Hero Motors Group
-
హీరో ప్లస్ యమహా.. త్వరలో ఈ సైకిల్ డ్రైవ్
న్యూఢిల్లీ: వాహన విడిభాగాల తయారీలో ఉన్న హీరో మోటార్స్ తాజాగా జపాన్‌కు చెందిన యమహా మోటార్‌తో సంయుక్త భాగస్వామ్య కంపెనీ ఏర్పాటుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా ఈ–సైకిల్ డ్రైవ్ మోటార్స్ ఉత్పత్తి కేంద్రాన్ని ఇరు సంస్థలు కలిసి పంజాబ్‌లో నెలకొల్పుతాయి. 2022 నవంబర్ నుంచి ఈ ప్లాంటులో ఉత్పత్తి మొదలు కానుంది. వీటిని అంతర్జాతీయ మార్కెట్‌కు సరఫరా చేస్తారు. ఏటా 10 లక్షల యూనిట్ల తయారీ సామర్థ్యంతో ఈ ఫెసిలిటీ రానుంది. ఈ–సైకిల్ రంగంలో పనిచేసేందుకు ఇరు సంస్థలు ఇప్పటికే 2019 సెప్టెంబర్‌లో వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. -
హీరో మోటొకార్ప్ లాభం రూ.1,011 కోట్లు
ముంబై: టూ వీలర్ దిగ్గజం హీరో మోటొకార్ప్ ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో రూ.1,011 కోట్ల నికర లాభం సాధించింది. గత క్యూ2లో సాధించిన నికర లాభం రూ.1,004 కోట్లతో పోలిస్తే 0.6 శాతం వృద్ధి సాధించామని హీరో మోటొకార్ప్ తెలిపింది. అమ్మకాలు పెరగడం, నిర్వహణ పనితీరు మెరుగుపడటంతో నికర లాభం ఈ క్యూ2లో పెరిగిందని వివరించింది. పెట్టుబడి ప్రోత్సాహకాలను ఉపసంహరించడం, పరిశోధన, అభివృద్ధి వ్యయాల తగ్గింపుల్లో కోత కారణంగా నికర లాభం అంచనాల కంటే తగ్గిందని వివరించింది. అయితే అమ్మకాలు 11 శాతం పెరగడంతో ఆదాయం 7 శాతం వృద్ధితో రూ.8,362 కోట్లకు పెరిగిందని పేర్కొంది. అమ్మకాల రికార్డ్: గత క్యూ2 వాహన అమ్మకాలతో పోల్చితే ఈ క్యూ2లో వాహన అమ్మకాలు 11 శాతం వృద్ధితో 20,22,805కు పెరిగాయని, కంపెనీ చరిత్రలోనే ఒక క్వార్టర్లో ఈ స్థాయి అమ్మకాలు సాధించడం రికార్డని హీరో మోటొకార్ప్ వివరించింది. మిశ్రమంగా ఫలితాలు.... మార్కెట్ ముగిసిన తర్వాత హీరో మోటొకార్ప్ ఆర్థిక ఫలితాలు వెలువడ్డాయి. స్టాక్ సూచీలు భారీ లాభాల్లో ఉన్నా, ఫలితాలు ఎలా ఉంటాయోనన్న అంచనాలతో ఈ షేర్ గురువారం తీవ్రమైన ఒడిదుడుకులకు గురైంది. చివరకు 0.8 శాతం నష్టంతో రూ.3,823 వద్ద ముగిసింది. -
ఏపీలో టోరే, రాక్‌మెన్ పెట్టుబడులు
శ్రీసిటీలో పరిశ్రమల ఏర్పాటు సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్నట్టు జపాన్‌కు చెందిన టోరే, హీరో మోటార్స్ గ్రూప్‌నకు అనుబంధంగా ఉన్న రాక్‌మెన్ ఇండస్ట్రీస్ ప్రతినిధులు ప్రకటించారు. చిత్తూరు జిల్లా శ్రీసిటీలో పరిశ్రమలు నెలకొల్పేందుకు తాము వెయ్యి కోట్ల పెట్టుబడి పెడుతున్నట్టు టోరె ప్రతినిధులు వెల్లడించగా, రాక్‌మెన్ ఇండస్ట్రీస్ రూ. 540 కోట్ల పెట్టుబడి పెడుతున్నట్లు తెలిపారు. ఆ కంపెనీల ప్రతినిధులు గురువారం సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిశారు. ప్రాజెక్టుల వల్ల ప్రత్యక్షంగా 100 మందికి, పరోక్షంగా 300 మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయన్నారు. వచ్చే ఏడాది జనవరిలో తమ యూనిట్‌కు శంకుస్థాపన చేయనున్నట్టు వివరించారు. కంపెనీల ప్రతినిధులు కలసిన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. చిత్తూరు జిల్లాను దక్షిణ భారతదేశంలో లాజిస్టిక్ హబ్‌గా తీర్చి దిద్దుతున్నామని చెప్పారు.