తుంది. అంతేకాదు, ఈ డిజైన్స్‌ని ఇష్టపడి కొనుగోలు చేసేవారి ద్వారా ప్రాణం పెట్టే కళాకారులకు ఉపాధి ΄÷ందేలా చేయడం మరింత సంతృప్తిని ఇస్తుంది’’ అని వివరించారు ఈ డిజైనర్. – నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి