housing officers
-
హౌసింగ్ అధికారులకు మెమోలు
అనంతపురం అర్బన్: విధి నిర్వహణలో నిర్లక్ష్యం ప్రదర్శించిన గృహనిర్మాణ సంస్థ ఇంజినీరింగ్ అధికారులకు కలెక్టర్ జి.వీరపాండియన్ మెమోలు జారీ చేశారు. ఇందుకు సంబంధించి వివరాలను జేసీ–2 సయ్యద్ ఖాజా మొహిద్దీన్ శుక్రవారం తెలిపారు. పెనుకొండ, అనంతపురం డివిజన్లకు చెందిన ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు చంద్రమౌళి, ప్రసాద్‌లతో పాటు తొమ్మిది మంది డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు, 30 మంది అసిస్టెంట్ ఇంజనీర్లకు మెమోలు జారీ చేశారని చెప్పారు. శాఖ ద్వారా చేపట్టిన కార్యక్రమాలు అమలులో వీరంతా విధుల్లో నిర్లక్ష్యం వహించినట్లు కలెక్టర్ దృష్టికి రావడంతో, వారి తీరుని తీవ్రంగా పరిగణిస్తూ మెమో ఇచ్చారని జేసీ–2 చెప్పారు. -
హౌసింగ్ అధికారులపై కొరడా
అనంతపురం టౌన్ : జిల్లాలో గృహనిర్మాణ సంస్థ అధికారులపై కలెక్టర్ కోన శశిధర్ కొరడా ఝుళిపించారు. పనితీరు అధ్వాన్నంగా ఉండటంతో అధికారులకు షోకాజు నోటీసులు జారీ చేశారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి నవంబర్ వరకూ పనితీరు ఆధారంగా వీరందరికీ 'సీ' గ్రేడ్ వచ్చినట్టు తెలుస్తోంది. గతంలోనే గృహ నిర్మాణ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ గ్రేడింగ్‌పై ప్రత్యేక దృష్టి పెట్టారని రాష్ట్ర వ్యాప్తంగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో జిల్లాలో ఇందిరా ఆవాస్ యోజన, ఎన్టీఆర్ అప్‌గ్రెడేషన్ తదితర పథకాల్లో పురోగతి అధ్వాన్నంగా ఉండడంతో అధికారులపై చర్యలకు ఉపక్రమించారు. మొత్తం 8 మంది డీఈఈలు, 37 మంది ఏఈలకు షోకాజులు జారీ చేశారు. ఈ క్రమంలోనే వీరందరిపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని కలెక్టర్ నోటీసులిచ్చారు. ఇది ఇలా ఉండగా రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల నిర్మాణాల్లో అనంతపురం జిల్లా 5వ స్థానంలో ఉన్నట్టు తెలుస్తోంది.