‘హోదా’గ్ని
- పెల్లుబికిన ప్రజాగ్రహం
- వైఎస్సార్‌సీపీ పిలుపునిచ్చిన బంద్ విజయవంతం
- భగ్నమైన ‘బాబు’ కుట్ర – బయటపడ్డ రెండుకళ్ల సిద్ధాంతం
- జిల్లా వ్యాప్తంగా 900 మంది అరెస్టు
- వ్యాపారం బంద్– ఎక్కడి బస్సులు అక్కడే
- ∙పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు కాకినాడ నగరంలో భారీగా మోటర్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. సీపీఐ, సీపీఎం, వామపక్షాలు బంద్‌లో పాల్గొన్నాయి. సర్పవరం జంక్షన్‌లో కన్నబాబు నేతృత్వంలో రాస్తారోకో, తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. 200 మందిని అరెస్టుచేసి సర్పవరం పోలీసు స్టేషన్‌కు తరలించారు.
- ∙రామచంద్రపురంలో ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోస్ ఆధ్వర్యంలో నిర్వహించిన బంద్‌కు వామపక్షాలు తమ మద్దతుగా నిలిచాయి. బోస్‌తో పాటు వామపక్షాల నేతలు ధర్నా నిర్వహించి నినాదాలు చేశారు.
- ∙ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో కొత్తపేట నుంచి ర్యాలీ వరకు మోటారు సైకిల్ ర్యాలీ, రావులపాలెంలో నిరసన ర్యాలీతో జాతీయ రహదారిని దిగ్భంధించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేతోపాటు 42 మందిని అరెస్టుచేసి వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు.
- ∙ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా ఆధ్వర్యంలో ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఆందోళన నిర్వహించి బస్సులు బయటకు వెళ్ళకుండా అడ్డుకోగా, ఎమ్మెల్యేతోపాటు 25 మందిని అరెస్టు చేశారు.
- ∙ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు అనంతఉదయభాస్కర్ ఆధ్వర్యంలో అడ్డతీగల, గంగవరం, రంపచోడవరం మండలాల్లో బంద్ చేశారు. చింతూరు, రంపచోడవరం, వై.రామవరం, నియోజకవర్గంలో సుమారు 200 మందిని అరెస్టు చేశారు.
- ∙అమలాపురంలో వైఎస్సార్‌సీపీ పీఏసీ, సీజీసీ సభ్యులు పినిపే విశ్వరూప్, కుడుపూడి చిట్టబ్బాయి ఆధ్వర్యంలో తెల్లవారు జామున మూడు గంటలకే ఆర్టీసీ డిపో వద్దకు చేరుకుని బస్సులను అడ్డగించి ఆందోళన చేశారు. విశ్వరూప్, చిట్టబ్బాయితోపాటు పలువురిని అరెస్టు చేశారు.
- ∙రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలంలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలను పార్టీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మితోపాటు నేతలు మూయించేసి బస్సులు, ఆటోలను సైతం తిరగనివ్వలేదు. విజయలక్ష్మితోపాటు 85 నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేశారు. రాజానగరం మండలంలో వైఎస్‌ఆర్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు.
- ∙రాజమహేంద్రవరంనగరంలో వైఎస్‌ఆర్‌సీపీ కో–ఆర్డినేటర్ రౌతు సూర్యప్రకాష్ ఆధ్వర్యంలో బంద్ నిర్వహించగా, సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్, వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా నేతలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు.
- ∙పిఠాపురంలో పెండెం దొరబాబు ఆధ్వర్యంలో బంద్, ర్యాలీ నిర్వహిస్తుండగా అతనితోపాటు పలువురిని అరెస్టు చేశారు. వామపక్షాలు, కాంగ్రెస్‌నాయకులు పాల్గొన్నారు.
- ∙మండపేట బస్టాండు వద్ద బైఠాయించి శాంతియుతంగా ధర్నా నిర్వహిస్తున్న వైఎస్సార్ సీపీ కోఆర్డినేటర్ వేగుళ్ల లీలాకృష్ణతోపాటు వామపక్ష నేతలను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.
