ప్రముఖ పుణ్యక్షేత్రం కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయంలో మంగళవారం హుండీ లెక్కింపు జరిగింది.
గుంతకల్లు రూరల్ : ప్రముఖ పుణ్యక్షేత్రం కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయంలో మంగళవారం హుండీ లెక్కింపు జరిగింది. భక్తులు స్వామి వారికి సమర్పించిన కానుకలను ఆలయ సిబ్బంది లెక్కించారు. ఆలయంలో ఉన్న 24 హుండీలను లెక్కించగా మొత్తం రూ.19.75 లక్షల ఆదాయం వచ్చినట్లు ఆలయ ఇన్‌చార్జ్ ఈవో, జిల్లా దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ఆనంద కుమార్ తెలిపారు.
అంతేకాక ఎనిమిది గ్రాముల బంగారం, ఒక కేజీ 110 గ్రాముల వెండిని స్వామి వారికి భక్తులు సమర్పించినట్లు ఆలయ అధికారులు తెలిపారు. అంతేకాక అన్నదాన హుండీ ద్వారా రూ.25,520 నగదు వచ్చింది. కార్యక్రమంలో ఈఓతో పాటు ఆలయ అణువంశిక ధర్మకర్త సుగుణమ్మ, ఏఈవో మధు, పాలకవర్గం, ఆర్టీసీ సేవా సమితి, సత్యసాయి సేవా సమితి, హనుమాన్ సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు.