hundi income count
-
దుర్గమ్మ దసరా హుండీ లెక్కింపు ప్రారంభం
ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): విజయవాడ కనకదుర్గ అమ్మవారికి దసరా ఉత్సవాలలో భక్తులు హుండీల ద్వారా సమర్పించిన కానుకల లెక్కింపును సోమవారం మహా మండపం ఆరో అంతస్తులో చేపట్టారు. తొలిదఫా లెక్కింపులో రూ.2,87,83,153 నగదుతో పాటు 546 గ్రాముల బంగారం, 9.553 కిలోల వెండి లభ్యమైనట్లు ఆలయ ఈవో భ్రమరాంబ పేర్కొన్నారు. మంగళవారం (నేడు) కూడా హుండీ కానుకల లెక్కింపు కొనసాగుతుందని ఆమె తెలిపారు. కానుకల లెక్కింపును దేవస్థానం చైర్మన్ పైలా సోమినాయుడు, పాలక మండలి సభ్యులు పర్యవేక్షించగా, ఆలయ సిబ్బంది, సేవా సిబ్బంది పాల్గొన్నారు. -
నెట్టికంటుడి హుండీ ఆదాయం రూ.19.75 లక్షలు
గుంతకల్లు రూరల్ : ప్రముఖ పుణ్యక్షేత్రం కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయంలో మంగళవారం హుండీ లెక్కింపు జరిగింది. భక్తులు స్వామి వారికి సమర్పించిన కానుకలను ఆలయ సిబ్బంది లెక్కించారు. ఆలయంలో ఉన్న 24 హుండీలను లెక్కించగా మొత్తం రూ.19.75 లక్షల ఆదాయం వచ్చినట్లు ఆలయ ఇన్చార్జ్ ఈవో, జిల్లా దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ఆనంద కుమార్ తెలిపారు. అంతేకాక ఎనిమిది గ్రాముల బంగారం, ఒక కేజీ 110 గ్రాముల వెండిని స్వామి వారికి భక్తులు సమర్పించినట్లు ఆలయ అధికారులు తెలిపారు. అంతేకాక అన్నదాన హుండీ ద్వారా రూ.25,520 నగదు వచ్చింది. కార్యక్రమంలో ఈఓతో పాటు ఆలయ అణువంశిక ధర్మకర్త సుగుణమ్మ, ఏఈవో మధు, పాలకవర్గం, ఆర్టీసీ సేవా సమితి, సత్యసాయి సేవా సమితి, హనుమాన్ సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. -
వేంకటేశ్వరస్వామి ఆలయ హుండీ లెక్కింపు
అనంతపురం కల్చరల్ : నగరంలోని హౌసింగ్‌బోర్డు శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ హుండీ లెక్కింపు గురువారం జరిగింది. జనవరి నెలలో హుండీ ద్వారా రూ.95,950 ఆదాయం వచ్చిందని ఆలయ చైర్మన్ సుబ్బారెడ్డి, వైస్ చైర్మన్ కృష్ణమూర్తి తెలిపారు.