హిందుస్థాన్ షిప్‌యార్డ్ టర్నోవర్ రూ.625 కోట్లు
హ్యుందాయ్తో కలిసి రూ.10 వేల కోట్లతో ఐదు నౌకల తయారీ!
మరిన్ని ఆర్డర్లు చేతిలో ఉన్నాయన్న సీఎండీ శరత్‌బాబు
సాక్షి, విశాఖపట్నం: హిందుస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ (హెచ్ఎస్ఎల్) 2016–17 ఆరి ్థక సంవత్సరానికి అత్యధికంగా రూ.625 కోట్ల టర్నోవర్ నమోదు చేసినట్లు సంస్థ చై ర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎల్.వి.శరత్‌బాబు వెల్లడించారు. విశాఖలో మంగళవారం ఆ యన విలేకరులతో మాట్లాడుతూ, 2015–16 ఆర్థిక సంవత్సరంలో రూ.593 కోట్ల టర్నోవర్ సాధించిన హెస్‌ఎస్‌ఎల్ ఈ ఏడాది ఆ రికార్డును అధిగమించిందన్నారు.
సామర్థ్యం పెంచుకోవడం ద్వారా ఈ ఘనత సాధించామన్నారు. 2015–16లో రూ.19 కోట్లు, 2016–17లో రూ.30 కోట్లు నికర లాభాన్ని, 2016–17లో రూ.15 కో ట్ల నిర్వహణ లాభాన్ని సంస్థ తెచ్చుకోవడం 35 ఏళ్ల తర్వాత ఇదే తొలిశారని చెప్పారు.
దక్షిణ కొరియాకు చెందిన హ్యుందాయ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌తో ఒప్పందం కుదుర్చుకుని రూ.10 వేల కోట్లతో ఐదు నౌకలను తయారు చేయాలని ప్రయత్నిస్తున్నట్లు సీఎండీ తెలిపారు. దక్షిణ కొరియా ప్రభుత్వంతో కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు త్వరలోనే ఒప్పంద కుదుర్చుకోనుందన్నారు. హ్యుందాయ్ అనేది ప్రపంచంలోనే అత్యుత్తమ షిప్‌యార్డ్ అని, ఈ ఒప్పందం వల్ల ఇరు దేశాలకు ప్రయోజనం చేకూరుతుందన్నారు.
ఇప్పటికే పలు ఆర్డర్లు షిప్‌యార్డుకు వస్తున్నాయని, నేవీ కోసం రెండు కాడెట్ ట్రైనింగ్ షిప్స్, తొమ్మిది 25టి బొల్లర్డ్ పుల్–టగ్స్, కోస్ట్‌గార్డ్ కోసం ఎనిమిది ఇన్షోర్ వెసల్స్ తయారు చేసే ఆర్డర్లు వచ్చాయని వివరించారు. హెఎస్ఎల్ విస్తరణ అంశం కేంద్రం పరిశీలనలో ఉందని, హుద్‌హుద్ తుపానులో జరిగిన నష్టానికి కేంద్రం రూ.200 కోట్లు సాయం అందించిందని ఆయన తెలిపారు. ఈ మొత్తాన్ని షిప్‌యార్డ్, ఉద్యోగుల కాలనీ పునర్నిర్మాణానికి వినియోగిస్తామన్నారు.