హైదరాబాద్ చేరుకున్న హోండా అమేజ్ డ్రైవ్
హైదరాబాద్: హోండాఅమేజ్ డ్రైవ్ హైదరాబాద్ చేరుకుంది. ‘సెడాన్ హోండా అమేజ్ ఫ్యామిలీ- లాంగెస్ట్ డ్రైవ్ త్రూ అమేజింగ్ ఇండియా’ పేరుతో హోండా చేపట్టిన ఈ సుదీర్ఘ డ్రైవ్ 2014 సెప్టెంబర్ 15న జోధ్‌పూర్‌లో ప్రారంభమైంది. దేశ వ్యాప్తంగా 23,000 కిలోమీటర్లు ఈ డ్రైవ్ జరగనుంది. 250 నగరాలు, పట్టణాలను కలుపుకుంటూ డ్రైవ్ సాగుతుంది. ఆగ్రా, ముంబై, బెంగళూర్ నగరాలను కలుపుకుంటూ సుదీర్ఘ ప్రయాణం ఇప్పటికి హైదరాబాద్ చేరుకుంది. గ్రేటర్ నోయిడాలో ఈ డ్రైవ్ ముగుస్తుంది.
రికార్డు విక్రయాలు...
హోండా అమేజ్ సెడాన్ ఫ్యామిలీ కారుకు కస్టమర్ల నుంచి అపూర్వ ఆదరణ లభించింది. 16 నెలల్లోనే లక్ష విక్రయాలను అధిగమించింది. దీనిని పురస్కరించుకునే కంపెనీ ఈ డ్రైవ్ నిర్వహిస్తోంది. అనేకు ఆటోమొబైల్ మ్యాగజైన్లు కూడా హోండా అమేజ్‌ను ‘కార్ ఆఫ్ ది ఇయర్’, కాంపాక్ట్ సెడాన్ ఆఫ్ ది ఇయర్‌గా గుర్తించాయి. గత ఆర్థిక సంవత్సరంలో ఈ కారు 12 ప్రముఖ ఆటోమొబైల్ అవార్డులను గెలుపొందింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగింపునాటికి 150 నగరాల్లో 230 డీలర్‌షిప్‌లకు హోండా నెట్వర్క్ విస్తృతం కానుంది.