రూ. 20 లక్షల విలువైన గంజాయి స్వాధీనం
విశాఖ ఏజెన్సీ హుకుంపేట మండలం గుత్తులపుట్లో అక్రమంగా గంజాయి తరలిస్తున్న వ్యక్తిని హుకుంపేట పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి భారీగా గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడిని హుకుంపేట పోలీసు స్టేషన్కు తరలించారు. అతడిపై కేసు నమోదు చేశారు. నిందితుడిని నుంచి స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ బహిరంగ మార్కెట్లో రూ. 20 లక్షలు వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు.