వరుసపెట్టి ఎనిమిదిళ్లలో చోరీలు
బాల్కొండ: నిజామాబాద్ జిల్లా బాల్కొండలో దొంగల రెచ్చిపోయారు. వరుసపెట్టి ఎనిమిది ఇళ్లల్లో చోరీలు చేసి బీభత్సం సృష్టించారు. చోరీలను అడ్డుకున్న వారిపై విచక్షణారహితంగా దాడి చేశారు. దొంగల దాడిలో ఐదుగురు గాయపడ్డారు. వీరిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
ఇప్పటివరకు తాళం వేసి ఉన్న ఇళ్లలోనే దొంగతనాలకు పాల్పడిన చోరులు ఇప్పుడు జనావాసాలనే లక్ష్యంగా చేసుకోవడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. చోరీలను అడ్డుకున్నవారిపసై దాడులు చేయడంపై స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. దొంగల బారి నుంచి తమను కాపాడాలని పోలీసులను కోరుతున్నారు.