Huge Loans
-
AP: ఎస్ఎల్బీసీ నివేదిక.. వారికి భారీగా రుణాలు
సాక్షి, అమరావతి: వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వివిధ పథకాల ద్వారా బడుగు, బలహీన వర్గాలకు విరివిగా రుణాలు అందుతున్నట్లు రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్ఎల్బీసీ) తాజా నివేదిక వెల్లడించింది. గత మూడేళ్లలో ఎస్సీ, ఎస్టీలకు బ్యాంకు రుణాల్లో 80.97 శాతం వృద్ధి నమోదు కాగా బీసీలకు ఇచ్చిన రుణాల్లో 39.61 శాతం వృద్ధి నమోదైంది. చదవండి: ‘ఈనాడు’కు ఇదెక్కడి పైత్యం? 2019–20లో ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చిన రుణాల మొత్తం రూ.15,791 కోట్లు ఉండగా 2021–22 నాటికి రూ.28,577 కోట్లకు పెరిగింది. ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చిన రుణాల్లో 2019–20లో ఏడు శాతం వృద్ధి నమోదైతే తర్వాత రెండేళ్లు వరుసగా 18 శాతం, 53 శాతం వృద్ధి నమోదు కావడం గమనార్హం. అంతేకాకుండా గత మూడేళ్లల్లో బీసీ వర్గాలకు రుణాలు రూ.90,624 కోట్ల నుంచి రూ.1,26,528 కోట్లకు చేరాయి. కోవిడ్ సమయంలో బడుగు, బలహీన వర్గాలను ఆదుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం వివిధ పథకాల ద్వారా పెద్దఎత్తున రుణాలను మంజూరు చేయడంతో భారీ వృద్ధి నమోదైనట్లు బ్యాంకింగ్ వర్గాలు పేర్కొంటున్నాయి. సంక్షేమ పథకాలతో చేయూత వైఎస్సార్ బడుగు వికాసం, స్వయం సహాయక సంఘాలు, జగనన్న తోడు, పీఎం ముద్ర, పీఎం స్వనిధి, స్టాండప్ ఇండియా తదితర పథకాల ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు భారీగా రుణాలు మంజూరయ్యాయి. జగనన్న తోడు పథకం కింద చిరు వ్యాపారాలు చేసుకునే వారికి రెండు దశల్లో 9.05 లక్షల మందికి రుణాలను మంజూరు చేయగా ఈ ఏడాది మూడో దశలో 9 లక్షల మందికి రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. అందులో ఇప్పటికే 5.10 లక్షల మందికి మంజూరు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ రుణాలకు వడ్డీ చెల్లింపుల కింద ఇప్పటికే రూ.32.51 కోట్లు బ్యాంకులకు చెల్లించడంతో 7.06 లక్షల మంది లబ్థిదారులకు ప్రయోజనం చేకూరింది. -
బ్రిటన్ ఎగ్జిట్ అవుతుందా?
(సాక్షి, బిజినెస్ విభాగం) యూరోపియన్ యూనియన్‌లో (ఈయూ) ‘బ్రిటన్’ ఉండాలా... వద్దా?(బ్రెగ్జిట్).. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థల్ని ప్రభావితం చేసే ఈ ప్రశ్నకు జవాబు మరో 24 గంటల్లో తేలనుంది. ఈ అంశంపై బ్రిటన్‌లో గురువారం ఉదయం(భారత కాలమానం ప్రకారం ఉదయం 11.30కు) రెఫరెండానికి పోలింగ్ జరగనుంది. శుక్రవారం ఉదయం ఫలితాలు వెల్లడించనున్నారు. ఒకవేళ బ్రెగ్జిట్‌కే బ్రిటన్లు మొగ్గుచూపితే.. భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ప్రభావం ఉంటుంది. యూరప్‌లో వ్యాపారం ఎక్కువగా ఉన్న విదేశీ కంపెనీలకు ఇబ్బందులు తప్పవు. ఈ నేపథ్యంలో బ్రిటన్ ఎందుకు ఎగ్జిట్ అవ్వాలనుకుంటోంది? వివరాలు.. కాందీశీకులతోనే సమస్య.. రెండో ప్రపంచయుద్ధం ముగిశాక అమెరికా, రష్యాలు చెరోపక్క మోహరించాయి. ఈ పరిస్థితుల్లో వాణిజ్య ప్రయోజనాల కోసం 28 యూరప్ దేశాలు క సమూహంగా ఏర్పడటంతో ఈయూ పురుడు పోసుకుంది. అయితే.. ఈయూ ఒప్పందాల ప్రకారం ప్రజలు ఒక దేశం నుంచి మరో దేశానికి వలస వెళ్లొచ్చు. కొంతకాలంగా అస్థిరతతో కొట్టుమిట్టాడుతున్న సిరియా, ఇరాక్ వంటి కల్లోల దేశాల నుంచి బ్రిటన్, స్వీడన్, డెన్మార్క్ తదితర దేశాలకు లక్షల మంది తరలివస్తున్నారు. ఇలా వస్తున్న వారికి సామాజిక భద్రత కల్పించటం కత్తిమీద సామే. అయితే దీనివల్ల తమ ఉపాధి అవకాశాలు తగ్గిపోవటం, తాము కడుతున్న పన్నును కాందిశీకులకు ధారపోస్తున్నారన్న అసంతృప్తి బ్రిటన్లలో ఉంది. బ్రిటన్ వైదొలిగితే ఏమవుతుంది? ఈయూ నుంచి వైదొలిగితే బ్రిటన్ ఆర్థికంగా దెబ్బతింటుందనేది విశ్లేషకుల భావన. ఈయూ బహిరంగ మార్కెట్లకు చేరే అవకాశం కోల్పోవడంతో బ్రిటన్ కొంత వాణిజ్యాన్ని, పెట్టుబడుల్ని నష్టపోతుందని అంచనా. అయితే ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్నందున సొంతగా మరింత వృద్ధి సాధిస్తామన్నది బ్రెగ్జిట్ సమర్థకుల వాదన. యూరో సమస్య.. ఈయూలోని 19 దేశాకు యూరో ఉమ్మడి కరెన్సీ. బ్రిటన్‌లో మాత్రం పౌండ్ స్టెర్లింగే కరెన్సీ. కొన్నేళ్లుగా యూరో బలహీనపడింది (డాలరుతో పోలిస్తే). దీంతో ఎగుమతులు జరిపే జర్మనీ వంటి దేశాలు లబ్దిపొందగా, దిగుమతులపై ఆధారపడే గ్రీస్ వంటివి దెబ్బతిన్నాయి. ఆ ఈయూ, యూరో అంటే మండిపడుతున్నా.. యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ నుంచి భారీ రుణాలు తీసుకున్నందున రెఫరెండం జోలికి వెళ్లటం లేదు.