Hero krishna
-
Krishna 1st Death Anniversary: నేడు కృష్ణ తొలి వర్ధంతి (ఫోటోలు)
-
సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి మరో కొత్త హీరో
శ్రీ వెన్నెల క్రియేషన్స్ బ్యానర్ పతాకంపై బేబీ లాలిత్య సమర్పణలో ఎమ్. సుధాకర్ రెడ్డి నిర్మాతగా, శివ కేశనకుర్తి దర్శకత్వంలో ప్రొడక్షన్ నెంబర్ 3గా వస్తున్న కొత్త చిత్రం పూజ కార్యక్రమాలతో నేడు ఘనంగా ప్రారంభమయ్యింది. ఉగాది పండుగను పురస్కరించుకుని ఈ కార్యక్రమం అతిరథ మహారథుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది. వెరైటీ కాన్సెప్ట్ తో రాబోతున్న ఈ సినిమా ద్వారా సూపర్ స్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చిన శరన్ 'ది లైట్ కుమార్' హీరోగా పరిచయమవుతున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ.. శ్రీ వెన్నెల క్రియేషన్స్ బ్యానర్ లో ఈ సినిమా చేస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ సినిమా ద్వారా సూపర్ స్టార్ ఫ్యామిలీ కి చెందిన శరన్ 'ది లైట్ కుమార్' హీరోగా పరిచయమవుతున్నారు. ఈ ఛాన్స్ ఇచ్చిన నిర్మాత గారికి కృతజ్ఞతలు తెలిపారు. పొలిటికల్ క్రైమ్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా అందరికి నచ్చేలా తెరకెక్కిస్తానని చెప్పారు. అందరికి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. నిర్మాత మాట్లాడుతూ.. ఈ సినిమా కథ చాలా బాగుంది. రెగ్యులర్ సినిమాలా కాకుండా వెరైటీగా ఉండడంతోనే ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నాను మే 3 నుంచి రెగ్యులర్ షూటింగ్ ని ప్రారంభించబోతున్నాం. మా బ్యానర్ నుంచి వస్తున్న మూడో సినిమా ఇది. ఈ సినిమా ద్వారా సూపర్ స్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చిన శరన్ 'ది లైట్ కుమార్' హీరోగా పరిచయమవడం ఎంతో ఆనందంగా ఉంది. అందరికి ఉగాది శుభాకాంక్షలు అన్నారు. హీరో శరన్ మాట్లాడుతూ.. ఇంతమంచి ప్రొడక్షన్ హౌస్ నుంచి నేను హీరోగా పరిచయమవుతుండడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ సినిమా స్టోరీ ఎంతో బాగుంది. మీ అందరికి నచ్చుతుంది త్వరలోనే ఓ మంచి సినిమాతో మీముందుకు వస్తాను అని అన్నారు. చదవండి: పెళ్లి డేట్ ప్రకటించిన యంగ్ హీరో! -
చిరు స్పెషల్‌గా.. సుధీర్ వెరైటీగా
టాలీవుడ్ సీనియర్ సూపర్‌స్టార్ కృష్ణ ఈరోజు 77వ జన్మదిన వేడుకలను జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన అభిమానులు, కుటుంబసభ్యులు, టాలీవుడ్ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి నటశేఖరుడు కృష్ణకు బర్త్‌డే విషెస్ తెలిపారు. ‘కథానాయకుడిగా 345 సినిమాలు.. దర్శకుడిగా 14 చిత్రాలు. నిర్మాతగా తెలుగుతో పాటు భారతీయభాషల్లో 50 చిత్రాలు. మొదటి సినిమాస్కోప్ సినిమా ఆయనదే. మొదటి 70 ఎమ్ఎమ్ చిత్రం కూడా ఆయనదే. అనితరసాధ్యం ఈ ట్రాక్ రికార్డు. సాహసానికి మారుపేరు, పద్మభూషణ్ అవార్డు గ్రహీత సూపర్‌స్టార్ కృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు’ అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు. అంతేకాకుండా ఆయనతో కలిసి దిగిన ఫోటోను కూడా ట్వీట్లో జతచేశారు. (మహేశ్ సర్ప్రైజ్ వచ్చింది.. ట్రెండింగ్‌లో టైటిల్) కాగా, కృష్ణ బర్త్‌డే సందర్భంగా ఆయన అల్లుడు సుధీర్ బాబు సరికొత్త స్టైల్లో