Hulkenbarg
-
రోస్బర్గ్కు ‘పోల్ పొజిషన్’
యూరోపియన్ గ్రాండ్‌ప్రి ఫార్ములావన్ క్వాలిఫయింగ్ సెషన్లో మెర్సిడెస్ జట్టు డ్రైవర్ నికో రోస్‌బర్గ్ ‘పోల్ పొజిషన్’ సాధించాడు. అజర్‌బైజాన్‌లోని బాకు నగరంలో శనివారం జరిగిన క్వాలిఫయింగ్‌లో రోస్‌బర్గ్ అందరికంటే వేగంగా ఒక నిమిషం 42.758 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ఆదివారం జరిగే ప్రధాన రేసును అతను తొలి స్థానం నుంచి మొదలుపెడతాడు. ‘ఫోర్స్ ఇండియా’ డ్రైవర్లు సెర్గియో పెరెజ్ ఏడో స్థానం నుంచి... హుల్కెన్‌బర్గ్ 12వ స్థానం నుంచి రేసును ఆరంభిస్తారు -
హామిల్టన్‌కు ‘పోల్’
నేడు స్పెయిన్ గ్రాండ్‌ప్రి బార్సిలోనా: గత రెండు రేసుల్లో విఫలమైన ప్రస్తుత ప్రపంచ చాంపియన్ లూయిస్ హామిల్టన్ మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. శనివారం జరిగిన స్పెయిన్ గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్ సెషన్లో ఈ మెర్సిడెస్ జట్టు డ్రైవర్ పోల్ పొజిషన్ సాధించాడు. క్వాలిఫయింగ్‌లో హామిల్టన్ అందరికంటే వేగంగా ఒక నిమిషం 22 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ఆదివారం జరిగే ప్రధాన రేసును ఈ బ్రిటన్ డ్రైవర్ తొలి స్థానం నుంచి మొదలుపెడతాడు. ఈ సీజన్లో హామిల్టన్‌కిది మూడో ‘పోల్’ కాగా... కెరీర్లో 52వది. సీజన్‌లోని తొలి నాలుగు రేసుల్లో విజేతగా నిలిచిన మెర్సిడెస్ జట్టుకే చెందిన నికో రోస్‌బర్గ్ స్పెయిన్ గ్రాండ్‌ప్రిలో రెండో స్థానం నుంచి రేసును ప్రారంభిస్తాడు. భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా జట్టు డ్రైవర్లు సెర్గియో పెరెజ్, హుల్కెన్‌బర్గ్ వరుసగా తొమ్మిది, 11వ స్థానాల నుంచి రేసును మొదలుపెడతారు. -
విజేత రోస్‌బర్గ్
సాఖిర్: బహ్రెయిన్ గ్రాండ్‌ప్రి ఫార్ములావన్ రేసులో మెర్సిడెస్ జట్టుకు చెందిన నికో రోస్‌బర్గ్ విజేతగా నిలిచాడు. ఆదివారం జరిగిన రేసులో రోస్‌బర్గ్ 57 ల్యాప్‌లను గంటా 33 నిమిషాల 34.696 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. సీజన్ తొలి రేసు ఆస్ట్రేలియా గ్రాండ్‌ప్రిలోనూ రోస్బర్గ్కు టైటిల్ లభించింది. ‘పోల్ పొజిషన్’తో రేసును ఆరంభించిన హామిల్టన్ (మెర్సిడెస్) తొలి ల్యాప్‌లోనే వెనుకబడిపోయాడు. చివరికి మూడో స్థానంతో సరిపెట్టుకున్నాడు. కిమీ రైకోనెన్ (ఫెరారీ)కు రెండో స్థానం లభించింది. భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా జట్టు డ్రైవర్లు టాప్-10లో నిలువలేకపోయారు. హుల్కెన్‌బర్గ్ 15వ, పెరెజ్ 16వ స్థానాలతో సరిపెట్టుకున్నారు. సీజన్‌లోని తదుపరి రేసు చైనా గ్రాండ్‌ప్రి ఈనెల 17న జరుగుతుంది. -
హామిల్టన్‌కు 50వ ‘పోల్’
నేడు ఆస్ట్రేలియా గ్రాండ్‌ప్రి మెల్బోర్న్: డిఫెండింగ్ చాంపియన్ లూయిస్ హామిల్టన్ ఫార్ములావన్ కొత్త సీజన్‌ను దూకుడుతో ప్రారంభించాడు. సీజన్ తొలి రేసు ఆస్ట్రేలియా గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్ సెషన్లో ఈ మెర్సిడెస్ జట్టు డ్రైవర్ ‘పోల్ పొజిషన్’ సాధించాడు. శనివారం జరిగిన క్వాలిఫయింగ్ సెషన్లో హామిల్టన్ అందరికంటే వేగంగా ఒక నిమిషం 23.837 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేసి అగ్రస్థానంలో నిలిచాడు. తద్వారా ఆదివారం జరిగే ప్రధాన రేసును తొలి స్థానం నుంచి ప్రారంభించే అవకాశాన్ని సంపాదించాడు. హామిల్టన్ కెరీర్లో ఇది 50వ ‘పోల్ పొజిషన్’ కావడం విశేషం. భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా జట్టు డ్రైవర్లు పెరెజ్, హుల్కెన్‌బర్గ్ వరుసగా 9వ, 10వ స్థానాల నుంచి రేసు మొదలుపెడతారు. నేటి ప్రధాన రేసు ఉదయం గం. 10.25 నుంచి స్టార్ స్పోర్ట్స్-4లో ప్రత్యక్ష ప్రసారం -
రోస్బర్గ్కు తొలి పోల్
నేడు స్పెయిన్ గ్రాండ్‌ప్రి బార్సిలోనా : ఈ సీజన్‌లోని తొలి నాలుగు రేసుల్లో ‘పోల్ పొజిషన్’ సంపాదించి దూకుడు మీదున్న మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్‌కు సహచరుడు నికో రోస్‌బర్గ్ చెక్ పెట్టాడు. శనివారం జరిగిన స్పెయిన్ గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్ సెషన్లో మెర్సిడెస్ జట్టుకే చెందిన రోస్‌బర్గ్ ఈ సీజన్లో తొలిసారి ‘పోల్ పొజిషన్’ సాధించాడు. మూడు క్వాలిఫయింగ్ సెషన్లలో కలిపి రోస్‌బర్గ్ మొత్తం 18 ల్యాప్‌లు డ్రైవ్ చేశాడు. ఈ క్రమంలో అతను ఒక నిమిషం 24.681 సెకన్లలో అందరికంటే వేగవంతమైన ల్యాప్‌ను నమోదు చేసి పోల్ పొజిషన్ దక్కించుకున్నాడు. ఫలితంగా ఆదివారం జరిగే ప్రధాన రేసును రోస్‌బర్గ్ తొలి స్థానం నుంచి ప్రారంభిస్తాడు. హామిల్టన్ ఒక నిమిషం 24.948 సెకన్లతో రెండో స్థానంలో నిలిచాడు. మాజీ చాంపియన్ వెటెల్ (ఫెరారీ) మూడో స్థానంలో, బొటాస్ (విలియమ్స్) నాలుగో స్థానంలో నిలిచారు. భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా డ్రైవర్లు హుల్కెన్‌బర్గ్ 17వ, సెర్గియో పెరెజ్ 18వ స్థానాల నుంచి రేసును మొదలుపెడతారు.