Horticulture crop
-
ఉద్యాన పంటలకు ఊతం
♦ ములుగులో 12 ఎకరాల్లో విశ్వవిద్యాలయాన్ని నిర్మిస్తాం ♦ పరిశోధనలకు అనుగుణంగా భవనాలు, ల్యాబులు ♦ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం వెల్లడి ములుగు: రాష్ట్రంలో ఉద్యాన పంటలకు ఊతంగా నిలిచేలా ములుగు ఉద్యాన విశ్వవిద్యాలయాన్ని నిర్మిస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ములుగులో ఉద్యాన విశ్వవిద్యాలయం కోసం కేటాయించిన స్థలాన్ని మంత్రి శనివారం రాష్ట్ర వాస్తు సలహాదారు సుద్దాల సుధాకర్ తేజతో కలిసి పరిశీలించారు. వాస్తుపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను మంత్రి తెలుసుకున్నారు. ఈ మాట్లాడుతూ ఐసీఏఆర్(ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్) మార్గదర్శకాల ప్రకారం ఇక్కడ 12 ఎకరాల్లో భవన నిర్మాణాలు, పరిశోధనల కోసం తరగతి గదులు, ల్యాబ్‌లు, నిర్మిస్తామన్నారు. . ఈ వర్సిటీకి కేంద్ర ప్రభుత్వం రూ.200 కోట్లు ఇచ్చేందుకు అంగీకరించిందన్నారు. ఇందులో ఇప్పటికే రూ.85 కోట్లు మంజూరు చేసిందని, ఈ ఏడాదికి మరో రూ.50 కోట్లు ఇవ్వడానికి సంసిద్ధత వ్యక్తం చేసిందన్నారు. సాధ్యమైనంత వేగంగా ఇక్కడ ఉద్యాన వర్సిటీని నెలకొల్పుతామన్నారు. రాష్ట్రంలో ఉద్యాన తోటలకు ఎంతో ప్రాధ్యాన్యత ఉందని తెలిపారు. 18 లక్షల ఎకరాల్లో పండ్లతోటలు, 14 లక్షల ఎకరాల్లో కూరగాయలు, పూల తోటలు సాగవుతున్నాయన్నారు. ఈ విస్తీర్ణాన్ని మరింతగా పెంచేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. కార్యక్రమంలో ఉధ్యాన శాఖ కమిషనర్ వెంకట్రాంరెడ్డి, రిజిస్ట్రార్ ప్రతాప్, ప్రొఫెసర్ ప్రవీణ్‌రావు, డిప్యూటీ డెరైక్టర్ రామలక్ష్మి, సిద్దిపేట ఏడీహెచ్ సురేం దర్, హార్టికల్చర్ అధికారి చక్రపాణి, వంటిమామిడి మార్కెట్ కమిటీ చైర్మన్ మహ్మద్ జహంగీర్ పాల్గొన్నారు. -
మిగిలేది మొండిచేయే
సాక్షి, విశాఖపట్నం: హుద్‌హుద్ తుఫాన్ దెబ్బకు జిల్లాలో 34,180.22 హెక్టార్లలో పంటలు నాశనమయ్యాయి. 9589 హెక్టార్లలో వరి, 20,137 హెక్టార్లలో చెర కు, 468 హెక్టార్లలో పత్తి, 209 హె క్టార్లలో కందులు, 121 హెక్టార్లలో మొక్కజొన్న, 3209 హెక్టార్లలో రాజ్మా, 11 హెక్టార్లలో మినుము, 66 హెక్టార్లలో వేరుశనగ, 321 హెక్టార్లలో రాగులు, 48 హెక్టార్లలో పొగాకు దెబ్బతిన్నట్టుగా అధికారులు నిర్ధారించారు.1, 55,915 మంది రైతులు నష్టపోయినట్టు లెక్కలు తేల్చారు. వీరికి రూ.49.18కోట్ల మేర ఇన్‌పుట్‌సబ్సిడీ చెల్లించాలని ప్రభుత్వానికి సిఫారసు చేశారు. హార్టికల్చర్ పంటలకుసంబంధించి 55,334.608 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. మొత్తంగా లక్షా 62 వేల మంది రైతులు నష్టపోయినట్టు నిర్ధారించారు. జిల్లాలోని రెండులక్షల మంది రైతుల్లో సొంతంగా సాగుచేసేది 50 నుంచి 70వేల మందే. మిగిలిన వారంతా కౌలురైతులే. భూయజమానికి..