hijacking
-
ఆ బస్సు హైజాక్ కాలేదు : పోలీసులు
ఆగ్రా: ఉత్తరప్రదేశ్‌లోని ఓ ప్రైవేట్ బస్సు హైజాక్ కథ సుఖాంతమైంది. బస్సును అపహరించలేదని, బస్సుపై రుణం తీసుకున్న యజమాని ఈఎంఐని సకాలంలో చెల్లించకోవడంతో బస్సును తీసుకెళ్లినట్లు ఓ ఫైనాన్స్ కంపెనీ వెల్లడించింది. ప్రయాణికులను సురక్షితంగా వారి ప్రాంతాలకు తరలించినట్లు పేర్కొంది. దీంతో ఆగ్రా పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. అసలు ఏం జరిగిందంటే.. ఆగ్రాలోని న్యూ సదరన్ బైపాస్ సమీపంలో బుధవారం వేకువజామున ఓ ప్రైవేట్ బస్సును గుర్తుతెలియని దుండగులు అపహరించినట్లు వార్తలు వచ్చాయి. ఆ సమయంలో బస్సులో 34 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. బైపాస్ రోడ్ వద్ద బస్సుని ఆపిన దుండగులు మొదట బస్సు డ్రైవర్, హెల్పర్‌ను కిందకు దించేసి, ఆ తర్వాత బస్సును హైజాక్ చేసినట్లు తెలిసింది. ఆ బస్సు హర్యానాలోని గురుగ్రామ్ నుంచి మధ్యప్రదేశ్ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. దుండగులు మొదటగా తాము ఫైనాన్స్ కంపెనీ ఉద్యోగులమని చెప్పి బస్సు ఎక్కారని, తర్వాత డ్రైవర్, సహాయకుడిని బెదిరించి బస్సును అపహరించినట్లు వార్తలు వచ్చాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా, అసలు విషయం బయటపడింది. బస్సుపై రుణం తీసుకున్న యజమాని ఈఎంఐలు చెల్లించకపోవడంతో బస్సును స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నారని, ఫైనాన్స్ కంపెనీపై కేసులు నమోదు చేసినట్టు చెప్పిన పోలీసులు బస్సును ఝాన్సీకి తరలించారు. -
ఏడాదిలో ఎన్ని వెబ్ సైట్లు హైజాక్ అయ్యాయో తెలుసా?
దాదాపు 7 లక్షల వెబ్ సైట్లు ప్రమాదకరంలో ఉన్నాయా..? అవన్నీ హైజాకింగ్ కు గురయ్యాయా అంటే ..? అవుననే అంటున్నాయి గూగుల్ రికార్డ్స్. వెబ్ సెక్యురిటీని పెంచడం కోసం జరిపిన పరిశోధనలో ఈ వాస్తవాలు వెల్లడయ్యాయి. 2014 జూన్ నుంచి 2015 జూలై వరకు యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, గూగుల్ సంయుక్తంగా ఈ పరిశోధన జరిపింది. రొటీన్ గా వేయికి పైగా వెబ్ సర్వర్ లకు దుండగులు హాని కల్గిస్తూ.. సమాచారాన్ని దొంగలిస్తున్నారని పరిశోధన తెలిపింది. ఒక్క ఏడాదిలోనే 7 లక్షల 60వేలకు పైగా వెబ్ సైట్లు హైజాక్ కు గురైన సంఘటనలు చోటుచేసుకున్నాయని పేర్కొంది. హానికరమైన యూఆర్ఎల్ లను గుర్తించినప్పుడు గూగుల్ సేఫ్ బ్రౌజింగ్ అలర్ట్ ల ద్వారా నెట్ వర్క్ నిర్వాహకులకు నోటిఫికేషన్లను అందిస్తుంది. దీంతో 50 శాతం వరకూ కేసులు నిరోధించగలిగారని గూగుల్ రిపోర్టు చెప్పింది. వెబ్ సైట్లపై జరుగుతున్న ఈ అటాక్ లో ఎక్కువగా ఇంగ్లీస్ వెబ్ సైట్లు ఉంటున్నాయని, తర్వాత స్థానాల్లో చైనీస్, జర్మన్, జపనీస్, రష్యన్ భాషా వెబ్ సైట్లు ఉన్నాయని గూగుల్ పరిశోధన చెప్పింది. -
హైజాక్ హెచ్చరిక.. విమానాశ్రయాలు అలర్ట్
న్యూఢిల్లీ: విమానాల హైజాక్‌కు కుట్ర జరగొచ్చన్న నిఘా వర్గాల హెచ్చరిక నేపథ్యంలో దేశంలోని అన్ని ఎయిర్‌పోర్టుల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రధాన విమానాశ్రయాల్లో నిఘాను పెంచారు. ప్రయాణికులను, లగేజీలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ప్రయాణికులు విమానంలోకి ప్రవేశించిన తర్వాత కూడా లగేజీని జాగ్రత్తగా పరిశీలించాలని సిబ్బందికి సూచనలు చేశారు.