‘హోదా’గ్ని
పెల్లుబికిన ప్రజాగ్రహం
వైఎస్సార్సీపీ పిలుపునిచ్చిన బంద్ విజయవంతం
భగ్నమైన ‘బాబు’ కుట్ర – బయటపడ్డ రెండుకళ్ల సిద్ధాంతం
జిల్లా వ్యాప్తంగా 900 మంది అరెస్టు
వ్యాపారం బంద్– ఎక్కడి బస్సులు అక్కడే
హోదాపై జిల్లా మరోసారి భగ్గుమంది. నేతలు అరెస్టులతో బంద్ విజయవంతం కాకుండా చేద్దామనుకున్న ప్రభుత్వ పాచిక జిల్లాలో పారలేదు. హోదా డిమాండ్‌తో ఆందోళన చేస్తున్న వైఎస్ఆర్సీపీ, కాంగ్రెస్, వామపక్షాల నేతలకు సహకరించకుండా పెద్ద సంఖ్యలో అరెస్టు చేయడం వెనుక బాబు ఉద్దేశ్యం బట్టబయలైంది. జిల్లా కేంద్రం కాకినాడ కలెక్టరేట్ సహా జిల్లా అంతటా ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, బ్యాంకులు, ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలు, పెట్రోలు బంకులు, సినిమాహాళ్లు మూతవేసి అన్ని వర్గాల ప్రజలు సహకరించడంతో బంద్ సంపూర్ణంగా జరిగింది.
సాక్షి ప్రతినిధి, కాకినాడ :
ప్రత్యేక హోదా కావాలంటూ జిల్లావ్యాప్తంగా వైఎస్సార్సీపీ, కాంగ్రెస్, వామపక్షాల ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నా పాలకుల గుండెల్లో గుబులు రేకెత్తించింది. తెల్లవారు జామున ఆర్టీసీ డిపోల వద్దకు తరలివెళ్లిన నేతలు తొమ్మిది డిపోల నుంచి బస్సులను బయటకు రాకుండా అడ్డుకున్నారు. దీంతో 840 బస్సులు ఉదయం నుంచి సాయంత్రం వరకు డిపోలకే పరిమితమయ్యాయి. బస్సులు అడ్డుకున్నారని, రాస్తారోకో, రోడ్డు దిగ్బంధించారని, చంద్రబాబు దిష్టిబొమ్మలు దహనం, శవయాత్ర చేస్తున్నారని జిల్లావ్యాప్తంగా సుమారు 900 మందిని అరెస్టు చేశారు. కాంగ్రెస్, వామపక్షాలు, ప్రజా సంఘాలు, చాంబర్ ఆఫ్ కామర్స్ సంఘీభావంగా ర్యాలీలు, రాస్తారోకోలు చేశారు.
∙పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు కాకినాడ నగరంలో భారీగా మోటర్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. సీపీఐ, సీపీఎం, వామపక్షాలు బంద్‌లో పాల్గొన్నాయి. సర్పవరం జంక్షన్లో కన్నబాబు నేతృత్వంలో రాస్తారోకో, తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. 200 మందిని అరెస్టుచేసి సర్పవరం పోలీసు స్టేషన్‌కు తరలించారు.
∙రామచంద్రపురంలో ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోస్ ఆధ్వర్యంలో నిర్వహించిన బంద్‌కు వామపక్షాలు తమ మద్దతుగా నిలిచాయి. బోస్‌తో పాటు వామపక్షాల నేతలు ధర్నా నిర్వహించి నినాదాలు చేశారు.
∙ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో కొత్తపేట నుంచి ర్యాలీ వరకు మోటారు సైకిల్ ర్యాలీ, రావులపాలెంలో నిరసన ర్యాలీతో జాతీయ రహదారిని దిగ్భంధించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేతోపాటు 42 మందిని అరెస్టుచేసి వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు.
∙ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా ఆధ్వర్యంలో ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఆందోళన నిర్వహించి బస్సులు బయటకు వెళ్ళకుండా అడ్డుకోగా, ఎమ్మెల్యేతోపాటు 25 మందిని అరెస్టు చేశారు.
