విరాట్‌కు వీడ్కోలు
న్యూఢిల్లీ: రాష్ట్రపతి అంగరక్షక దళంలో సేవలందించిన నల్ల గుర్రం విరాట్ రిపబ్లిక్ డే రోజున రిటైర్మెంట్ తీసుకుంది. ఈ సందర్భంగా రాష్ట్రపతి, ప్రధాని, రక్షణ మంత్రి విరాట్‌కు ఘనంగా వీడ్కోలు జరిపారు. ఇది ఇప్పటికి 13 సార్లు గణతంత్ర దినోత్సవ పరేడ్లలో పాల్గొంది.
వయసు మీద పడటంతో ఇప్పుడు దీని సేవలకు ముగింపు పలికారు. జనవరి 15న ఆర్మీ డే సందర్భంగా విరాట్‌కు చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ కమెండేషన్ లభించింది. ఈ సత్కారం అందుకున్న తొలి అశ్వం ఇదే! 2003లో హనోవేరియన్ జాతికి చెందిన ఈ గుర్రం అంగరక్షక దళంలో చేరింది. వయసు మీద పడినా, 2021లో గణతంత్ర దినోత్సవ వేడుక, బీటింగ్ ది రిట్రీట్ వేడుకలో విరాట్ అద్భుతంగా రాణించినట్లు సంబంధిత అధికారులు చెప్పారు.