టీడీపీ అరాచక పాలనపై పోరుబాట
చోడవరం టౌన్/బుచ్చెయ్యపేట: ప్రత్యేక హోదాపై ఓటింగ్ జరగకుండా టీడీపీ, బీజేపీ అడ్డుకుంటున్నాయని విశాఖ, విజయనగరం జిల్లాల కాంగ్రెస్ నాయకులు పి.బాలరాజు, వై.ఆదిరాజు అన్నారు. చోడవరంలో ఆదివారం జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశం అనంతరం విలేకరులతో వారు మాట్లాడారు. ప్రభుత్వ పథకాలు పూర్తిస్థాయిలో అమలుచేయడం లేదని, జన్మభూమి కమిటీల ద్వారా ప్రజల సొమ్ము దోచుకుంటున్నారని, ఉద్యోగాలు లేక నిరుద్యోగులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. రానున్న రోజుల్లో యువకులు, నిరుద్యోగులతో కలసి పోరాటాలు చేస్తామన్నారు.
బుచ్చెయ్యపేటలోని వడ్డాది సీడీసీ చైర్మన్ దొండా రాంబాబు స్వగహం వద్ద జరిగిన కార్యకర్తల సమావేశం మాజీ మంత్రి పి.బాలరాజు మాట్లాడుతూ పేదల పొట్ట కొట్టేందుకే ప్రభుత్వం సర్వే పనులు చేపడుతుందన్నారు. ప్రతిపక్షంలో ఉన్నపుడు బాకై్సట్ తవ్వకాలను వ్యతిరేకించిన చంద్రబాబు, గద్దెనెక్కి ఏజెన్సీలోని ఖనిజ సంపదను తరలించేందుకు చూస్తున్నారని, తవ్వకాలను అడ్డుకుంటామన్నారు. బాకై్సట్ తవ్వకాలపై ప్రభుత్వం జీవో–97 రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాష్టంలో అరాచక పాలన సాగుతుందని, పేద ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోని టీడీపీ ప్రభుత్వంపై ప్రజా పోరాటం చేయడానికి కార్యాచరణతో వెళ్తున్నామన్నారు.