∙ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు అనంతఉదయభాస్కర్ ఆధ్వర్యంలో అడ్డతీగల, గంగవరం, రంపచోడవరం మండలాల్లో బంద్ చేశారు. చింతూరు, రంపచోడవరం, వై.రామవరం, నియోజకవర్గంలో సుమారు 200 మందిని అరెస్టు చేశారు.
∙అమలాపురంలో వైఎస్సార్సీపీ పీఏసీ, సీజీసీ సభ్యులు పినిపే విశ్వరూప్, కుడుపూడి చిట్టబ్బాయి ఆధ్వర్యంలో తెల్లవారు జామున మూడు గంటలకే ఆర్టీసీ డిపో వద్దకు చేరుకుని బస్సులను అడ్డగించి ఆందోళన చేశారు. విశ్వరూప్, చిట్టబ్బాయితోపాటు పలువురిని అరెస్టు చేశారు.
∙రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలంలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలను పార్టీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మితోపాటు నేతలు మూయించేసి బస్సులు, ఆటోలను సైతం తిరగనివ్వలేదు. విజయలక్ష్మితోపాటు 85 నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేశారు. రాజానగరం మండలంలో వైఎస్ఆర్సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు.
∙రాజమహేంద్రవరంనగరంలో వైఎస్ఆర్సీపీ కో–ఆర్డినేటర్ రౌతు సూర్యప్రకాష్ ఆధ్వర్యంలో బంద్ నిర్వహించగా, సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్, వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా నేతలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు.
∙పిఠాపురంలో పెండెం దొరబాబు ఆధ్వర్యంలో బంద్, ర్యాలీ నిర్వహిస్తుండగా అతనితోపాటు పలువురిని అరెస్టు చేశారు. వామపక్షాలు, కాంగ్రెస్నాయకులు పాల్గొన్నారు.
∙మండపేట బస్టాండు వద్ద బైఠాయించి శాంతియుతంగా ధర్నా నిర్వహిస్తున్న వైఎస్సార్ సీపీ కోఆర్డినేటర్ వేగుళ్ల లీలాకృష్ణతోపాటు వామపక్ష నేతలను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.
∙పెద్దాపురం మున్సిపల్ సెంటర్లో మోడీ, చంద్రబాబు దిషి్ఠబొమ్మలను కో–ఆర్డినేటర్ తోట సుబ్బారావునాయుడు, వామపక్షాల ఆధ్వర్యంలో దిష్టిబొమ్మలను దహనం చేశారు.
∙అనపర్తి ఎంపీడీవో కార్యాలయం వద్ద ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అధికార కార్యక్రమం నిర్వహించగా, కో–ఆర్డినేటర్ సత్తి సూర్యనారాయణరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి సబ్బెళ్ళ కృష్ణారెడ్డి ధర్నా నిర్వహించగా ఎస్సై కిషోర్‌బాబు వారితోపాటు 80మందిని అరెస్టు చేశారు.
∙పి.గన్నవరం అక్విడేట్ వద్ద రాస్తారోకో చేస్తున్న కో–ఆర్డినేటర్ కొండేటి చిట్టిబాబుతోపాటు పలువురిని అరెస్టు చేసి పోలీసుస్టేçÙన్కు తరలిస్తుండగా పలుచోట్ల కార్యకర్తలు పోలీసు జీప్‌ను అడ్డుకున్నారు. రాజోలు నియోజకవర్గంలో కో–ఆర్డినేటర్ బొంతు రాజేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే అల్లూరు కృష్ణంరాజు వర్గీయులు బంద్నిర్వహించారు.
∙ముమ్మిడివరంలో కో–ఆర్డినేటర్ పితాని బాలకృష్ణ, రాష్ట్ర కార్యదర్శి గుత్తుల సాయి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహిస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. వారిద్దరితో పాటు రాçష్ట్ర కార్యదర్శి పెయ్యల చిట్టిబాబు తదితరులను అరెస్టు చేశారు. వైఎస్ఆర్సీపీ కో–ఆర్డినేటర్ పర్వత పూర్ణచంద్రరావు ఆధ్వర్యంలో ప్రత్తిపాడు నియోజకవర్గంలో నిర్వహించిన బంద్ విజయవంతమైంది. కో–ఆర్డినేటర్ ముత్యాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో జగ్గంపేటలో నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ నాయకులు బంద్‌లో పాల్గొని చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు.