వీరికి మధ్య అవగాహన ఒప్పందం (నోటి మాటతోనే) కౌలుసాగుతుంటుంది. గత ప్రభుత్వం కౌలు అర్హత కార్డులు జారీకి శ్రీకారం చుట్టింది. సరైన అవగాహన, చైతన్యం కొరవడడం.. లిఖిత పూర్వకంగా ఎలాంటి కౌలు ఒప్పందాలు లేకపోవడం, అసలు రైతులు ఇబ్బందులు వెరశి కౌలు అర్హత కార్డులు పొందిన వారు జిల్లాలో చాలా తక్కువనే చెప్పాలి. 2012-13లో కార్డులు పొందిన వారు 50వేల మంది వరకు ఉంటే 2013-14లో ఈ సంఖ్య 35వేలకు మించలేదు. ఇక ఈఏడాది ఇప్పటి వరకు రెన్యువల్ చేయించుకున్న వారు కేవలం 10,783మంది మాత్రమే. వీరిలో బ్యాం కుల ద్వారా రుణాలు పొందిన వారు.. పంటలకు బీమా చేయించుకున్న వారి సంఖ్య రెండుమూడువేలకు మించరని అధికారులే పేర్కొంటున్నారు. ఈ లెక్కన హుద్‌హుద్ దెబ్బకు పంటలుకోల్పోయిన కౌలు రైతుల్లో నూటికి 90 శాతం పరిహారానికి నోచుకోలేని దుస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ప్రస్తుతం జరిగిన పంటనష్టం అంచనాల సర్వేలో భూయజమానుల పేర్లనే జాబితాలో చేర్చారుతప్ప ఏ ఒక్క గ్రామంలోనూ చెప్పుకోతగ్గ స్థాయిలో కౌలురైతులకు చోటు దక్కలేదు. రుణాల మంజూరుకు బ్యాంకులు ముఖం చాటేయడంతో బంగారు నగలను కుదువపెట్టడం అవి సరిపోకపోతే ఐదు రూపాయల వడ్డీకి అప్పు చేసి మరీ సాగు చేసిన కౌలు రైతుల పరిస్థితి ఇప్పుడు దయనీయంగా తయారైంది. బీమా కాదుకదా కనీసం ఇన్పుట్ సబ్సిడీ దక్కే అవకాశం లేకుండా పోయింది. దీంతో ఒక పక్క చేతి కంది వచ్చిన పంట తుఫాన్ పాలవ్వగా, మరోవంక ప్రభుత్వ సాయం అందక వీరు మరింత అప్పుఊబిలో కూరుకుపోయే పరిస్థితి ఏర్పడింది. గ్రామంలో విచారిస్తే ఏ భూమిలో ఎవరుసాగు చేస్తారో చెబుతారు.. లేదా వీఆర్వోలు.. ఏవోలను అడిగినా చెబుతారు.. వాటిని ప్రామాణికంగానైనాతీ సుకుని తమకు పరిహారం జాబితాలో చోటు కల్పించాలి. భూమియజమానులుకూడా ఉదారంగా స్పందించి కనీసం పరిహారంలో కొంత భాగమైనా ఇవ్వాలి. అప్పుల ఊబిలో ఉన్న తమను ఆదుకోకపోతే ఆత్మహత్యలే శరణ్యమని వారు పేర్కొంటున్నారు. ఏదీ వర్తంచదంటున్నారు. నాది నక్కపల్లి మండలం ఒడ్డిమెట్ట. పదెకరాల పొలం కౌలుకు తీసుకున్నా. ఈ ఏడాది వరిపంట వేశా. తుఫాన్‌కు పూర్తిగా దెబ్బతినిపోయింది. బాధిత రైతుల జాబితాలో నాకు చోటు దక్కలేదు. ప్రభుత్వం నుంచి పరిహారం, పంటల బీమా కూడా రావంటున్నారు. బ్యాంకులు రుణాలివ్వడం లేదు. బీమా చేయించుకునే అవకాశం లేకుండా పోతోంది. కనీసం దెబ్బతిన్న పంటకు నష్టపరిహారం చెల్లించక పోతేమా గతేంటి..యజమాని కనికరించకపోతే అప్పులు పాలవ్వాల్సిందే. -పైల నూకన్ననాయుడు, కౌలు రైతు -
మునిగిన పంటల్ని కాపాడుకోండిలా
గోదావరి వరద లంక భూముల్లోని పంటలతోపాటు నదీ పరివాహక ప్రాంతాల్లోని వివిధ పంటలను ముంచెత్తింది. ముంపు తగ్గటంతో తోటల్లో ఒండ్రు మట్టి, ఇసుక మేటలు వేశారుు. మరోవైపు పంటలు దెబ్బతిన్నారుు. ఈ పరిస్థితుల్లో పంటల్ని ఎలా కాపాడుకోవాలనే విషయూలను కొవ్వూరులోని వైఎస్సార్ ఉద్యాన పరిశోధనా స్థానం ప్రిన్సిపల్ సైంటిస్ట్ బీవీకే భగవాన్ ఇలా వివరించారు. కొవ్వూరు : ముంపు బారిన పడిన ఉద్యాన పంటలను కాపాడుకునేందుకు రైతులు వెంటనే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కంద తోటలో 24 గంటల కంటే ఎక్కువ సమయం నీరు నిల్వ ఉంటే దుంప కుళ్లే ప్రమాదం ఉంటుంది. ఈ దృష్ట్యా భూమిలోని కందను వెంటనే తవ్వి తీసుకోవడం మంచిది. మొక్కలపై బురద పేరుకుపోరుు ఉంటే మంచినీటిని స్ప్రే చేయాలి. అరటి తోటల్లో ఈ జాగ్రత్తలు తీసుకోండి 24గంటలపాటు నీటి ముంపులో ఉండిపోరుున అరటి తోటల్లో 19-19-19 కాంప్లెక్స్ ఎరువును లీటరు నీటికి ఐదు గ్రాముల చొప్పున కలిపి అరటి మొక్క అంతా తడిచేలా పిచికారీ చేయాలి. ఈ ద్రావణంలో 0.5 మిల్లీ గ్రాముల జిగురు మందును కలపాలి. 24 గంటల కంటే ఎక్కువ సమయం నీరు నిల్వ ఉన్న అరటి తోటలకు బోర్డో మిశ్రమాన్ని ఒక శాతం గాని, కాపర్ ఆక్సీక్లోరైడ్‌ను మూడు గ్రాముల చొప్పున గాని లీటరు నీటిలో కలిపి మొక్క మొదళ్లలో వేర్లలోకి ఇంకిపోయేలా పోయూలి. ఆ తరువాత 19-19-19 ఎరువును పైన చెప్పిన విధంగా నీటిలో కలిపి ఆకులు తడిచేలా పిచికారీ చేసుకోవాలి. పైన పేర్కొన్న విధంగా మందును పిచికారీ చేసిన వారం పది రోజుల వ్యవధిలో 13-0-45 (పొటాషియం నైట్రేట్) మందును లీటరు నీటికి ఐదు గ్రాముల చొప్పున జిగురు మందుతో కలిపి మొక్క అంతా తడిచేలా పిచి కారీ చేసుకోవాలి. ఇలా వారం పదిరోజుల వ్యవధిలో మూడునుంచి నాలుగుసార్లు పిచికారీ చేయూలి. మూడు నెలలకన్నా తక్కువ వయసున్న అరటి మొక్కలు మూడు అడుగుల పైబడి నీటిలో మునిగి ఉంటే.. నేల ఆరిన తరువాత తిరిగి మొక్కల్ని నాటుకోవడం మంచిది. సగం తయారైన (75 శాతం పక్వానికి వచ్చిన) గెలలను ఎండిన ఆకులతో కప్పి 15 రోజుల్లోపు కోసి మార్కెట్‌కు తరలించడం మంచిది. కూర, కంద, పూల తోటల్లో... తక్కువ సమయం నీటిలో మునిగిన కూరగాయ, కంద, పూల తోటల్లో మొదటి విడతగా 19-19-19 మందును లీటరు నీటికి 3 గ్రాముల చొప్పున కలుపుకుని పిచికారీ చేయాలి. వారం వ్యవధిలో 13-0-45 మందును లీటరు నీటికి 3 గ్రాముల చొప్పున కలిపి పిచికారీ చేయాలి. పడిపోయిన మొక్కలను నిలబెట్టి మొదలు దగ్గర మట్టిని ఎగదోయాలి. కొత్తగా విత్తిన కూరగాయ తోటలైతే.. వాటిని పూర్తిగా తొలగించి మరలా నాటుకోవడం మంచిది.