- ∙పెద్దాపురం మున్సిపల్ సెంటర్‌లో మోడీ, చంద్రబాబు దిషి్ఠబొమ్మలను కో–ఆర్డినేటర్ తోట సుబ్బారావునాయుడు, వామపక్షాల ఆధ్వర్యంలో దిష్టిబొమ్మలను దహనం చేశారు.
- ∙అనపర్తి ఎంపీడీవో కార్యాలయం వద్ద ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అధికార కార్యక్రమం నిర్వహించగా, కో–ఆర్డినేటర్ సత్తి సూర్యనారాయణరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి సబ్బెళ్ళ కృష్ణారెడ్డి ధర్నా నిర్వహించగా ఎస్సై కిషోర్‌బాబు వారితోపాటు 80మందిని అరెస్టు చేశారు.
- ∙పి.గన్నవరం అక్విడేట్ వద్ద రాస్తారోకో చేస్తున్న కో–ఆర్డినేటర్ కొండేటి చిట్టిబాబుతోపాటు పలువురిని అరెస్టు చేసి పోలీసుస్టేçÙన్‌కు తరలిస్తుండగా పలుచోట్ల కార్యకర్తలు పోలీసు జీప్‌ను అడ్డుకున్నారు. రాజోలు నియోజకవర్గంలో కో–ఆర్డినేటర్ బొంతు రాజేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే అల్లూరు కృష్ణంరాజు వర్గీయులు బంద్‌నిర్వహించారు.
- ∙ముమ్మిడివరంలో కో–ఆర్డినేటర్ పితాని బాలకృష్ణ, రాష్ట్ర కార్యదర్శి గుత్తుల సాయి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహిస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. వారిద్దరితో పాటు రాçష్ట్ర కార్యదర్శి పెయ్యల చిట్టిబాబు తదితరులను అరెస్టు చేశారు. వైఎస్‌ఆర్‌సీపీ కో–ఆర్డినేటర్ పర్వత పూర్ణచంద్రరావు ఆధ్వర్యంలో ప్రత్తిపాడు నియోజకవర్గంలో నిర్వహించిన బంద్ విజయవంతమైంది. కో–ఆర్డినేటర్ ముత్యాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో జగ్గంపేటలో నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ నాయకులు బంద్‌లో పాల్గొని చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు.
- ∙రాజమహేంద్రవరం రూరల్‌లో కో–ఆర్డినేటర్లు ఆకుల వీర్రాజు, గిరిజాలబాబు బంద్ నిర్వహించారు. విఎల్‌పురం సెంటర్ తిలక్‌రోడ్ నుంచి భారీ మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహిస్తుండగా రూరల్–కోఆర్డినేటర్ ఆకుల వీర్రాజు, పార్టీ యువజన నాయకుడు జక్కంపూడి గణేష్‌లతోపాటు 30మందిని అరెస్టు చేశారు. రైల్వే స్టేషన్ ప్రాంతంలో బంద్ నిర్వహిస్తున్న వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి మింది నాగేంద్ర తదితరులను అరెస్టు చేసి టూటౌన్ పోలీసుస్టేçÙన్‌కు తరలించారు. కడియంలో బంద్‌నిర్వహిస్తుండగా జీఎంఆర్ పవర్ ప్రాజెక్టు వద్ద గిరిజాల బాబును, రాష్ట్ర బీసీసెల్ కార్యదర్శి దాసరి శేషగిరి తదితరులను అరెస్టు చేసి కడియం పోలీసు స్టేషన్‌కు తరలించారు. ధవళేశ్వరంలో సీఐటీయు నాయకులు ఎం.భీమేశ్వరరావు, కర్రి రామకృష్ణ, కాంగ్రెస్‌పార్టీ నాయకులను ఆందోళన చేస్తుండగా అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.