∙రాజమహేంద్రవరం రూరల్‌లో కో–ఆర్డినేటర్లు ఆకుల వీర్రాజు, గిరిజాలబాబు బంద్ నిర్వహించారు. విఎల్పురం సెంటర్ తిలక్‌రోడ్ నుంచి భారీ మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహిస్తుండగా రూరల్–కోఆర్డినేటర్ ఆకుల వీర్రాజు, పార్టీ యువజన నాయకుడు జక్కంపూడి గణేష్‌లతోపాటు 30మందిని అరెస్టు చేశారు. రైల్వే స్టేషన్ ప్రాంతంలో బంద్ నిర్వహిస్తున్న వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి మింది నాగేంద్ర తదితరులను అరెస్టు చేసి టూటౌన్ పోలీసుస్టేçÙన్కు తరలించారు. కడియంలో బంద్నిర్వహిస్తుండగా జీఎంఆర్ పవర్ ప్రాజెక్టు వద్ద గిరిజాల బాబును, రాష్ట్ర బీసీసెల్ కార్యదర్శి దాసరి శేషగిరి తదితరులను అరెస్టు చేసి కడియం పోలీసు స్టేషన్‌కు తరలించారు. ధవళేశ్వరంలో సీఐటీయు నాయకులు ఎం.భీమేశ్వరరావు, కర్రి రామకృష్ణ, కాంగ్రెస్‌పార్టీ నాయకులను ఆందోళన చేస్తుండగా అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.
ఇదేమి దమన కాండ : ఎమ్మెల్యే జగ్గిరెడ్డి
ప్రత్యేక హోదా కోసం శాంతియుతంగా నిరనన వ్యక్తం చేస్తుంటే ప్రభుత్వం పోలీసులను ప్రయోగించి అణ దొక్కే ప్రయత్నం చేస్తోంది. పోలీసులను ఉసిగొల్పి ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు.
అప్పుడు సంజీవిని కాదని ఎందుకన్నట్టో... పీఏసీ సభ్యులు
విశ్వరూప్, సీజీసీ సభ్యులు చిట్టబ్బాయి
అప్పుడేమో ప్రత్యేక హోదా సంజీవని కాదని ఇప్పుడు ఆన్యాయం జరిగినట్టు చంద్రబాబు మాట్లాడుతున్నారు. తమఎంపీలతో నిరసన ప్రదర్శన చేయిస్తున్నట్టు డ్రామాలు ఆడుతున్నారు.
భూస్థాపితం తప్పదు : ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి
ప్రజల అభిష్టాన్ని సక్కనపెట్టి పాలన చే స్తే అధికార పార్టీతోబాటు నాయకులు భూస్థాపితం కాకతప్పదు. అరెస్టులు ద్వారా రాష్ట్ర ప్రజల ప్రత్యేక హోదా అకాంక్షను అడ్డుకోలేరు.
చంద్రబాబూ డ్రామాలు ఆడకండి : ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా
ఐదు కోట్ల మంది ఆశలు పెట్టుకున్న ప్రత్యేక హోదా పై చంద్రబాబు నాయుడు పూటకో డ్రామా ఆడుతున్నారు. టీడీపీ, టీజేపీలు కలిసి ఆడుతున్న నాటకాన్ని ప్రజలు గమనిస్తున్నారు.
చంద్రబాబు వల్లే ప్రత్యేక హోదాకు మంగళం పాడిన కేంద్రం : ఎమ్మెల్సీ బోస్
ప్రత్యేక హోదా సంజీవిని కాదని చెప్పిన ఏపీ సీఎం చంద్రబాబునాయుడు వల్లనే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి ప్రత్యేక హోదా నిచ్చేందుకు వెనుకడుగు వేసింది.
బాబుకు మతిభ్రమించింది : సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు మతిభ్రమించిన వ్యక్తిగా పాలన సాగిస్తూ, ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నారు. గద్దెనెక్కిన తరువాత హామీలన్ని నీటి మూటలుగా మారాయి.
అరెస్టులు దారుణం : యువనేత జక్కంపూడి రాజా
ప్రత్యేక హోదాను ఇచ్చి ఆదుకోవాలని కోరుతూ శాంతి యుతంగా బంద్ చేయిస్తున్న ప్రతిపక్షాలకు చెందిన వారిని అరెస్టులు చేయించడం దారుణం.