hot air balloons
-
అత్యద్భుతమైన ప్రపంచ రికార్డు...చూస్తే వెన్నులో వణుకుపుడుతుంది!
సాహసోపేతమైన ప్రపంచ రికార్డులు చూస్తే.. అవి నిపుణుల పర్యవేక్షణలో సాధన చేస్తే సాధ్యమనిపిస్తుంది. మరికొన్ని ఫీట్లు సాధ్యమేనా ? అనే సందేహన్ని కలిగిస్తాయి. చాలా వరకూ ఆయా వ్యక్తుల అభిరుచి, ఒక విభిన్నమైన వ్యక్తిగా నిలవాలనే తపన వంటి లక్ష్యాలతోనే ఇలాంటి ప్రపంచ రికార్డులను నెలకొల్పగలరేమో !. అచ్చం అలానే ఇక్కడొక వ్యక్తి సాధించిన ప్రపంచ రికార్డును చూస్తే చేయగలమా? అని సందేహం కచ్చితంగా వస్తుంది. ప్రయత్నించాలన్నా భయంగానే ఉంటుంది. ఎందుకంటే అది అత్యంత భయంకరమైన సాహసోపేతమైన ప్రపంచ రికార్డు. వివరాల్లోకెళ్తే...బ్రెజిల్‌కి చెందిన రాఫెల్ జుగ్నో బ్రిడి అనే వ్యక్తి రెండు పారాచూట్ల మధ్య కట్టిన తాడుపై నడిచాడు. తాడు వెడల్పు కేవలం 25 సెం.మీ. అంతేకాదు అతను సుమారు ఒక వెయ్యి మీటర్లు(6,236 అడుగుల) ఎత్తులో తాడు పై నడిచాడు. అంటే బుర్జ్ ఖలీప్ కంటే రెంట్టింపు ఎత్తులో గాల్లో రెండూ పారాచూట్ల మధ్య కట్టిన తాడుపై నడిచాడు. ఈ ఘటన బ్రెజిల్‌లోని శాంటా కాటరినాలోని ప్రియా గ్రాండేలో చోటుచేసుకుంది. నిజానికి ఆఫీట్ చూస్తే భయాందోళనతో పాటు ఆశ్చర్యమూ కలుగుతుంది. ఈ మేరకు ఈ రికార్డుకు సంబంధించిన ఫీట్‌ని గిన్నిస్‌బుక్ ఆఫ్ రికార్డు ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో ఆన్లైన్లో తెగ వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు ఈ ఫీట్ చూస్తే కాళ్లల్లో వణుకు కుపుడుతోందని ఒకరు, ఇది ప్రపంచం గుర్తించదగ్గ రికార్డు అంటూ బ్రిడిని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. (చదవండి: ఓరిని తెలివి.. పరీక్షల్లో ఇలా కూడా కాపీ కొడతారా.. అయినా దొరికిపాయే!) -
గాల్లో తాడుపై నడిచాడు.. ఇది మామూలు రికార్డు కాదు!
ఇది మామూలు రికార్డా.. ఇప్పటివరకూ ఎవరూ సాహసించనిది.. చూస్తున్నారుగా.. మైలు కన్నా ఎక్కువ ఎత్తులో.. రెండు హాట్ఎయిర్ బెలూన్ల మధ్య ఎలాంటి ఆధారం లేకుండా.. తాడుపై నడవడమంటే మాటలా మరి.. బ్రెజిల్‌కు చెందిన 34 ఏళ్ల రాఫెల్ జుగ్నోబ్రిడి ఈ అరుదైన ఫీట్‌ను సాధించాడు. (చదవండి: చరిత్ర సృష్టించిన పాలకొల్లు అమ్మాయి) బ్రెజిల్లో 6,131 అడుగుల ఎత్తులో అంగుళం వెడల్పున్న తాడుపై నడిచి.. సరికొత్త ప్రపంచ రికార్డును సాధించాడు. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన భవనం అయిన బుర్జ్ ఖలీఫా కంటే రెట్టింపు ఎత్తులో చెప్పులు లేకుండా నడిచి టైట్రోప్ వాక్‌లో వరల్డ్ రికార్డు సృష్టించాడు. చాలెంజ్లంటే తనకెంతో ఇష్టమని.. చిన్న తప్పు జరిగినా.. ఇక అంతే అని తెలిసినప్పటికీ.. ఏకాగ్రతతో దీన్ని సాధించానని రాఫెల్ చెప్పాడు. (చదవండి: 15 సెకన్లలో ఏమైతది.. బస్సు రైలైతది.. అదెలా?) -
బెలూన్లు ఎగరేసి.. అరెస్టయ్యారు
బెలూన్లు ఎగరేయడం నేరమని ఎవరైనా అనుకుంటారా? కానీ.. ముంబై పోలీసులు అలాగే అనుకున్నారు. విమానాశ్రయ పరిధిలో అనుమానాస్పద వస్తువులను ఎగరేసినందుకు ముంబై పోలీసులు ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. వజ్రాల ఎగుమతి కంపెనీ ఒకటి ఎయిరిండియా గ్రౌండులో ఓ క్రికెట్ టోర్నమెంటు నిర్వహించింది. అయితే ఆ కార్యక్రమ నిర్వాహకులు ముందుగా పోలీసు అనుమతి ఏమీ తీసుకోకుండా.. హాట్ ఎయిర్ బెలూన్లను ఎయిర్‌పోర్టు పరిసరాల్లో ఎగరేశారు. వాటిమీద తమ ప్రకటనను ముద్రించుకున్నారు. దీంతో ఎయిర్‌పోర్టు పోలీసు స్టేషన్లో ఆ నిర్వాహకుల మీద కేసు నమోదైంది. ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. వారిని స్థానిక కోర్టులో హాజరుపరిచారు. జెట్ ఎయిర్వేస్, ఇండిగో పైలట్లు ఈ బెలూన్లను గమనించారు. ఎయిర్‌పోర్టు ఉద్యోగి ఒకరు వీటిని ఫొటో కూడా తీశారు. ఈ బెలూన్ల కారణంగా కొద్దిసేపు ఎయిర్ ట్రాఫిక్‌కు అంతరాయం కూడా కలిగింది.