house land
-
ఇంటికో ఇంకుడు గుంత
సాక్షి, అమరావతి: వైఎస్సార్–జగనన్న కాలనీల్లో నిర్మించిన ఇళ్ల వద్ద ఇంకుడు గుంతలను ఏర్పాటు చేయబోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 17 వేలకు పైగా లేఅవుట్లలో 30.25 లక్షల మందికి ఇళ్ల స్థలాలను పంపిణీ చేయగా.. రెండు దశల్లో 18.63 లక్షల ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు ఇచ్చారు. వీటిలో 17.66 లక్షల ఇళ్లు వివిధ దశల్లో నిర్మాణాల్లో ఉన్నాయి. ఆయా కాలనీల్లో రూ.32 వేల కోట్లకు పైగా నిధులతో శాశ్వత మౌలిక సదుపాయాలు కల్పించనున్నారు. నిర్మాణం పూర్తి చేసుకున్న ఇళ్లకు ఇప్పటికే కరెంట్, నీటి సరఫరా కనెక్షన్లు చకచకా ఇస్తున్నారు. ఇదిలావుండగా శాశ్వత మౌలిక సదుపాయాలైన డ్రెయిన్లు, రోడ్లు, సైడ్ కాలువలు నిర్మించాలంటే కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలన్నీ పూర్తయి ఉండాలి. అలాకాకుండా సదుపాయాలు కల్పిస్తే ఇళ్ల నిర్మాణ సమయంలో భారీ వాహనాల రాకపోకలు, ఇతర సందర్భాల్లో డ్రెయిన్లు, కాలువలు ధ్వంసమవుతాయి. ఈ క్రమంలో ఇప్పటికే నిర్మాణం పూర్తయిన ఇళ్ల వద్ద తాత్కాలిక డ్రెయినేజీ అవసరాల కోసం ఇంకుడు గుంతలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో గుంతకు రూ.6 వేలు ఒక్కో ఇంకుడు గుంత నిర్మించడానికి దాదాపు రూ.6 వేల వరకు ప్రభుత్వం ఖర్చు చేయనుంది. ఈ మొత్తాన్ని సంబంధిత ఇంటి లబ్ధిదారుడి ఖాతాలో జమ చేయనున్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 3.40 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తయింది. కాగా, తొలి దశలో 7,278 కాలనీల్లో 1,11,770 ఇళ్లకు ఇంకుడు గుంతలు నిర్మించాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఎంపీడీవోలు/మునిసిపల్ కమిషనర్ల నేతృత్వంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్లు/వార్డు ఎమినిటీ సెక్రటరీలకు ఇంకుడు గుంతల నిర్మాణం పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించారు. వీరికి గ్రామీణ మంచినీటి సరఫరా (ఆర్డబ్ల్యూఎస్) విభాగంతో ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చారు. పలు ప్రాంతాల్లో ఇంకుడు గుంతల నిర్మాణం ప్రారంభించారు. భూగర్భ జలం పెరుగుతుంది ప్రస్తుతం నిర్మిస్తున్న ఇంకుడు గుంతలను తాత్కాలిక డ్రెయినేజీ అవసరాల కోసం వినియోగిస్తాం. పూర్తి స్థాయిలో డ్రెయిన్లు, కాలువలు నిర్మించిన అనంతరం ఇంట్లో వృథాగా పోయే నీటితోపాటు వర్షపు నీటిని కూడా ఈ గుంతల్లోకి చేర్చవచ్చు. తద్వారా భూగర్భ జలం పెరుగుతుంది. కాలనీల్లో పెద్దఎత్తున ఇంకుడు గుంతల నిర్మాణం చేపడితే భవిష్యత్‌లో భూగర్భ జలాల అభివృద్ధికి దోహదపడుతుంది. – అజయ్‌జైన్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, గృహ నిర్మాణ శాఖ -
టీడీపీ హయాంలో సెంటు ఇంటి స్థలం కూడా పంపిణీ చేయలేదు..
సాక్షి, గుంటూరు: టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు పేదలకు సెంటు ఇంటి స్థలం కూడా పంపిణీ చేయలేదని రాష్ట్ర రెవెన్యూ, స్టాంప్స్, రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు విమర్శించారు. గుంటూరు కలెక్టరేట్లో మంగళవారం ఆయన డీఆర్సీ సమావేశంలో పాల్గొన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏకంగా రూ.7వేల కోట్లకు పైగా ఖర్చు చేసి, 30 లక్షల మందికి పైగా ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారని గుర్తుచేశారు. ఎలాంటి వివక్ష, పక్షపాతానికి తావులేకుండా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. ప్రతిపక్ష పార్టీలు ఒక్క అవినీతి ఆరోపణ కూడా చేయలేని విధంగా పాలన సాగుతోందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల వల్ల నష్టపోయిన మిర్చి రైతులకు పరిహారం అందించడంలో సమస్య ఏర్పడిందని, రైతులను ఆదుకోవడంలో దేశంలోనే ఏపీ ముందు వరుసలో ఉంటుందని మంత్రి ధర్మాన తెలిపారు. -
2 సెంట్ల భూమి కోసం.. 20 ఏళ్లుగా పోరాటం..!
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఇంటి స్థలం హద్దుల గుర్తింపు, ఆక్రమణల తొలగింపులో అధికారుల నిర్లక్ష్యం పరాకాష్టకు చేరింది. రాజకీయ నాయకుల ఒత్తిళ్లతో హద్దుల సర్వే ఏళ్ల తరబడి ముందుకు సాగలేదు. అయినా బాధితురాలు పట్టు వదలకుండా న్యాయం కోసం ఇరవై ఏళ్లుగా పోరాటం సాగిస్తూనే ఉంది. 16వ దఫా సర్వే పూర్తి చేయించి, మార్కింగ్ ఇచ్చినా ఆక్రమణదారులు కట్టడం తొలగించలేదు. పైగా తమను ఎవ్వరూ ఏమీ చేయలేరంటూ బాధితురాలిపై బెదిరింపులకు దిగారు. న్యాయం చేయాల్సిన అధికారులు సైతం ఆక్రమణదారులకు వంత పాడుతుండడంతో బాధితురాలికి దిక్కుతోచలేదు. చదవండి: పెళ్లైన మూడు నెలలకే.. నవ వధువు ఆత్మహత్య దిక్కున చోటు చెప్పుకో... ఉరవకొండ మండలం చిన్నముస్టూరులో ఎస్సీ సామాజికవర్గానికి చెందిన మారెక్క పేరిట రెండు సెంట్ల స్థలం ఉంది. అందులో కొంత స్థలం వదిలి ఇల్లు నిర్మించుకున్నారు. 20 ఏళ్ల క్రితం మారెక్క చనిపోవడంతో ఆమె కూతురు నాగమ్మ అందులో నివాసముంటున్నారు. వీరి ఖాళీ స్థలాన్ని ఇంటి పక్కనే ఉన్న టీడీపీ ప్రజాప్రతినిధి అనుచరులు పులీంద్ర, నరసప్ప ఆక్రమించి మరుగుదొడ్డి, ఇతర నిర్మాణాలు చేపట్టారు. ఇదేమని ప్రశ్నించిన నాగమ్మను దుర్భాషలాడుతూ దిక్కున్నచోట చెప్పుకో అంటూ బెదిరించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ తనకు న్యాయం చేయాలంటూ అధికారుల చుట్టూ నాగమ్మ తిరుగుతున్నారు. ప్రస్తుతం నాగమ్మ వయసు ఎనభై ఏళ్లు. గతంలో స్పందన కార్యక్రమంలో కలెక్టర్, ఎస్పీని కూతురు సహకారంతో నాగమ్మ నేరుగా కలసి గోడు వెల్లబోసుకున్నారు. తమ స్థలానికి హద్దులు చూపించి, ఆక్రమణదారుల నుంచి రక్షణ కల్పించాలని కోరారు. సర్వేకు తరచూ అడ్డంకులే... నాగమ్మ ఫిర్యాదుపై స్పందించిన ఉన్నతాధికారులు ఆ స్థలం కొలతలు తీసి, హద్దులు నిర్ధారించాలంటూ రెవెన్యూ, సర్వే, పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అధికారులు కొలతలు తీయడానికి వెళితే ఆక్రమణదారులు సహకరించలేదు. 15 పర్యాయాలు సర్వే చేయకుండా అడ్డుకున్నారు. చివరకు ఈ ఏడాది జూలై 16న తహసీల్దార్ మునివేలు, సీఐ శేఖర్, ఎస్ఐ రమేష్‌రెడ్డి, సర్వేయర్ మస్తానయ్య కొలతలు తీసి, ఆక్రమణలు గుర్తించి, వెంటనే తొలగించి, బాధితురాలికి స్థలాన్ని స్వాధీనం చేయాలని ఆదేశించి వెళ్లారు. అధికారులు వేసిన మార్కింగ్‌ను మరుసటి రోజు ఉదయాన్నే పులీంద్ర, నరసప్ప చెరిపి వేశారు. ఇదే విషయాన్ని తహసీల్దార్ దృష్టికి నాగమ్మ కుమార్తె తీసుకెళ్లారు. తమపై చాలా ఒత్తిళ్లు ఉన్నాయని, ఆ స్థలాన్ని వారికే వదిలేయాలంటూ ఆయన ఉచిత సలహా ఇచ్చి చేతులు దులుపుకున్నారు. దీనిపై తల్లి, కుమార్తె మరోసారి ఈ నెల 23న కలెక్టరేట్‌కు చేరుకుని తమకు న్యాయం చేయాలంటూ స్పందన కార్యక్రమంలో అర్జీ అందజేశారు. చదవండి: సిలికా శాండ్ ఆధారిత పరిశ్రమలను ప్రోత్సహించండి -
రోడ్డెక్కిన బంజారాలు
నివేశన స్థలాల కోసం ఆందోళన నిలిచిన రామగుండం ఫై ్లఓవర్ పనులు రామగుండం: రామగుండం పట్టణంలోని రైల్వేఫై ్లఓవర్ వంతెన నిర్మాణానికి ఆది నుంచి అడ్డంకులు ఎదురవుతూనే ఉన్నాయి. దీంతో పనులు ఏళ్ల తరబడి కొనసా....గుతున్నాయి. నిర్వాసితులకు సకాలంలో అధికారులు పరిహారం చెల్లించకపోవడంతో బాధితులు ఉద్యమబాట పట్టారు. దీంతో మళ్లీ పనులకు బ్రేక్ పడింది. వంతెన నిర్మాణంలో 63 గహాలు పూర్తిగా కోల్పోతున్న బంజారాలు రోడ్కెక్కారు. ప్రస్తుతం నివాసముంటున్న కాలనీకి ఫర్లాంగు దూరంలోనే సర్వే నంబర్ 376లో లేఅవుట్ చేసుకోవచ్చని పక్షం రోజుల క్రితం తహసీల్దార్ ఆదేశించడంతో పనులు మొదలుపెట్టారు. ఈ క్రమంలో అదే స్థలంలో తమకు ఇరవై ఏళ్ల క్రితం పట్టాలు జారీ చేశారంటూ ఇప్పటికే ఇరవై మంది పనులకు అడ్డుతగులుతున్నారు. దీంతో అధికారుల వైఖరిపై బంజారాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మా జీవితాలతో ఆడుకుంటున్నరు – బానోతు లలిత, బాధితురాలు. మూడేళ్ల నుంచి తమ బతుకులకు భరోసా లేకుండా పోతుంది. మా ఇంట్లోలందరం కట్టెలు కొట్టుకుని, కూలీ పనులకు వెళ్లి కుటుంబాన్ని పోషించుకుంటున్నాం. సార్లు మా ఇంటికి లక్ష రూపాయలు ఇచ్చిండ్లు. అవి కూడా ఒక్కసారి కాదు. గిప్పుడు జాగలల్ల ఇండ్లు ఆ పైసలతోటి అయితయా. మా బతుకులతో ఆడుకుంటున్నరు. ఈ జాగను వదులుకోం.... – బాతోడు రాజమ్మ మీరు ఇండ్లు కట్టుకోండ్లి... ఎవరైన అస్తే నా దగ్గరికి పంపుండ్లీ.. అంటూ ఎమ్మార్వో సారు చెప్పిండు. మరో సారేమో మీ దగ్గరకు ఎవ్వరు రారు మీరే గొడవలు లేకుండా సర్దుబాటు చేసుకొని తొందరగా ఇండ్లు ఖాళీ చేస్తే వంతెన నిర్మిస్తామంటూ మమ్మల్ని నమ్మబలుకుతున్నడు. ఏదేమైనా మా ఇండ్ల నిర్మాణం అయ్యే దాకా ఈ జాగా వదులుకునేది లేదు. నిరక్షరాస్యులమనే నిర్లక్ష్యం – గగులోతు భాగ్య మేము సదువుకోలేదని సార్లు మమ్మల్ని పక్కదారి పట్టిస్తండ్లనిపిస్తుంది. ఇప్పటికే మాకు సూపించిన జాగలో ఇదీ మాదే అంటూ ఎవరెవరో వచ్చి దాని పేపర్లు సూపిత్తండ్లు. మరీ మేము ఈ జాగలో పనులు మొదలుపెట్టినంక మల్లొక్కరు అచ్చి అడ్డుకుంటే మళ్లీ నష్టపోవాల్నా. ఒక్కసారు వారం రోజులు మాదగ్గర ఉంచుండ్లీ ఈ జాగ మాదని ఎవ్వరైనా అస్తే ఆయనే చూసుకుంటడు. స్థలాలు చూపించలేదు... – శ్రీనివాస్‌రావు, తహసీల్దార్ నేనిప్పటి వరకు వాళ్లు చదును చేసే స్థలం (మోఖా) వద్దకు వెళ్లలేదు. కాకపోతే ఈ ప్రాంతంలో ప్రభుత్వ స్థలం ఉంటే కేటాయించేందుకు ప్రయత్నిస్తా. అసలు బాధితులతో తాను ఈ వారంలో చర్చలు జరుపలేదు. బాధితులకు స్థలాలు కేటాయించే ఏర్పాట్లపై ఉన్నతాధికారుల సమక్షంలో సమావేశం నిర్వహించాకా స్థలాలను కేటాయించాల్సి ఉంటుంది. -
ఇళ్ల స్ధలాల కోసం రోడ్డెక్కిన లబ్దిదారులు