ఏడాదిలో ఎన్ని వెబ్ సైట్లు హైజాక్ అయ్యాయో తెలుసా? | Google Records 700,000 'Hijacking' Breaches in One Year | Sakshi
Sakshi News home page

ఏడాదిలో ఎన్ని వెబ్ సైట్లు హైజాక్ అయ్యాయో తెలుసా?

Published Sat, Apr 23 2016 8:13 PM | Last Updated on Sun, Sep 3 2017 10:35 PM

ఏడాదిలో ఎన్ని వెబ్ సైట్లు హైజాక్ అయ్యాయో తెలుసా?

ఏడాదిలో ఎన్ని వెబ్ సైట్లు హైజాక్ అయ్యాయో తెలుసా?

దాదాపు 7 లక్షల వెబ్ సైట్లు ప్రమాదకరంలో ఉన్నాయా..? అవన్నీ హైజాకింగ్ కు గురయ్యాయా అంటే ..? అవుననే అంటున్నాయి గూగుల్ రికార్డ్స్. వెబ్ సెక్యురిటీని పెంచడం కోసం జరిపిన పరిశోధనలో ఈ వాస్తవాలు వెల్లడయ్యాయి. 2014 జూన్ నుంచి 2015 జూలై వరకు యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, గూగుల్ సంయుక్తంగా ఈ పరిశోధన జరిపింది. రొటీన్ గా వేయికి పైగా వెబ్ సర్వర్ లకు దుండగులు హాని కల్గిస్తూ.. సమాచారాన్ని దొంగలిస్తున్నారని పరిశోధన తెలిపింది. ఒక్క ఏడాదిలోనే 7 లక్షల 60వేలకు పైగా వెబ్ సైట్లు హైజాక్  కు గురైన సంఘటనలు చోటుచేసుకున్నాయని పేర్కొంది.

హానికరమైన యూఆర్ఎల్ లను గుర్తించినప్పుడు గూగుల్ సేఫ్ బ్రౌజింగ్ అలర్ట్ ల ద్వారా నెట్ వర్క్ నిర్వాహకులకు నోటిఫికేషన్లను అందిస్తుంది. దీంతో 50 శాతం వరకూ కేసులు నిరోధించగలిగారని గూగుల్ రిపోర్టు చెప్పింది. వెబ్ సైట్లపై జరుగుతున్న ఈ అటాక్ లో ఎక్కువగా ఇంగ్లీస్ వెబ్ సైట్లు ఉంటున్నాయని, తర్వాత స్థానాల్లో చైనీస్, జర్మన్, జపనీస్, రష్యన్ భాషా వెబ్ సైట్లు ఉన్నాయని గూగుల్ పరిశోధన చెప్పింది.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement