సంస్థ అభివృద్ధిలో హెచ్ఆర్లూ భాగస్వాములే
ఎస్హెచ్ఆర్ఎం ఇండియా సీఈఓ అచల్ ఖన్నా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ‘‘మానవ వనరుల నిర్వహణలో సాంకేతికతను వినియోగించాలి. అప్పుడే ఉత్పాదకత పెరిగి.. సంస్థ అభివృద్ధి చెందుతుందని’’ మానవ వనరుల నిర్వహణ సంస్థ (ఎస్హెచ్ఆర్ఎం) ఇండియా సీఈఓ అచల్ ఖన్నా తెలిపారు. ప్రస్తుతం దేశంలో నైపుణ్యమున్న ఉద్యోగుల కొరత ఉందని.. దీన్ని అధిగమించాలంటే హెచ్ఆర్ నిర్వహణలో టెక్నాలజీని వినియోగించాలని సూచించారు. గురువారమిక్కడ ‘ఎస్హెచ్ఆర్ఎం టెక్–2017’ రెండు రోజుల ప్రదర్శన ప్రారంభమైంది.
ఈ సందర్భంగా అచల్ మాట్లాడుతూ.. ఏ సంస్థ అయినా నడవాలంటే ఆర్ధిక, సాంకేతిక దన్నుతో పాటూ మానవ వనరులూ అవసరం. అంటే సంస్థ అభివృద్ధిలో హెచ్ఆర్లూ భాగస్వాములేనని తెలియజేశారు. 400లకు పైగా కంపెనీలు 850కి పైగా ప్రముఖులు ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. సుమారు 50కి పైగా హెచ్ఆర్ సొల్యూషన్స్ స్టార్టప్స్ తమ ఉత్పత్తులను ప్రదర్శించాయి. ఈ కార్యక్రమంలో ఎస్హెచ్ఆర్ఎం చీప్ హెచ్ఆర్ అండ్ స్ట్రాటజీ ఆఫీసర్ జెఫ్ టీహెచ్ పాన్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అలెగ్జాండర్ అలోన్సో తదితరులు పాల్గొన్నారు.