Horse race
-
Horse Riding.. సాహసపు.. సవారీ..!
గుర్రపు సవారీ అనేదీ ఆటవిడుపు, సాహస క్రీడ, ప్రస్తుతం నగరంలో ఇదే ట్రెండ్‌గా మారుతోంది. యువతతో పాటు చిన్నపిల్లలు సైతం గుర్రపు సవారీ నేర్చుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. తల్లిదండ్రులు సైతం తమ పిల్లలకు హార్స్ రైడింగ్‌లో శిక్షణ ఇప్పించి.. వారు గుర్రాలపై సవారీ చేస్తుంటే చూసి ముచ్చటపడుతుంటారు. యువతకు, వారి తల్లిదండ్రుల ఆసక్తికి అనుగుణంగా హార్స్ రైడింగ్ ట్రైనింగ్ సెంటర్లు వెలుస్తున్నాయి. ఈ కోవలోనే నాగోలు డివిజన్ పరిధి రాక్‌టౌన్ కాలనీలో నవీన్ హార్స్ రైడింగ్ స్కూల్ గత కొన్నేళ్లుగా గుర్రపు స్వారీలో అనేక మందికి శిక్షణ ఇస్తూ మన్ననలను పొందుతోంది. – మన్సూరాబాద్మానసిక వికాసానికి, శారీరక ఆరోగ్యానికి సాహసపు సవారీ సంజీవనిలా పనిచేస్తుంది. ముఖ్యంగా మానసిక వికాసం లోపించిన చిన్నారులకు మంచి ఫలితాలనిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. పిల్లలు గుర్రపు స్వారీ చేయడం వల్ల వారిలో ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. గుర్రం కళ్లెం పట్టుకోవడం, నిటారుగా కూర్చోవడం, అశ్వాన్ని దూకించడం ఒకే లయలో ముందుకుసాగడం వంటి చర్యలతో మెదడుకు, శరీరానికి మధ్య సమన్వయం ఏర్పడి మానసిక ఉత్తేజం కలుగుతుంది. ఫలితంగా అనేక రుగ్మతలు వాటంతట అవే తగ్గిపోతాయి. అనేక మంది విదేశీయులు కూడ నవీన్ హార్స్ రైడింగ్ స్కూల్లో శిక్షణ తీసుకుంటున్నారు.సహసక్రీడతో జర జాగ్రత్త..గుర్రపు స్వారీ అనేది సాహస క్రీడ. ప్రమాదాలకు కూడా ఎక్కువ అవకాశాలున్నాయి. ప్రమాదాలు సంభవించినా కూడా రైడర్‌కు ప్రమాదం జరగకుండా శిక్షకులు పలు జాగ్రత్తలు తీసుకుంటారు. గట్టి నేలల్లో ప్రమాదాలకు ఎక్కువ అవకాశం ఉండటంతో ఇసుక నేలల్లో శిక్షణ ఇస్తుంటారు.ఎంపిక చేసిన గుర్రాలతో శిక్షణ..మా శిక్షణా కేంద్రంలో మొత్తం 13 గుర్రాలున్నాయి. పదేళ్ల పాటు సేవలు అందించి విశ్రాంతి తీసుకుంటున్న గుర్రాలను ఎంపిక చేసి ప్రత్యేకంగా చికిత్స కోసం వచ్చే పిల్లల సేవలకు వినియోగిస్తాము. చిన్నపిల్లలతో మంచిగా మసలేందుకు, రౌతు తీరుని గమనించేందుకు గుర్రాలకు ముందే శిక్షణ ఇస్తాము. పిల్లల వైకల్యానికి అనుగుణంగా ఏ గుర్రంతో స్వారీ చేయాలనేది నిర్ణయించి శిక్షణ ప్రారంభిస్తాము. ప్రతి నెలా రాజస్థాన్ నుంచి వచ్చిన నిపుణులతో గుర్రాలకు నాడలను వేయిస్తాం. – నవీన్చౌదరీ, హార్స్ రైడింగ్ శిక్షకుడుమానసిక రుగ్మతలకు..చిన్నారుల్లో వివిధ మానసిక రుగ్మతలను నయం చేసేందుకు వివిధ వైద్య విధానాల్లో లొంగని వాటికి అరుదైన చికిత్సా విధానం హార్స్ రైడింగ్ అని పలువురు వైద్యులు సూచిస్తున్నారు. మా పాపను గత కొన్ని నెలలుగా గుర్రపుస్వారీకి తీసుకొస్తున్నాను. గతంలో కన్నా చాలా మెరుగ్గా ఉంటుంది. తనంతట తానుగా పనులు చేసుకుంటుంది. మెదడు, శారీరక ప్రక్రియ మెరుగ్గా అనిపిస్తుంది. మానసికంగా దృఢంగా తయారవుతుంది. – ఎన్.అపర్ణఇవి చదవండి: నూనెల ధర ఎందుకు పెరిగింది? -
అనంతపురంలో ఎడ్ల, గుర్రం పందాలు (ఫొటోలు)
-
ఆన్లైన్ హార్స్ రేస్ బెట్టింగ్ గుట్టురట్టు.. లక్షల్లో నగదు స్వాధీనం
గచ్చిబౌలి: చెన్నైలో జరుగుతున్న గుర్రపు పందేలపై నిర్వహిస్తున్న ఆన్లైన్ హార్స్ రేస్ బెట్టింగ్ గుట్టును మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు రట్టు చేశారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకొని రూ.8 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం మాదాపూర్ డీసీపీ శిల్పవల్లితెలిపిన మేరకు.. శుక్రవారం చెన్నైలో జరిగే గుర్రపు పందేలపై బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో ఎస్వోటీ పోలీసులు మాదాపూర్, గుట్టలబేగంపేట్‌లోని ఓ ఇంట్లో సోదాలు నిర్వహించారు. బెట్టింగ్ నిర్వహిస్తుండగా ఇద్దరి అదుపులోకి తీసుకొని మాదాపూర్ పోలీలకు అప్పగించారు. నిందితులు నెల్లూరుకు చెందిన వాకా వెంకటేశ్వర్ రెడ్డి(34), కర్నూల్‌కు చెందిన పందింటి ప్రదీప్(34)గా గుర్తించారు. -
కోటీశ్వరుడవ్వాలని..
