ఆ హక్కు రాష్ట్రాలకు లేదు...
న్యూఢిల్లీ: అక్టోబర్ 2 గాంధీ జయంతి జాతీయ సెలవు రోజును మార్చే హక్కు ఏ రాష్ట్ర ప్రభుత్వానికి లేదని కేంద్ర మంత్రి ముక్తర్ అబ్బాస్ నక్వీ స్పష్టం చేశారు. రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో కాంగ్రెస్ ఎంపీ శాంతారామ్ నాయక్ లేవనెత్తిన ప్రశ్నకు ఆయన వివరణ ఇచ్చారు. అది ప్రింటింగ్ తప్పిదమని, దాని సరిచేస్తామని పేర్కొన్నారు.
గోవాలోని బీజేపీ ప్రభుత్వం క్రిస్మస్, గుడ్ ఫ్రైడే పండుగలకు సెలవు ప్రకటించి, గాంధీ జయంతిని విస్మరించడం దుమారం రేపిన సంగతి తెలిసిందే.