హిందువులంతా ఐక్యంగా ఉండాలి
నాగర్కర్నూల్ : హిందువులంతా ఐకమత్యంగా ఉండాలని, పండగల విశిష్టతను తెలియజేయాలని విశ్వహిందూ పరిషత్ (వీహెచ్పీ) జిల్లా అధ్యక్షుడు దొడ్ల నారాయణరెడ్డి అన్నారు. శనివారం నాగర్కర్నూల్ పట్టణం మార్కెట్ శివాలయంలో హిందూ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలోని హిందూ శ్మశానవాటిక కబ్జాకు గురికాకుండా కాపాడాలన్నారు.
ఇక్కడి స్థలాన్ని సర్వే చేయించాలన్నారు. దీనిపై ఆర్డీఓకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఈ సమావేశంలో సంఘం నాయకులు రాంచంద్రారెడ్డి, సుబ్బారెడ్డి, జనార్దన్ తదితరులు పాల్గొన్నారు.