High risk centers
-
సత్ఫలితాలిస్తున్న హైరిస్కు కేంద్రాలు
మెదక్ మున్సిపాలిటీ, న్యూస్‌లైన్: గర్భిణుల సంరక్షణ కోసం జిల్లాలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హైరిస్కు కేంద్రాలు మంచి ఫలితాలిస్తున్నాయని జిల్లా ఆస్పత్రుల సమన్వయకర్త(డీసీహెచ్) వీణా కుమారి అన్నారు. శుక్రవారం ఆమె మెదక్ ఏరియా ఆస్పతి పరిధిలో నూతంగా ఏర్పాటు చేసిన హైరిస్కు కేంద్రాన్ని సందర్శించారు. ఈ కేంద్రాల ద్వార మాతా శిశు మరణాలు తగ్గించడంమే కాకుండా ప్రభుత్వ ఆసుపత్రిల్లో ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు. ప్రస్తుతం జిల్లాలో పటాన్చెరు, సిద్దిపేట, మెదక్‌లో ఈ కేంద్రాలు ఏర్పాటు కాగా కొత్తగా జహీరాబాద్, నారాయణఖేడ్, గజ్వేల్‌లో ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలున్నాయని తెలిపారు. ఏరియా ఆసుపత్రి పరిధిలోని అన్ని పీహెచ్‌సీల్లో చికిత్స పొందే గర్భిణులను 7 నెలల వరకు పరీక్షించిన తర్వాత ఏదైనా అత్యవసరం ఉంటే వెంటనే ఈ కేంద్రానికి తీసుకొచ్చి ప్రత్యేకంగా చికిత్స అందజేయాలన్నారు. గర్భిణులకు చికిత్స అందించడంలో వైద్యుల ఎలాంటి నిర్లక్ష ్యం వహించిన చర్యలు తప్పవన్నారు. అనంతరం పాపన్నపేటకు చెందిన మల్లీశ్వరి అనే మహిళకు అధిక రక్తస్రావం కావడం, ప్రత్యేక చికిత్స చేసి 3 యూనిట్ల రక్తం ఎక్కించి ఎలాంటి ప్రమాదం లేకుండా ప్రసవం చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆమెకు చికిత్స చేసిన ప్రభుత్వ గైనకాలజిస్టు డాక్టర్ శివదయాల్ను ఆమె అభినందించారు. ఆమె వెంట డీపీఓ జగన్నాథం, ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేకర్, గైనకాలజిస్టు ఆదిలక్ష్మి, డాక్టర్ చంద్రశేఖర్ ఉన్నారు. -
‘ హైరిస్క్’ ఆదర్శంగా నిలవాలి
సిద్దిపేట జోన్, న్యూస్‌లైన్: మాతా శిశు మరణాల నియంత్రణకు సిద్దిపేటలో తొలి ప్రయోగంగా చేపట్టిన ‘హైరిస్క్’ ప్రసూతి కేంద్రం దేశానికే ఆదర్శంగా నిలవాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ సహానీ ఆకాంక్షించారు. శనివారం స్థానిక ఎంసీహెచ్‌లో హైరిస్క్ కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా కలెక్టర్ స్మితా సబర్వాల్ నేత ృత్వంలో ‘మార్పు’ ద్వారా హైరిస్క్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సిజేరియన్ కేసుల స్థితి గతులను పరిశీలిస్తే తెలంగాణ పరిధిలోని కరీంనగర్, న ల్లగొండ, వరంగల్, మెదక్ జిల్లాల్లో 50 శాతం నుండి 80 శాతం వరకు శస్త్ర చికిత్సలు జరగడం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కష్టతరహా కాన్పులను సులభతరం చేసేందుకే జాతీయ ఆరోగ్య మిషన్ ద్వారా హైరిస్క్ కేంద్రం ఏర్పాటు చేశామన్నారు. ప్రసూతి కేసుల్లో 30 శాతం హైరిస్క్‌తో కూడిన పరిస్థితులను వైద్య శాఖ ఎదుర్కుటోందన్నారు. పేదలందరికీ మెరుగైన వైద్యం అందించే లక్ష్యంతోనే ఆధునిక వసతులతో సిద్దిపేటలో కేంద్రం ఏర్పాటు చేశామన్నారు. కేంద్రం నిర్వహణకు పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తానని సహాని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 44 చోట్ల నవజాత శిశువు కేంద్రాలు కొనసాగుతున్నాయనీ, త్వరలో సిద్దిపేటలో కూడా నవజాత శిశువు హైరిస్క్ కేంద్రం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. తక్కువ బరువుతో పుట్టిన బిడ్డ ఎదుర్కొనే ఆరోగ్య సమస్యలకు ఈ కేంద్రాల్లో మెరుగైన వైద్యం అందుతుందన్నారు. సుఖప్రసవాలకు