విషెస్ చెప్పారు. కృష్ణ నటించిన అల్లూరి సీతారామరాజు చిత్రంలోని ఎమోషన్ డైలాగ్‌కు డబ్ స్మాష్ చేసి కాస్త వైవిధ్యంగా జన్మదిన శుభాకాంక్షలు అందించారు. ఎంతో ఉద్వేగభరితంగా ఉన్న ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. సుధీర్‌బాబు నటనకు నెటిజన్లు హ్యాట్సాఫ్ చెబుతున్నారు. కృష్ణ కోడలు, మహేశ్ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్ తన మామకు ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కమ్రంలో ఇన్‌స్టాలో ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. వీరితో పాటు టాలీవుడ్‌కు చెందిన అనేక మంది ప్రముఖులు సూపర్ స్టార్ కృష్ణకు బర్త్‌డే విషెస్ తెలిపారు. ఇటు కృష్ణ బర్త్‌డే అటు మహేశ్ కొత్త సినిమా ప్రకటనతో సోషల్ మీడియాలో దద్దరిల్లిపోతోంది. (నిన్న రావు రమేష్.. నేడు ఉత్తేజ్) Just a fanboy's tribute to his Superstar 😊 My most favourite scene from his legendary career. Happy Birthday again mavayya ❤️ #HBDSuperstarKrishnaGaru #AlluriSeetaramaraju pic.twitter.com/HeKp6OCjp5 — Sudheer Babu (@isudheerbabu) May 31, 2020 కథానాయకుడిగా 345 సినిమాలు దర్శకుడిగా 14 చిత్రాలు.నిర్మాతగా తెలుగుతో పాటు భారతీయభాషల్లో 50 చిత్రాలు.మొదటి సినిమాస్కోప్ సినిమా ఆయనదే.మొదటి 70mm చిత్రం కూడా ఆయనదే.అనితరసాధ్యం ఈ track record. సాహసానికి మారుపేరు, పద్మభూషణ్ అవార్డు గ్రహీత,Superstar Krishna గారికి జన్మదినశుభాకాంక్షలు.💐 pic.twitter.com/6oa9wFg0Nn — Chiranjeevi Konidela (@KChiruTweets) May 31, 2020 View this post on Instagram A superstar, an icon, a legend an inspiration to millions... he’s all of this to everyone but to me he is a father in law who is kind and loving... who dotes on me and my family... someone who stands tall when I need advice or a shoulder to lean on... He’s always there for me and I’m so grateful to him for always being there!! He replaced my father so beautifully and made me so at home in his family and his world... they make very few like him🤗🤗🤗 Happy birthday, mamayya garu. I’m truly blessed to have u in my life. Love you so so much... stay blessed always 🤗🤗🤗♥️♥️♥️ A post shared by Namrata Shirodkar (@namratashirodkar) on May 30, 2020 at 11:30am PDT -
మహేశ్ ఫ్యాన్స్‌కు ట్రిపుల్ ధమాకా
హైదరాబాద్: టాలీవుడ్ సీనియర్ సూపర్‌స్టార్ కృష్ణ ఘట్టమనేని జన్మదినం నేడు. ఈ సందర్భంగా ఘట్టమనేని ఫ్యాన్స్, టాలీవుడ్ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా నటశేఖరుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ సందర్భంగా సూపర్‌స్టార్ మహేశ్ బాబు తన తండ్రికి బర్త్‌డే విషెస్ తెలుపుతూ ట్వీట్ చేశారు. ‘మీకు ఎప్పటికీ రుణపడే ఉంటాను. ఎప్పటికీ మీరే నా సూపర్ స్టార్. హ్యాపీ బర్త్‌డే నాన్న’ అంటూ ట్వీట్ చేశారు. అంతేకాకుండా తన తండ్రితో చిన్నప్పుడు దిగిన ఫోటోను కూడా అభిమానులతో పంచుకున్నారు మహేశ్. మహేశ్‌తో పాటు నమ్రతా శిరోద్కర్, సితారలు కూడా ఇన్‌స్టాలో కృష్ణకు ప్రత్యేక జన్మదిన శుభాకంక్షలు తెలిపారు. (మెరిట్ స్టూడెంట్) ఫ్యాన్స్‌తో సూపర్‌స్టార్ ముచ్చట తన తండ్రి కృష్ణ బర్త్‌డే సందర్భంగా మహేశ్ ఈ రోజు సాయంత్రం సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించనున్నారు. ఈ సందర్భంగా ఇన్‌స్టాలో సాయంత్రం 5 గంటలకు క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్లో పాల్గొంటారు. అంతేకాకుండా ఈ లైవ్ చాట్‌లో తన సినిమాలు, కుటుంబం గురించి ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక కృష్ణ బర్త్‌డే రోజే మహేశ్ 27వ చిత్రం ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. దీంతో ఈరోజు మహేశ్ ఫ్యాన్స్‌కు పండగే పండగ అని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇక మహేశ్ తదుపరి చిత్రాన్ని పరుశురాం దర్శకత్వం వహిస్తుండగా మైత్రీమూవీమేకర్స్ నిర్మించబోతోంది. జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్, 14 రీల్స్ సంస్థలు కూడా ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వామ్యం వహిస్తాయి. (సోనూసూద్‌పై సీఎం ప్రశంసల జల్లు) All that I am and trying to be... I owe it all to you!! Happy birthday, Nana❤️ My evergreen superstar 😍😍😍 pic.twitter.com/miSMNCCycC — Mahesh Babu (@urstrulyMahesh) May 30, 2020 View this post on Instagram Happy birthday, Thatha garu🥳🎉🎂 I love you very much... ❤️Hope you have a wonderful day 🤗 A post shared by SitaraGhattamaneni (@sitaraghattamaneni) on May 30, 2020 at 11:31am PD -
ఆమె విజయానికి మీసాల కృష్ణుడే సాక్షి
సాక్షి, కొత్తపేట(తూర్పు గోదావరి) : కథానాయకుడు కృష్ణ – కథానాయకి విజయనిర్మల మధ్య ప్రేమకు పునాది పడింది ఆత్రేయపురం మండలం పులిదిండి గ్రామంలోనే. 1967 సంవత్సరంలో నందనా ఫిలిమ్స్ (శ్రీరమణ చిత్ర) పతాకంపై బాపు దర్శకత్వంలో సురేష్‌కుమార్, శేషగిరిరావు నిర్మించిన ‘సాక్షి’సినిమాలో వారిద్దరూ తొలిసారిగా కలిసి నటించారు. ఆ సినిమా అవుట్డోర్ షూటింగ్ ఆత్రేయపురం మండలంలో పులిదిండి జరిగింది. ఈ సినిమా చిత్రీకరణకు ముందు కథా రచయిత ముళ్లపూడి వెంకటరమణ, దర్శకుడు బాపు సినిమాకు అనుకున్న గ్రామం గురించి ఓ మ్యాప్ గీసుకున్నారు. అందులో ఓ బల్లకట్టు ఉన్న ఓ కాలువ, కాలువ దగ్గర రేవులో ఓ పెద్ద చెట్టు, రేవు నుంచి ఊరికి చిన్న బాట, ఊళ్లో ఓ చిన్న గుడి, గుడికో మండపం ఉండాలి. గోదావరి పరిసరాల్లో ఇరిగేషన్ శాఖలో పనిచేసి సీలేరు ప్రాజెక్టు ఇంజినీర్‌గా పనిచేస్తున్న బాపు, రమణల బాల్యమిత్రుడు, రచయిత బీవీఎస్ రామారావును తమ మ్యాప్‌ను పోలిన ఊరును వెతకాల్సిందిగా కోరారు. రామారావు ఉద్యోగానికి సెలవు పెట్టి అలాంటి ఊరికోసం రాజమండ్రి వచ్చి ఇరిగేషన్ కాంట్రాక్టర్‌గా పరిచయస్తులైన కలిదిండి రామచంద్రరాజును ఊరిని వెతికేందుకు సాయమడిగారు. ఆ మ్యాప్‌లో ఊరిని పోలినట్టుగా తమ ఊరు పులిదిండే వుందన్నారు. ఆ సమాచారంతో బాపు, రమణలు పులిదిండి రాగా వారికి రాజు తమ ఇంట్లోనే బస ఏర్పాటుచేశారు. పులిదిండితో పాటు బొబ్బర్లంక, పిచ్చుక లంక, ఆత్రేయపురం, ఆలమూరు, కట్టుంగ తదితర గ్రామాలను పరిశీలించారు. చివరికి పులిదిండి గ్రామాన్నే ఎంచుకున్నారు. ఆ గ్రామంలో చాలా వరకూ షూటింగ్ చేశారు. గ్రామంలోని మీసాల కృష్ణుడి ఆలయంలో కూడా చిత్రీకరించారు. అది 1965 ప్రాంతం.. కథలో బాగంగా దర్శకుడు బాపు తొలిసారిగా దర్శకత్వం వహిస్తున్న సాక్షి సినిమా పూర్తిగా జిల్లాలో పులిదిండి గ్రామంలో చిత్రీకరిస్తున్నారు. తొలిరోజు కథానాయిక విజయనిర్మల, కథానాయకుడు కృష్ణలమీద ఒక పాట చిత్రీకరిస్తున్నారు. నేపథ్యం ఇదీ.. విజయనిర్మల అన్న ఫకీర్ పేరుమోసిన రౌడీ. వాడికి వ్యతిరేకంగా ఒక హత్యకేసులో కృష్ణ సాక్ష్యం చెబుతాడు. జైలు నుంచి రాగానే కృష్ణను చంపుతానని ఫకీర్ ప్రతిజ ్ఞచేస్తాడు. ఫకీర్ చెల్లెలు విజయనిర్మల కృష్ణను పెళ్ళి చేసుకోమంటుంది. ఫకీర్ జైలు నుంచి విడుదలయ్యాడని వార్త గ్రామంలో పొక్కింది. విజయనిర్మల తాళిబొట్టును తీసుకువచ్చి, తన మెడలో కట్టమంటుంది. మరి కొద్దిసేపటికి చచ్చిపోయేవాడికి పెళ్లేమిటి? అని కృష్ణ కంటనీరు పెట్టుకుంటాడు... ‘అమ్మ కడుపు చల్లగా అత్త కడుపు చల్లగా బతకరా బతకరా నూరేళ్ళు పచ్చగా..అన్న ఆరుద్ర పాటను బాపు ఒక్కరోజులో చిత్రీకరించారు. షూటింగ్ జరిగిన ఆలయానికి మీసాల కృష్ణుడి ఆలయమని పేరు.. రాజబాబు వచ్చి, ఇది పవర్ఫుల్ టెంపుల్, నిజ జీవితంలో కూడా మీరు దంపతులు అవుతారని ఆయన అన్నాడు. ఆ సమయంలో రాజబాబు ఆ మాటంటే ఏమిటా పిచ్చిమాటలు అని విజయనిర్మల కసిరారు. మూడు నాలుగు సినిమాల తరువాత వారు నిజంగానే దంపతులు అయ్యారు. గోదారమ్మవారిని కలిపింది. ఆ తరువాత బాపు దర్శకత్వంలోనే విజయనిర్మల అక్కినేని సరసన బుద్ధిమంతుడు సినిమాలో నటించారు. రెండు విజయవంతమైన సినిమాలే! విజయనిర్మల దర్శకత్వానికి కోనసీమలోనే బీజం విజయనిర్మల దర్శకత్వానికి కోనసీమలోనే బీజం పడిందని కొత్తపేటకు చెందిన కవి, రచయిత షేక్ గౌస్ తెలిపారు. బాపు దర్శకత్వంలో చిత్రీకరించిన సాక్షి సినిమాలో కృష్ణతో, బుద్ధిమంతుడు సినిమాలో అక్కినేని నాగేశ్వరరావుతో విజయనిర్మల హీరోయిన్గా నటించారు. ఆ రెండు సినిమాలు కోనసీమలోనే చిత్రీకరించారు. ఆమె బాపు దర్శకత్వాన్ని గమనించి దర్శకత్వంలో మెళకువలు తెలుసుకున్నారు. ‘సాక్షి’ సినిమా పరిచయం ద్వారా కృష్ణ – విజయనిర్మల ఒకటైనదీ, ఆమె దర్శకత్వానికి బీజం పడినదీ కోనసీమలోనే అని గౌస్ తెలిపారు. -
ఫిల్మ్‌సిటీకి కేసీఆర్ పేరైతేనే బాగుంటుంది!
-
కొత్త ఫిల్మ్‌సిటీకి కేసీఆర్ పేరు పెట్టాలి
-
ఫిల్మ్‌సిటీకి కేసీఆర్ పేరు పెట్టాలి: కృష్ణ
హైదరాబాద్ : తెలంగాణలో రెండువేల ఎకరాలతో నిర్మించబోయే ఫిల్మ్ సిటీకి కేసీఆర్ పేరు పెడితే బాగుంటుందని సూపర్ స్టార్ కృష్ణ ప్రతిపాదించారు. ఫిల్మ్ సిటీ నిర్మాణానికి ఆయన మద్దతు ప్రకటించారు. ఇప్పటికే తెలుగు చిత్ర పరిశ్రమ... ఫిల్మ్‌సిటీ నిర్మాణాన్ని స్వాగతించింది. పలువురు సినీ పెద్దలు ఈ సందర్భంగా కేసీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. రెండువేల ఎకరాల్లో రాష్ట్రంలో ఫిల్మ్ సిటీని నిర్మించనున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. షూటింగులు, టీవీ సీరియళ్ల నిర్మాణానికి అనుగుణంగా భారీ స్థాయిలో ‘సినిమా సిటీ’ నిర్మించాలని, ఇందులో గ్రాఫిక్స్, ఎఫెక్ట్స్ సౌకర్యాలతో స్టూడియోలు ఉండాలని కేసీఆర్ సూచించారు. ప్రపంచ సినిమాకు హైదరాబాద్ ప్రధాన కేంద్రం కావాలని ఆకాంక్షను వ్యక్తం చేశారు. సినీ పరిశ్రమ హైదరాబాద్ నుంచి ఎట్టిపరిస్థితుల్లోనూ తరలిపోదని కూడా ఆయన ధీమా వ్యక్తం చేశారు. దీంతో సినీ పరిశ్రమకు మేలు జరగడంతో పాటు స్థానికులకు ఉపాధి, ఉద్యోగావకాశాలు లభిస్తాయని అభిప్రాయపడ్డారు.