Honda Amaze sedan family car
-
నీ లుక్ అదిరే, సరికొత్త ఫీచర్లతో విడుదలైన సెడాన్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీలో ఉన్న హోండా కార్స్ ఇండియా కొత్త అమేజ్ కాంపాక్ట్ సెడాన్ కారును విడుదల చేసింది.ఢిల్లీ ఎక్స్‌షోరూంలో ధరలు వేరియంట్‌నుబట్టి రూ.6.32 లక్షల నుంచి రూ.11.15 లక్షల మధ్య ఉంది.పెట్రోల్, డీజిల్ పవర్‌ట్రెయిన్స్‌లో వేరియంట్లను ప్రవేశపెట్టింది.పెట్రోల్ 1.2 లీటర్, డీజిల్ 1.5 లీటర్లో ఇంజన్‌ను రూపొందించింది. వేరియంట్‌నుబట్టి పెట్రోల్ అయితే 18.6 కిలోమీటర్లు, డీజిల్ 24.7 కిలోమీటర్ల వరకు మైలేజీ ఇస్తుందని కంపెనీ తెలిపింది ఎనిమిదేళ్లలో అమేజ్ శ్రేణిలో ఇప్పటి వరకు దేశంలో కంపెనీ 4.5 లక్షల యూనిట్ల కార్లను విక్రయించింది. ఇందులో 68 శాతం వాటా ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల నుంచి సమకూరిందని కంపెనీ ప్రెసిడెంట్ గాకు నకనిశి ఈ సందర్భంగా తెలిపారు. 40% మంది కస్టమర్లు తొలిసారిగా అమేజ్‌ను సొంతం చేసుకున్నారని చెప్పారు. దక్షిణాఫ్రికా, నేపాల్, భూటాన్‌కు సైతం భారత్ నుంచి అమేజ్ కార్లు ఎగుమతి అవుతున్నాయని వివరించారు. చదవండి: ప్రైవేట్ ట్రైన్స్, రూ.30వేల కోట్ల టెండర్లను రిజెక్ట్ చేసిన కేంద్రం -
హైదరాబాద్ చేరుకున్న హోండా అమేజ్ డ్రైవ్
హైదరాబాద్: హోండాఅమేజ్ డ్రైవ్ హైదరాబాద్ చేరుకుంది. ‘సెడాన్ హోండా అమేజ్ ఫ్యామిలీ- లాంగెస్ట్ డ్రైవ్ త్రూ అమేజింగ్ ఇండియా’ పేరుతో హోండా చేపట్టిన ఈ సుదీర్ఘ డ్రైవ్ 2014 సెప్టెంబర్ 15న జోధ్‌పూర్‌లో ప్రారంభమైంది. దేశ వ్యాప్తంగా 23,000 కిలోమీటర్లు ఈ డ్రైవ్ జరగనుంది. 250 నగరాలు, పట్టణాలను కలుపుకుంటూ డ్రైవ్ సాగుతుంది. ఆగ్రా, ముంబై, బెంగళూర్ నగరాలను కలుపుకుంటూ సుదీర్ఘ ప్రయాణం ఇప్పటికి హైదరాబాద్ చేరుకుంది. గ్రేటర్ నోయిడాలో ఈ డ్రైవ్ ముగుస్తుంది. రికార్డు విక్రయాలు... హోండా అమేజ్ సెడాన్ ఫ్యామిలీ కారుకు కస్టమర్ల నుంచి అపూర్వ ఆదరణ లభించింది. 16 నెలల్లోనే లక్ష విక్రయాలను అధిగమించింది. దీనిని పురస్కరించుకునే కంపెనీ ఈ డ్రైవ్ నిర్వహిస్తోంది. అనేకు ఆటోమొబైల్ మ్యాగజైన్లు కూడా హోండా అమేజ్‌ను ‘కార్ ఆఫ్ ది ఇయర్’, కాంపాక్ట్ సెడాన్ ఆఫ్ ది ఇయర్‌గా గుర్తించాయి. గత ఆర్థిక సంవత్సరంలో ఈ కారు 12 ప్రముఖ ఆటోమొబైల్ అవార్డులను గెలుపొందింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగింపునాటికి 150 నగరాల్లో 230 డీలర్‌షిప్‌లకు హోండా నెట్వర్క్ విస్తృతం కానుంది.