ఫ్రీజర్లో 70 మొసళ్ల తలలు..
సిడ్నీ: ఒక్కటి కాదు రెండు కాదు ఏకంగా 70 మొసళ్లను వేటగాళ్లు చంపి వాటి తలలను ఫ్రీజర్లో వదిలి పెట్టి వెళ్లారు. ఈ సంఘటన ఉత్తర ఆస్ట్రేలియాలోని హంటీ డూ అనే గ్రామంలో మంగళవారం వెలుగు చూసింది. గ్రామంలోని ఒక దుకాణం వెనక వైపు పడిఉన్న ఫ్రీజర్లో మొసళ్ల తలలను కొందరు చిన్న పిల్లలు ముందుగా గుర్తించారు. సమాచారాన్ని అందుకున్న వన్యప్రాణి సంరక్షణ అధికారులు ఈ సంఘటన పై విచారణ ప్రారంభించారు. మొసలి చర్మానికి అంతర్జాతీయ ఫ్యాషన్ రంగంలో మంచి గిరాకీ ఉంది. మొసళ్ల చర్మం కోసం వేటాడినట్టు అధికారులు భావిస్తున్నారు.
మొసళ్లు ఆస్ట్రేలియాలో క్షీణిస్తున్న జాతిగా గుర్తించారు. ఎవరైనా మొసళ్లను చంపినట్టు రుజువైతే కఠినశిక్షనలను కూడా అమలు చేస్తున్నారు. మొసళ్ల నుంచిప్రజలకు రక్షణ కల్పించే కొన్ని సందర్భాల్లో మాత్రమే అక్కడ నివసిస్తున్న కొన్ని వర్గాల వారికి వాటిని చంపే అవకాశం కల్పిస్తారు.