మెదక్ మున్సిపాలిటీ, న్యూస్‌లైన్: గర్భిణుల సంరక్షణ కోసం జిల్లాలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హైరిస్కు కేంద్రాలు మంచి ఫలితాలిస్తున్నాయని జిల్లా ఆస్పత్రుల సమన్వయకర్త(డీసీహెచ్) వీణా కుమారి అన్నారు. శుక్రవారం ఆమె మెదక్ ఏరియా ఆస్పతి పరిధిలో నూతంగా ఏర్పాటు చేసిన హైరిస్కు కేంద్రాన్ని సందర్శించారు. ఈ కేంద్రాల ద్వార మాతా శిశు మరణాలు తగ్గించడంమే కాకుండా ప్రభుత్వ ఆసుపత్రిల్లో ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు.
ప్రస్తుతం జిల్లాలో పటాన్‌చెరు, సిద్దిపేట, మెదక్‌లో ఈ కేంద్రాలు ఏర్పాటు కాగా కొత్తగా జహీరాబాద్, నారాయణఖేడ్, గజ్వేల్‌లో ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలున్నాయని తెలిపారు. ఏరియా ఆసుపత్రి పరిధిలోని అన్ని పీహెచ్‌సీల్లో చికిత్స పొందే గర్భిణులను 7 నెలల వరకు పరీక్షించిన తర్వాత ఏదైనా అత్యవసరం ఉంటే వెంటనే ఈ కేంద్రానికి తీసుకొచ్చి ప్రత్యేకంగా చికిత్స అందజేయాలన్నారు. గర్భిణులకు చికిత్స అందించడంలో వైద్యుల ఎలాంటి నిర్లక్ష ్యం వహించిన చర్యలు తప్పవన్నారు.
అనంతరం పాపన్నపేటకు చెందిన మల్లీశ్వరి అనే మహిళకు అధిక రక్తస్రావం కావడం, ప్రత్యేక చికిత్స చేసి 3 యూనిట్ల రక్తం ఎక్కించి ఎలాంటి ప్రమాదం లేకుండా ప్రసవం చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆమెకు చికిత్స చేసిన ప్రభుత్వ గైనకాలజిస్టు డాక్టర్ శివదయాల్‌ను ఆమె అభినందించారు. ఆమె వెంట డీపీఓ జగన్నాథం, ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేకర్, గైనకాలజిస్టు ఆదిలక్ష్మి, డాక్టర్ చంద్రశేఖర్ ఉన్నారు.
సత్ఫలితాలిస్తున్న హైరిస్కు కేంద్రాలు
Published Sat, Apr 19 2014 12:12 AM | Last Updated on Sat, Sep 2 2017 6:12 AM
Advertisement
Advertisement