huge blaze
-
ఆయుధాల డిపోలో భారీ మంటలు
మాస్కో: రష్యాలో మందు గుండు సామాగ్రి డిపోలో భారీ మంటలు చెలరేగాయి. మాస్కోకు ఆగ్నేయంగా ఉన్న రియాజాన్ ప్రాంతంలో ఈ ప్రమాదం సంభవించింది. దాంతో అధికారులు రియాజాన్ చుట్ట పక్కల ఉన్న 10 గ్రామాల నుంచి జనాలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు స్థానిక మీడియా తెలిపింది. నివేదికల ప్రకారం ఆర్మ్స్ డిపో సమీపంలో మందపాటి పొగ గాలిలో పైకి లేవడాన్ని చూడవచ్చు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోన్న ఈ వీడియోలో బూడిద ఆకాశం నుంచి పడటం గమనించవచ్చు. సమీప పొలంలోని మంటలు గాలి ప్రసారం వల్ల డిపోకి తగలడంతో మంటలు చెలరేగినట్లు రష్యా మిలిటరీ టాస్(టీఏఎస్ఎస్) వార్తా సంస్థ పేర్కొంది. (చదవండి: బస్సులో మంటలు.. 13 మంది సజీవదహనం) Rusya'nın Ryazan bölgesinde bulunan askeri depolarda art arda büyük patlamalar meydana geldi. pic.twitter.com/1bg4Uq6EVv — diktatör_yobaz (@zelihagulep1966) October 7, 2020 ఈ ఘటనలో ప్రాణ నష్టం గానీ ఆస్తి నష్టం గానీ సంభవించినట్లు నివేదికలు లేవు. ఇక ఈ ప్రమాదంపై రష్యా అత్యవసర మంత్రిత్వ శాఖ స్పందించింది. ప్రమాదం సంభవించిన మోటారు మార్గాన్ని మూసి వేస్తున్నామని.. చుట్టు పక్కల ఐదు కిలోమీటర్ల మేర 10 గ్రామాలను ఖాళీ చేయించామని తెలిపింది. -
క్షణం లేటైనా 50మంది చిన్నారులు బుగ్గే!
బర్మింగ్‌హామ్: బర్మింగ్‌హామ్‌లో పెద్ద ప్రమాదం తప్పింది. క్షణం ఆలస్యం అయినా మృత్యుకోరల్లో చిక్కుకుపోవాల్సిన చిన్నారులు అదృష్టవశాత్తు బయటపడ్డారు. అగ్నికి ఆహుతవకుండా ప్రాణాలతో బతికిపోయారు. బిజిగా ఉండే రహదారిపై వేగంగా వెళుతున్న బస్సులో సమస్యను ముందుగానే గుర్తించడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. బస్సులో ఇనుప వస్తువు తప్ప ఇక ఏ పార్ట్‌కూడా మిగలనంత బూడిదపోయిందంటే ప్రమాదం ఎంత స్థాయిలో జరిగిందో ఊహించుకోవచ్చు. పూర్తి వివరాల్లోకి వెళితే.. బర్మింగ్‌హామ్ లోని ఓ పాఠశాలకు చెందిన బస్సు వేగంగా వెళుతోంది. అనూహ్యంగా అందులో నుంచి పొగలు రావడం డ్రైవర్.. విద్యార్థులు గమనించారు. దీంతో డ్రైవర్ బస్సును పక్కకు ఆపేయగా.. అందులోని ఏడుగురు సహాయకులు చిన్నారులను సురక్షితంగా బయటకు దించారు. చూస్తుండగానే బస్సు భారీ అగ్ని కీలల్లో ఇరుక్కుపోయింది. నడి రోడ్డుపై ఎవరో బాంబులేసి తగలబెట్టినట్లుగా మారిపోయింది. మందుపాతర దాడిలో మిగిలిపోయిన అవశేషంగా చివరికి ఆ బస్సు దర్శనం ఇచ్చింది. ఏదేమైనా ఏ ఒక్కరికీ ప్రాణహాని జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.