క్షణం లేటైనా 50మంది చిన్నారులు బుగ్గే! | More than 50 pupils clambered out of the burning bus | Sakshi
Sakshi News home page

క్షణం లేటైనా 50మంది చిన్నారులు బుగ్గే!

Published Tue, May 24 2016 8:17 PM | Last Updated on Mon, Sep 4 2017 12:50 AM

క్షణం లేటైనా 50మంది చిన్నారులు బుగ్గే!

క్షణం లేటైనా 50మంది చిన్నారులు బుగ్గే!

బర్మింగ్హామ్: బర్మింగ్హామ్లో పెద్ద ప్రమాదం తప్పింది. క్షణం ఆలస్యం అయినా మృత్యుకోరల్లో చిక్కుకుపోవాల్సిన చిన్నారులు అదృష్టవశాత్తు బయటపడ్డారు. అగ్నికి ఆహుతవకుండా ప్రాణాలతో బతికిపోయారు. బిజిగా ఉండే రహదారిపై వేగంగా వెళుతున్న బస్సులో సమస్యను ముందుగానే గుర్తించడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. బస్సులో ఇనుప వస్తువు తప్ప ఇక ఏ పార్ట్కూడా మిగలనంత బూడిదపోయిందంటే ప్రమాదం ఎంత స్థాయిలో జరిగిందో ఊహించుకోవచ్చు.

పూర్తి వివరాల్లోకి వెళితే.. బర్మింగ్హామ్ లోని ఓ పాఠశాలకు చెందిన బస్సు వేగంగా వెళుతోంది. అనూహ్యంగా అందులో నుంచి పొగలు రావడం డ్రైవర్.. విద్యార్థులు గమనించారు. దీంతో డ్రైవర్ బస్సును పక్కకు ఆపేయగా.. అందులోని ఏడుగురు సహాయకులు చిన్నారులను సురక్షితంగా బయటకు దించారు. చూస్తుండగానే బస్సు భారీ అగ్ని కీలల్లో ఇరుక్కుపోయింది. నడి రోడ్డుపై ఎవరో బాంబులేసి తగలబెట్టినట్లుగా మారిపోయింది. మందుపాతర దాడిలో మిగిలిపోయిన అవశేషంగా చివరికి ఆ బస్సు దర్శనం ఇచ్చింది. ఏదేమైనా ఏ ఒక్కరికీ ప్రాణహాని జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement