humpty sharma ki dulhaniya
-
వారిద్దరూ మళ్లీ కలిసి నటిస్తున్నారా?
ముంబై: హిట్ పెయిర్ అలియా భట్, వరుణ్ ధావన్ మరోసారి జతకడుతున్నారా? అవుననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. ఈ విషయాన్ని స్వయంగా అలియా భట్ ట్విట్టర్ ద్వారా హింట్ ఇచ్చింది. 2014లో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన 'హంప్టీ శర్మ కి దుల్హనియా' చిత్ర సీక్వెల్లో వీరు కలిసినటిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఓ ఫోటోను అలియా ట్విట్టర్లో పోస్ట్ పోస్ట్ చేసింది. వరుణ్, అలియా వెనక్కి తిరిగి ఉన్న ఆ ఫోటోపై 'ఆర్ దే కమింగ్ బ్యాక్' అని ఉన్న క్యాప్షన్ అభిమానుల్లో హాట్ టాపిక్ అయింది. హంప్టీ శర్మ కి దుల్హానియా చిత్రం అప్పట్లో బారీ హిట్‌ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. దానికి సీక్వెల్‌గా వస్తున్న చిత్రంలో మరోసారి అదే జంట కలిసి నటిస్తున్నారనే వార్త ఇప్పుడు బాలీవుడ్లో ఆసక్తి కలిగిస్తోంది. వరుణ్ ధావన్ సైతం అదే ఫోటోతో ట్వీట్టర్లో ఈ విషయాన్ని పేర్కొన్నాడు. ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ సైతం ఈ సస్పెన్స్‌ను కంటిన్యూ చేస్తూ ధర్మా ప్రొడక్షన్స్ అఫిసియల్ ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని పేర్కొన్నాడు. అయితే ఈ విషయంలో మరింత సర్ప్రైజ్ కోసం కొంచెం వెయిట్ చేయాలంటున్నాడు. -
ఆలియాభట్ కారును ఢీకొన్న ఏసీపీ కారు!!
బాలీవుడ్ ముద్దుగుమ్మ ఆలియా భట్‌కు పెద్ద ప్రమాదం త్రుటిలో తప్పిపోయింది. ఆమెతో పాటు వరుణ్ ధవన్ కలిసి ప్రయాణిస్తున్న కారును ఓ ఏసీపీ కారు ఢీకొంది. అయితే.. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు మాత్రం కాలేదు. 'హంప్టీ శర్మా కీ దుల్హనియా' చిత్రం ప్రమోషన్ కోసం అహ్మదాబాద్ వెళ్లిన ఆలియాభట్, వరుణ్ ధవన్ ఎయిర్ పోర్టు నుంచి వెళ్తుండగా, ట్రాఫిక్ సిగ్నల్ వద్ద వీళ్ల కారును ఏసీపీ జేఎన్ పర్మార్ కారు ఢీకొంది. ఈ సంఘటన ఉదయం 11 గంటల సమయంలో జరిగింది. వరుణ్, ఆలియాల కారు ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగినప్పుడు వెనకనుంచి వచ్చిన ఏసీపీ కారు దీన్ని ఢీకొనడంతో వెనుక అద్దం పూర్తిగా బద్దలైపోయింది. గాజు ముక్కలు వెనక సీట్లో కూడా పడ్డాయి. వెంటనే ఆలియా, వరుణ్ ఇద్దరూ కారులోంచి బయటకు దూకేశారు. వాళ్లను చూసి జనం గుమిగూడుతుండటంతో.. వెంటనే వేరే కారులో అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే.. పోలీసులు మాత్రం ప్రమాద సమయానికి ఆలియా ఆ కారులో లేదని అంటున్నారు. కారు ప్రమాదం విషయాన్ని సోమవారమే పదవీ విరమణ చేసిన ఏసీపీ జేఎన్ పర్మార్ ధ్రువీకరించారు. అయితే.. విషయం అంతా సెటిలైపోయిందని డ్రైవర్ చెప్పడంతో వివరాలు అడగలేదన్నారు. తాము పసుపుపచ్చరంగు ఆడి కారులోవెళ్తుండగా అది ప్రమాదానికి గురైందని, అది చాలా భయపెట్టే సంఘటన అని వరుణ్ ధవన్ చెప్పాడు.