ఆలియాభట్ కారును ఢీకొన్న ఏసీపీ కారు!! | Alia Bhatt and Varun Dhawan's car meets with an accident | Sakshi
Sakshi News home page

ఆలియాభట్ కారును ఢీకొన్న ఏసీపీ కారు!!

Published Tue, Jul 1 2014 4:16 PM | Last Updated on Tue, Aug 14 2018 3:22 PM

ఆలియాభట్ కారును ఢీకొన్న ఏసీపీ కారు!! - Sakshi

ఆలియాభట్ కారును ఢీకొన్న ఏసీపీ కారు!!

బాలీవుడ్ ముద్దుగుమ్మ ఆలియా భట్కు పెద్ద ప్రమాదం త్రుటిలో తప్పిపోయింది. ఆమెతో పాటు వరుణ్ ధవన్ కలిసి ప్రయాణిస్తున్న కారును ఓ ఏసీపీ కారు ఢీకొంది. అయితే.. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు మాత్రం కాలేదు. 'హంప్టీ శర్మా కీ దుల్హనియా' చిత్రం ప్రమోషన్ కోసం అహ్మదాబాద్ వెళ్లిన ఆలియాభట్, వరుణ్ ధవన్ ఎయిర్ పోర్టు నుంచి వెళ్తుండగా, ట్రాఫిక్ సిగ్నల్ వద్ద వీళ్ల కారును ఏసీపీ జేఎన్ పర్మార్ కారు ఢీకొంది. ఈ సంఘటన ఉదయం 11 గంటల సమయంలో జరిగింది. వరుణ్, ఆలియాల కారు ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగినప్పుడు వెనకనుంచి వచ్చిన ఏసీపీ కారు దీన్ని ఢీకొనడంతో వెనుక అద్దం పూర్తిగా బద్దలైపోయింది. గాజు ముక్కలు వెనక సీట్లో కూడా పడ్డాయి. వెంటనే ఆలియా, వరుణ్ ఇద్దరూ కారులోంచి బయటకు దూకేశారు. వాళ్లను చూసి జనం గుమిగూడుతుండటంతో.. వెంటనే వేరే కారులో అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే.. పోలీసులు మాత్రం ప్రమాద సమయానికి ఆలియా ఆ కారులో లేదని అంటున్నారు.

కారు ప్రమాదం విషయాన్ని సోమవారమే పదవీ విరమణ చేసిన ఏసీపీ జేఎన్ పర్మార్ ధ్రువీకరించారు. అయితే.. విషయం అంతా సెటిలైపోయిందని డ్రైవర్ చెప్పడంతో వివరాలు అడగలేదన్నారు. తాము పసుపుపచ్చరంగు ఆడి కారులోవెళ్తుండగా అది ప్రమాదానికి గురైందని, అది చాలా భయపెట్టే సంఘటన అని వరుణ్ ధవన్ చెప్పాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement