Hollywood filmmaker
-
రూ. 200 కోట్ల కలెక్షన్ల క్లబ్‌కు చేరువలో..
ముంబై: భారత బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న హాలీవుడ్ చిత్రం 'ది జంగిల్ బుక్' అరుదైన రికార్డుకు చేరువవుతోంది. మన దేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన తొలి హాలీవుడ్ చిత్రంగా ఇప్పటికే రికార్డు సృష్టించిన ఈ సినిమా.. 200 కోట్ల రూపాయల క్లబ్లో చేరిన తొలి హాలీవుడ్ సినిమాగా మరో రికార్డు నెలకొల్పనుంది. భారత్‌లో ఈ సినిమాకు ఇప్పటివరకు 180 కోట్ల రూపాయల (నెట్) కలెక్షన్లు వచ్చాయి. ఏప్రిల్ 8న ఈ సినిమా దేశంలో విడుదలైంది. జాన్ ఫావ్ రియో దర్శకత్వంతో నిర్మించిన ఈ 3డీ లైవ్ ఫాంటసీ మూవీ.. భారతీయ చిత్రాలకు దీటుగా ప్రదర్శితమవుతోంది. ఇంగ్లీష్, హిందీ, తమిళ్, తెలుగు భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేశారు. -
ఆల్‌టైమ్ రికార్డు.. రూ. 240 కోట్లు కలెక్షన్లు
ముంబయి: హాలీవుడ్ చిత్రం 'ది జంగిల్ బుక్' భారత బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లతో దూసుకెళ్తోంది. ఈ సినిమా ఇప్పటి వరకు 240 కోట్ల రూపాయలు (గ్రాస్) వసూలు చేయగా, నెట్ కలెక్షన్లు 173 కోట్ల వరకు వచ్చాయి. సినీ విమర్శకుడు, బిజినెస్ ఎనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ఈ విషయాన్ని ట్వీట్ చేశాడు. ఏప్రిల్ 8న ఈ సినిమా దేశంలో విడుదలైంది. ఇప్పటి వరకు మన దేశంలో విడుదలైన ఏ హాలీవుడ్ చిత్రం కూడా ఇంతపెద్ద మొత్తంలో వసూళ్లు రాబట్టలేదు. జాన్ ఫావ్ రియో దర్శకత్వంతో నిర్మించిన ఈ 3డీ లైవ్ ఫాంటసీ మూవీ.. భారతీయ చిత్రాలకు దీటుగా ప్రదర్శితమవుతోంది. ఇంగ్లీష్, హిందీ, తమిళ్, తెలుగు భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేశారు. -
రికార్డు స్థాయిలో రూ. 148 కోట్ల కలెక్షన్లు
ముంబయి: హాలీవుడ్ చిత్రం 'ది జంగిల్ బుక్' భారత బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లు సాధిస్తోంది. ఏప్రిల్ 8న దేశంలో విడుదలైన ఈ సినిమా ఇప్పటి వరకు 148 కోట్ల రూపాయలను వసూలు చేసింది. సినీ విమర్శకుడు, బిజినెస్ ఎనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ఈ విషయాన్ని ట్విట్టర్లో వెల్లడించారు. ఈ సినిమా విడుదలై 20 రోజులు అవుతున్నా ప్రేక్షకుల ఆదరణ తగ్గలేదు. ఇప్పటి వరకు మన దేశంలో విడుదలైన ఏ హాలీవుడ్ చిత్రం కూడా ఇంతపెద్ద మొత్తంలో వసూళ్లు రాబట్టలేదు. జాన్ ఫావ్ రియో దర్శకత్వంతో నిర్మించిన ఈ 3డీ లైవ్ ఫాంటసీ మూవీ.. భారతీయ చిత్రాలతో పోటీని తట్టుకుని విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఇంగ్లీష్, హిందీ, తమిళ్, తెలుగు భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేశారు. -
పిల్లల సినిమాకు రూ.132 కోట్ల కలెక్షన్లు
ముంబయి: హాలీవుడ్ చిత్రం 'ది జంగిల్ బుక్' భారత బాక్సాఫీస్ వద్ద రికార్డు సృష్టిస్తోంది. ఈ సినిమా కలెక్షన్లు రూ. 150 కోట్లకు చేరువవుతున్నాయి. మూడు వారాల్లో ఈ సినిమా రూ. 132.96 కోట్లు వసూలు చేసినట్టు సినీ విమర్శకుడు, బిజినెస్ ఎనలిస్ట్ తరణ్ ఆదర్శ్ వెల్లడించారు. మూడో వారాంతంలోనూ 'ది జంగిల్ బుక్' జోరు తగ్గలేదు. శుక్రవారం రూ.3.58 కోట్లు, శనివారం 6.65 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. అక్షయ్ కుమార్ 'ఎయిర్ లిఫ్ట్' కలెక్షన్లను అధిగమించి హిందీలో ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. జాన్ ఫావ్ రియో దర్శకత్వంతో నిర్మించిన ఈ 3డీ లైవ్ ఫాంటసీ మూవీ ప్రపంచవ్యాప్తంగానూ రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతోంది. -
రూ. 100 కోట్ల మార్క్‌ను దాటేసింది
ముంబై: హాలీవుడ్ చిత్రం 'ది జంగిల్ బుక్' రికార్డు సృష్టిస్తోంది. భారత బాక్సాఫీసు వద్ద ఈ సినిమా కలెక్షన్ల జోరు కొనసాగుతోంది. పది రోజుల్లో ఈ సినిమా కలెక్షన్లు 100 కోట్ల మార్క్ దాటింది. విడుదలైన తర్వాత రెండో వారంలోనూ మంచి కలెక్షన్లు రాబడుతోంది. శుక్రవారం 8.02 కోట్లు, శనివారం 8.51 కోట్లు, ఆదివారం 10.67 కోట్ల రూపాయలను వసూలు చేసింది. పది రోజుల్లో 101.82 కోట్ల రూపాయల కలెక్షన్లు వచ్చినట్టు ట్రేడ్ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశాడు. ఇప్పటి వరకు మన దేశంలో విడుదలైన ఏ హాలీవుడ్ చిత్రం కూడా ఇంతపెద్ద మొత్తంలో వసూళ్లు రాబట్టలేదు. జాన్ ఫావ్ రియో దర్శకత్వంతో నిర్మించిన ఈ 3డీ లైవ్ ఫాంటసీ మూవీ.. భారతీయ చిత్రాలతో పోటీని తట్టుకుని విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఇంగ్లీష్, హిందీ, తమిళ్, తెలుగు భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేశారు. 1894లో ఒక నవలగా విడుదలైన జంగిల్ బుక్ కథ సారాంశం ఆధారంగా కొత్త సాంకేతిక పరిజ్ఞానం జోడించి కన్నులకు కట్టినట్లుగా తీర్చిదిద్దారు. ఇందులో మోగ్లీ అనే పిల్లాడి పాత్రలో భారతీయ సంతతికి చెందిన పిల్లాడు నీల్ సేథి నటించాడు. ఏప్రిల్ 8న భారత్ లో ఈ సినిమా విడుదలైంది. -
ఇండియాలో రికార్డు బద్దలుకొడుతున్న ది జంగిల్ బుక్
ముంబయి: ఇండియన్ బాక్సాపీసు వద్ద హాలీవుడ్ చిత్రం 'ది జంగిల్ బుక్' రికార్డు సృష్టిస్తోంది. జాన్ ఫావ్ రియో దర్శకత్వంతో నిర్మించిన ఈ 3డీ లైవ్ ఫాంటసీ మూవీ వారం రోజుల్లో దాదాపు రూ.70 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. ఎప్పుడో 1894లో ఒక నవలగా విడుదలైన జంగిల్ బుక్ కథ సారాంశం ఆధారంగా కొత్త సాంకేతిక పరిజ్ఞానం జోడించి కన్నులకు కట్టినట్లుగా తీర్చిదిద్దారు. మొత్తం ఇంగ్లీష్, హిందీ, తమిళ్, తెలుగు భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేశారు. అడవిలో ఓ నల్లపిల్లికి దొరికిన పిల్లాడిని తిరిగి మనుషులతో జత చేసే క్రమంలో భాగంగా చోటుచేసుకున్న పరిణామాలే ఈ జంగిల్ బుక్. ఇందులో మోగ్లీ అనే పిల్లాడి పాత్రలో భారతీయ సంతతికి చెందిన పిల్లాడు నీల్ సేథి నటించాడు. ఒక్క గురువారమే ఈ చిత్రం దేశ వ్యాప్తంగా దాదాపు పది కోట్లు వసూలు చేసి మొత్తం వారం రోజుల వసూళ్లలో రూ.74.08 కోట్లకు చేరుకుంది. ఏప్రిల్ 8న భారత్ లో ఈ సినిమా విడుదలైంది. కాగా, ఇప్పటి వరకు మన దేశంలో విడుదలైన ఏ హాలీవుడ్ చిత్రం కూడా ఇంతపెద్ద మొత్తంలో వసూళ్లు రాబట్టలేదు.