బొల్లారం: వ్యసనాలకు బానిసైన ఓ యువకుడు గుర్రపు పందెం ద్వారా కోటీశ్వరుడు కావాలనుకున్నాడు. హైదరాబాద్‌లోని బ్యాచిలర్స్ హాస్టళ్లలో ల్యాప్‌టాప్‌లు చోరీ చేయడంతో పాటు ఇళ్లల్లో చోరీలకు పాల్పడి నగర పోలీసులకు మోస్ట్ వాంటెడ్‌గా మారాడు. సదరు కేటుగాడిని తిరుమలగిరి పోలీసులు అరెస్టు చేసి.. 40 ల్యాప్‌టాప్‌లు, 35 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. బుధవారం బేగంపేట ఏసీపీ గణేష్‌రెడ్డి, తిరుమలగిరి ఇన్స్పెక్టర్ సత్తయ్యతో కలిసి విలేకరులకు తెలిపిన వివరాల ప్రకారం... ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరిజిల్లా నిడదవోలుకు చెందిన కమెపల్లి కృష్ణమోహన్ అలియాస్ కార్తీక్ అలియాస్ క్రిష్ (35) బీటెక్ ద్వితీయ సంవత్సరంలో చదువుకు స్వస్తి చెప్పి హైదరాబాద్‌కు చేరుకున్నాడు. 2002 వరకు సినీ పరిశ్రమలో సహాయ నిర్మాతగా కొనసాగాడు. నిర్మాతగా ఆశించినంత డబ్బు రాకపోవడం.. వ్యసనాలకు బానిస కావడంతో గుర్రపు పందాలు కాసి త్వరగా కోటీశ్వరు కావాలనుకున్నాడు. ఇందుకు అవసరమైన డబ్బు కోసం 2003 నుంచి చోరీల బాట పట్టాడు. నగరంలోని బ్యాచిలర్స్ హాస్టళ్లతో పాటు తాళం వేసి ఉన్న ఇళ్లలోనూ చోరీలు చేస్తున్నాడు. చోరీ సొత్తును కర్ణాటకలోని మైసూర్లో విక్రయించేవాడు. అక్కడే మకాంపెట్టి వచ్చిన డబ్బుతో గుర్రపు పందాలు ఆడుతూ జల్సాలు చేస్తున్నాడు. ఉన్నత కుటుంబం... నిందితుడు కృష్ణమోహన్ది ఉన్నత కుటుంబం. తల్లి విశ్రాంత ఉపాధ్యాయురాలు కాగా.. సోదరులు ఉన్నత చదువులు చ దివి విదేశాల్లో ఉద్యోగాలు చేస్తూ అక్కడే స్థిరపడ్డారు. అయితే, వ్యసనాలకు బానిసైన కృష్ణమోహన్ బీటెక్‌ను మధ్యలోనే ఆపేసి, సులభంగా కోటీశ్వరుడు కావాలనే దురాశతో ఘరానా దొంగగా మారి జైలు పాలుకావడం గమనార్హం. సెంచరీ దాటిన కేసులు... కృష్ణమోన్ జంటనగరాల్లోని వివిధ పోలీసుస్టేషన్ల పరిధిలో 117 చోరీలకు పాల్పడి పోలీసులకు మోస్ట్‌వాంటెడ్‌గా మారాడు. ఇతడిపై 15 నాన్‌బెయిలబుల్ కేసులు ఉన్నాయి. ఎస్ఆర్నగర్ ఠాణా పరిధిలో మొదటసారి చోరీ చేశాడు. మూడు చోరీలు చేసి పోలీసులకు చిక్కాడు. తర్వాత 2009లో మాదాపూర్‌లో 52 చోరీలు చేసిన కృష్ణమోహన్ 2012లో ఎస్సార్‌నగర్‌లో 22, మారేడ్‌పల్లిలో 2, మల్కాజిగిరిలో 6, ఇవే కాకుండా పంజగుట్టతో పాటు జంటనగరాలలో వివిధ ఠాణా పరిధి మొత్తం 117 దొంగతనాలకు పాల్పడ్డాడు. పోలీసుల కళ్లుగప్పి తప్పించుకొని తిరుగుతున్న ఇతడిని బుధవారం తిరుమలగిరి పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిను గుర్రపు పందాలు ఆడి త్వరగా కోటీశ్వరుడు కావాలనే ఉద్దేశంతో చోరీలు చేస్తున్నట్టు నిందితుడు పోలీసుల విచారణలో వెల్లడించారు. నిందితుడి నుంచి పోలీసులు 40 ల్యాప్‌టాప్‌లు, 35 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతడిని రిమాండ్‌కు తరలించారు.