వైద్యులు ప్రాధాన్యతనివ్వాలన్నారు. అత్యవసరమైతే తప్ప శస్త్రచికిత్సలు చేయరాదన్నారు. జిల్లాలో మరిన్ని ‘హైరిస్క్’ కేంద్రాలు త్వరలోనే జిల్లాలో మరిన్ని ‘హైరిస్క్’ ప్రసూతి కేంద్రాలను ఏర్పాటు చేస్తామని జిల్లా కలెక్టర్ స్మితా సబర్వాల్ అన్నారు. సిద్దిపేటలో హైరిస్క్ కేంద్రం ఏర్పాటుకు స్థానిక ఎమ్మెల్యే హరీష్‌రావు చూపిన చొరవ స్ఫూర్తి దాయకమన్నారు. ప్రభుత్వ వైద్యులు చిత్త శుద్ధితో పనిచేయాలని పిలుపునిచ్చారు. సిద్దిపేటలోని కేంద్రం ప్రయోగాత్మకమైనప్పటికీ, రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందేలా సమిష్టితో క ృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. అంతకుముందు ఎమ్మెల్యే హరీష్‌రావు మాట్లాడుతూ, రాష్ట్రంలోనే తొలిసారిగా సిద్దిపేటలో హైరిస్క్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు. మాతా శిశు మరణాలను తగ్గించేందుకు కేంద్రం దోహదపడుతుందన్నారు. కేంద్రం ఏర్పాటుతోనే బాధ్యత తీరదని, వైద్యులు బాధ్యతాయుతంగా పనిచేసినప్పుడే లక్ష్యం సాధిస్తామన్నారు. కేంద్రానికి వచ్చే గర్బిణీలకు ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని అందిస్తూ, వారి బంధువులకు ప్రేమ ఆప్యాయతలతో కూడిన సేవలను వైద్యులు అందించాలన్నారు. సాధారణ కాన్పులను ప్రోత్సహించడం వల్ల పరోక్షంగా పేదలకు ఆర్థికంగా సహాయం చేసినట్లు అవుతుందన్నారు. కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి పద్మ, డీసీఏహెచ్ వీణాకుమారి, ఆర్డీఓ ముత్యంరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ గూడూరి శ్రీనివాస్, సూపరింటెండెంట్ శివరాం, క్లస్టర్ అధికారులు శివానందం, కాశీనాథ్‌తో పాటు వైద్యులు అరుణ, కృష్ణారావు, టీఆర్ఎస్ నేతలు రాజనర్సు, మచ్చ వేణు, బాల్‌రంగం, రవీందర్‌రెడ్డి, కిషన్‌రెడ్డి, సాయిరాం, ప్రభాకర్, అశోక్, కనకరాజు తదితరులు ఉన్నారు. -
‘మార్పు’.. వేగిరం
సంగారెడ్డి డివిజన్, న్యూస్‌లైన్: జిల్లాలో సంక్షేమ కార్యక్రమాల అమలును మరింత వేగవంతం చేయనున్నట్లు కలెక్టర్ స్మితా సబర్వాల్ తెలిపారు. మాతా శిశు సంరక్షణ, గర్భిణులకు పౌష్టికాహార సేవలు అందించే మార్పు కార్యక్రమాన్ని పట్టణ ప్రాంతాలకూ విస్తరించనున్నట్లు చెప్పారు. జిల్లా కేంద్రం సంగారెడ్డిలో ఆదివారం 65వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పోలీసు పరేడ్‌గ్రౌండ్స్‌లో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో కలెక్టర్ జాతీయజెండాను ఎగురవేశారు. సాయుధ పోలీసుల నుంచి గౌరవందనం స్వీకరించారు. అనంతరం కలెక్టర్ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. వచ్చేనెల నుంచి ఐదు మున్సిపాలిటీలు, మూడు నగర పంచాయతీల్లో ‘మార్పు’ అమలుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. రాష్ట్రంలోనే మొదటి సారిగా సిద్దిపేటలో మార్పు అమలుకు హైరిస్క్ కేంద్రాన్ని ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. జహీరాబాద్, పటాన్చెరు, గజ్వేల్, మెదక్, నారాయణఖేడ్‌లో కూడా దశల వారీగా హైరిస్క్ కేంద్రాలు ప్రారంభిస్తామని అన్నారు. రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులు పాటిస్తూ తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడులు సాధించేందుకు వీలుగా జిల్లా వ్యాప్తంగా రైతుహిత సదస్సులు నిర్వహించామన్నారు. వ్యవసాయ యాంత్రీకరణపై రైతులకు అవగాహన కల్పించినట్లు తెలిపారు. రబీలో రైతులు 94వేల హెక్టార్లలో వివిధ పంటుల సాగు చేశారన్నారు. రైతులకు వచ్చేనెలాఖరులోగా నిర్దేశించిన లక్ష్యం మేరకు రూ.1,134 కోట్ల రుణాలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. పశుసంవర్ధకశాఖ ద్వారా సునందిని పథకంలో భాగంగా రైతులకు 3,961 మేలుజాతి దూడల పోషణకు 75 శాతం సబ్సిడీపై దాణ, మందులు సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. పదో తరగతిలో వందశాతం ఫలితాలు సాధించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. కలెక్టర్ ప్రసంగంలోని ప్రధాన అంశాలు ఆమె మాటల్లో.. మార్పు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య 1600 నుంచి 2100 వరకు పెరిగాయి. కొత్తగా 18 పీహెచ్సీలో ప్రసవాల సేవలు ప్రారంభిస్తున్నాం. పది ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈనెలాఖరులోగా మార్పు హెల్ప్ డెస్కులు ఏర్పాటు చేస్తున్నాం. జిల్లాలో 219,033 కనెక్షన్లకు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నాం. ఈ ఏడాది కొత్తగా 4,763 ఉచిత విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేశాం. సదాశివపేటలో 220/132 కేవీ. సబ్‌స్టేషన్ పనులు పూర్తి కానున్నాయి. ఇందిర జలప్రభ ద్వారా 1,764 బోర్లు, సీఎల్డీపీ పథకం ద్వారా 862 బోర్లకు రూ.11 కోట్లతో విద్యుద్దీకరణ పనులు చేపడుతున్నాం. ఉపాధి హామీ పథకం ద్వారా జిల్లాలో 11,865 కుటుంబాలకు వందరోజుల పనిదినాలు కల్పించాం. రూ.354 కోట్లతో 72,763 పనులు పూర్తి చేశాము. ఈ ఆర్థిక సంవత్సరంలో 86,458 మరుగుదొడ్లు నిర్మించాలని లక్ష్యం కాగా 17,685 పూర్తి కాగా 31వేల మరుగుదొడ్ల నిర్మాణం వివిధ దశల్లో ఉన్నాయి. జిల్లాలోని 36,623 స్వయం సహాయక సంఘాలకు రూ.37 కోట్ల వడ్డీలేని రుణాలు అందజేశాం. స్త్రీనిధి బ్యాంకు ద్వారా 3,738 సంఘాలకు రూ.25 కోట్ల రుణాలు మంజూరు చేశాం. రాజీవ్ యువకిర ణాలు పథకం ద్వారా 7,939 మంది నిరుద్యోగ యువకులకు ఉపాధి కల్పించాం. బంగారుతల్లి పథకం ద్వారా 8,125 మంది అడపిల్లల వివరాలు నమోదు చేసుకోగా 6వేల మంది పిల్లలు లబ్ధిపొందారు. జడ్పీ ద్వారా జిల్లాలో ఈ ఏడాది రూ.11.98 కోట్లతో 2,593 పనులు చేపట్టగా వివిధ దశల్లో ఉన్నాయి. జడ్పీ సాధారణ నిధుల కింద నియోజకవర్గానికి రూ.10 లక్షల చొప్పున రూ.3 కోట్లు విడుదల చేశాం. ఏడవ విడత భూ పంపిణీలో భాగంగా 1192 మంది లబ్ధిదారులకు 1249 ఎకరాల భూమి పంపిణీ చేశాం. జిల్లాలో 238 మంది రైతులు ఆత్మహత్య చేసుకోగా వారి కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పున రూ.2.38 కోట్ల ఆర్థిక సహాయం అందజేశాం. కాగా అంతకు ముందు కలెక్టర్ స్మితా సబర్వాల్, ఎస్పీ విజయ్‌కుమార్‌తో కలిసి వాహనంలో నిల్చుని గౌరవ వందనం స్వీకరించారు. సాయుధ పోలీసులు నిర్వహించిన పరేడ్ అందరినీ ఆకట్టుకుంది. గణతంత్ర వేడుకల్లో విప్ జయప్రకాశ్‌రెడ్డి, జేసీ శరత్, ఏజేసీ మూర్తి, డీఆర్ఓ సాయిలు, ఆర్డీవో ధర్మారావు, హౌజింగ్ పీడీ బాల్‌రెడ్డి, పశుసంవర్ధకశాఖ జేడీ డాక్టర్ లక్ష్మారెడ్డి, డీఆర్డీఏ పీడీ రాజేశ్వర్‌రెడ్డి, డీఎస్ఓ ఏసురత్నం, డ్వామా పీడీ రవీందర్, ఏపీఎంఐపీ పీడీ రామలక్ష్మి, వ్యవసాయశాఖ జేడీ ఉమామహేశ్వరమ్మ, వికలాంగుల సంక్షేమశాఖ జేడీ లక్ష్మణచారి, ఐసీడీపీఎస్ పీడీ శైలజ, సంక్షేమశాఖ జిల్లా అధికారులు కిరణ్, శ్రీనివాస్‌రెడ్డి, చరణ్‌దాస్, రశీద్, బాల్‌చందర్, అదనపు ఎస్పీ మధుసూదన్‌రెడ్డి పాల్గొన్నారు.