హైదరాబాద్ చేరుకున్న హోండా అమేజ్ డ్రైవ్ | Honda amaze drive came to hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్ చేరుకున్న హోండా అమేజ్ డ్రైవ్

Published Tue, Oct 21 2014 12:52 AM | Last Updated on Tue, Sep 4 2018 5:15 PM

హైదరాబాద్ చేరుకున్న హోండా అమేజ్ డ్రైవ్ - Sakshi

హైదరాబాద్ చేరుకున్న హోండా అమేజ్ డ్రైవ్

హైదరాబాద్: హోండాఅమేజ్ డ్రైవ్ హైదరాబాద్ చేరుకుంది. ‘సెడాన్ హోండా అమేజ్ ఫ్యామిలీ- లాంగెస్ట్ డ్రైవ్ త్రూ అమేజింగ్ ఇండియా’ పేరుతో హోండా చేపట్టిన ఈ సుదీర్ఘ డ్రైవ్ 2014 సెప్టెంబర్ 15న జోధ్‌పూర్‌లో ప్రారంభమైంది. దేశ వ్యాప్తంగా 23,000 కిలోమీటర్లు ఈ డ్రైవ్ జరగనుంది. 250 నగరాలు, పట్టణాలను కలుపుకుంటూ డ్రైవ్ సాగుతుంది.  ఆగ్రా, ముంబై, బెంగళూర్ నగరాలను కలుపుకుంటూ సుదీర్ఘ ప్రయాణం ఇప్పటికి హైదరాబాద్ చేరుకుంది. గ్రేటర్ నోయిడాలో ఈ డ్రైవ్ ముగుస్తుంది.

రికార్డు విక్రయాలు...
హోండా అమేజ్ సెడాన్ ఫ్యామిలీ కారుకు కస్టమర్ల నుంచి అపూర్వ ఆదరణ లభించింది. 16 నెలల్లోనే లక్ష విక్రయాలను అధిగమించింది. దీనిని పురస్కరించుకునే కంపెనీ ఈ డ్రైవ్ నిర్వహిస్తోంది.  అనేకు ఆటోమొబైల్ మ్యాగజైన్లు కూడా హోండా అమేజ్‌ను ‘కార్ ఆఫ్ ది ఇయర్’, కాంపాక్ట్ సెడాన్ ఆఫ్ ది ఇయర్‌గా గుర్తించాయి. గత ఆర్థిక సంవత్సరంలో ఈ కారు 12 ప్రముఖ ఆటోమొబైల్ అవార్డులను గెలుపొందింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగింపునాటికి 150 నగరాల్లో 230 డీలర్‌షిప్‌లకు హోండా నెట్‌వర్క్ విస్తృతం కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement