Hsu v St
-
సానియా జంటకు షాక్
న్యూఢిల్లీ: బ్రిస్బేన్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్లో టాప్ సీడ్ సానియా మీర్జా (భారత్)-సు వి సెయి (చైనీస్ తైపీ) జోడీ పోరాటం సెమీఫైనల్లో ముగిసింది. శుక్రవారం జరిగిన మహిళల డబుల్స్ సెమీఫైనల్లో సానియా-సు వి సెయి ద్వయం 6-4, 6-7 (1/7), 8-10తో నాలుగో సీడ్ కరోలైన్ గార్సియా (ఫ్రాన్స్)-కాటరీనా స్రెబోత్నిక్ (స్లొవేనియా) జంట చేతిలో ఓడిపోయింది. గంటా 37 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. సానియా జంట నాలుగుసార్లు ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేసి తమ సర్వీస్‌ను మూడుసార్లు కోల్పోయింది. అయితే సూపర్ టైబ్రేక్‌లో మాత్రం సానియా జంట తడబడి ఓటమి పాలైంది. సెమీస్‌లో ఓడిన సానియా జోడీకి 13,194 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 8 లక్షల 22 వేలు)తోపాటు 185 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
సెమీస్‌లో సానియా జంట
బ్రిస్బేన్: కీలకదశలో ఒత్తిడిని జయించిన భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా-సు వి సెయి (చైనీస్ తైపీ) ద్వయం బ్రిస్బేన్ ఓపెన్ టోర్నమెంట్లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. బుధవారం జరిగిన మహిళల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సానియా-సు వి సెయి జంట 6-3, 2-6, 11-9తో అనస్తాసియా రొడియోనోవా-అరీనా రొడియోనోవా (ఆస్ట్రేలియా) జోడీపై గెలిచింది. 77 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సానియా జంట తమ సర్వీస్‌ను నాలుగుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేసింది. సానియా మీర్జా, సు వి సెయి, సెమీఫైనల్స్, మహిళల డబుల్స్, Sania Mirza, Hsu v St, in the semifinals, the women's doubles