hot iron rod
-
అమానుషం.. వైద్యం పేరుతో 9 నెలల చిన్నారికి వాతలు.. అల్లాడిన పసి ప్రాణం
కొరాపుట్: మూఢ నమ్మకం ముక్కు పచ్చలారని పసికందు ప్రాణం తీసింది. నవరంగ్‌పూర్ జిల్లా రాయిఘర్ సమితి జోడాబర–2 గ్రామంలో ఈ ఘటన శనివారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన సుఖదేవ్ గొండో కుమారుడు రూపేష్ గొండో(9 నెలలు) తీవ్రమైన జ్వరం, జలుబు, దగ్గుతో బాధ పడుతున్నాడు. దీంతో కుటుంబీకులు మంత్రగాడుని సంప్రదించగా, శిశువు పొట్ట, గుండెపై కొడవలితో వాతలు పెట్టించారు. నొప్పి తట్టుకోలేక ఆ పసి ప్రాణం అల్లాడిపోయింది. విషయం తెలుసుకున్న ఆశా కార్యకర్త సుభావతి గొండో అంబులైన్స్‌కు సమాచారం అందిదంచి, రూపేష్‌ను బొడబరండి ప్రభుత్వ ఆస్పత్రిలో చేరి్పంచారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు చికిత్స అందించగా, ఆస్పత్రిలో ఎవరికీ తెలియకుండా కుటుంబీకులు శిశువుని తిరిగి ఇంటికి తెచ్చారు. మరోసారి మంత్రగాడితో పూజలు చేయించగా, రూపేస్ మృతిచెందాడు. ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా సంచలనంగా మారింది. చదవండి: సీఎం పదవి ఖాళీగా లేదు! ఒకరిద్దరూ గొంతు చించుకుంటే సీఎం కాలేరు! -
ఇంట్లోకి వచ్చాడని బాలుడికి వాతలు
కోయంబత్తూర్: సాధారణంగా చిన్న పిల్లల్లు ఇంట్లో వచ్చి ఆడుకుంటుంటే సంబరంగా ఉంటుంది. వారిని దగ్గరికి తీసుకొని ముద్దు చేయాలని పిస్తుంది. అవసరం అయితే, ప్రేమగా కొంచెం ఏదైనా తినిపించాలని ఉంటుంది. కాని, తమిళనాడులోని ఓ ఇంటి యజమానురాలు మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించింది. వేళకాని వేళలో తన ఇంట్లోకి వచ్చి నాలుగేళ్ల బాలుడు ఆడుకుంటున్నాడని సహించ లేక ఇనుప చువ్వను ఎర్రగా కాల్చి వాతలు పెట్టింది. గుడ్లెర్ర జేసి బాలుడి దవడకు, చిట్టి అరిపాదాలకు అంటించింది. దీంతో ఆ బాలుడు తీవ్ర గాయాలపాలయ్యాడు. ఈ విషయం బాలల హక్కుల విభాగా అధికారులకు తెలిసి సీరియస్ అయ్యారు. విచారణ ప్రారంభించారు. దర్యాప్తు అనంతర అంశాల ప్రకారం ఆ యజమానురాలిపై చర్యలు తీసుకోనున్నారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం కోయంబత్తూర్‌లోని పులియాకులం అనే ఊర్లో ఓ నాలుగేళ్ల బాలుడు ఓ అద్దె ఇంట్లో తన తాతయ్యనాయనమ్మతో కలిసి ఉంటున్నాడు. ఆ బాలుడు తండ్రి తాగుడుకు బానిసగా మారాడన్న కారణంతో భార్య విడిచిపెట్టి వెళ్లింది. దీంతో తల్లి లేని ఆ బాలుడు తాతయ్యనాయనమ్మతో ఉంటూ ఓ రోజు ఆడుకుంటూ ఇంటి యజమానురాలి ఇంట్లోకి వెళ్లాడు. దీంతో ఆమె వేళకాని వేళ వచ్చి ఇంట్లో ఆడుకుంటున్నాడనే ఆక్రోశంతో చిన్నపిల్లాడని కూడా చూడకుండా వాతలు పెట్టింది. దీంతో బాలుడు తీవ్రంగా గాయపడి నడవలేకుండా పోయాడు. తండ్రి ఫిర్యాదు మేరకు బాలల హక్కుల అధికారులు ఆ బాలుడిని పరామర్శించి విచారణకు ఆదేశించారు.