స్కూటర్ నడుపుతూ.. జారిపడ్డ హీరో
సినిమాలో స్కూటర్ మీద తిరిగే సన్నివేశంలో పాల్గొన్న ఓ కుర్రహీరో.. ఆవేశానికి పోయి దానిమీద నుంచి పడి దెబ్బలు తగిలించుకున్నాడు. 'బాంబైరియా' అనే సినిమాలో పింక్ రంగు స్కూటర్ మీద తిరుగుతూ ఉండే హీరో సిద్ధాంత్ కపూర్.. ఓ ఛేజింగ్ సీన్ చేసేటప్పుడు స్కూటర్ అదుపుతప్పి పడిపోయాడు. అయినా కూడా.. సీన్ మాత్రం పూర్తి చేసే తీరుతానని చెప్పాడు.
ఈ యాక్సిడెంట్ కారణంగా తాను పాత్రకు మరింత దగ్గరగా వెళ్లానని చెప్పాడు. సెట్ల మీద యాక్సిడెంట్లు జరగడం మామూలేనని, కానీ షెడ్యూలు వృథా కావడం తనకు ఇష్టం లేదని సిద్ధాంత్ అన్నాడు. ఈ సినిమాలో తనకు, స్కూటర్కు మధ్య అనుబంధం చాలా బాగుంటుందని చెప్పాడు. ఈ సినిమాలో సిద్ధాంత్ ఓ కొరియర్ బోయ్ పాత్ర పోషిస్తున్నాడు.