Hung himself
-
ఉరివేసుకుని వృద్ధుడి ఆత్మహత్య
చందుపట్ల(భువనగిరి అర్బన్) : ఉరి వేసుకుని వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంగళవారం రాత్రి మండలంలోని చందుపట్లలో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని చందుపట్ల గ్రామానికి చెందిన చిదరకంటి పోషయ్య(65) వ్యవసాయం చేస్తు జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యంతో తీవ్ర ఇబ్బందులు పడుతునట్లు చెప్పారు. తన వ్యవసాయ బావి వద్ద మంగళవారం సాయంత్రం చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడాడు. అటుగా వెళ్తున్న రైతులు, పశువుల కాపరులు చెట్టుకు వెలాడుతున్న మృతదేహన్ని చూసి కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతి చెందిన తిరును పరిశీలించారు. మృతదేహానికి పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలిచారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయనునట్లు రూరల్ పోలీసులు తెలిపారు. మృతునికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నట్లు చెప్పారు. -
చెట్టుకు ఉరివేసుకొని వ్యక్తి బలవన్మరణం
మరిపెడ : మానసిక స్థితి బాగా లేక మండలంలోని బాబోజీగూడేనికి చెందిన భీమనపెల్లి రామ్మూర్తి(60) గ్రామం శివారులోని ఓ చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వారి కుటుంబం పదిసంవత్సరాల క్రితం బతుకుదెరువు కోసం హైదరాబాద్‌కు వలస వెళ్లింది. అక్కడ రామ్మూర్తి కల్లుకు బానిసయ్యాడు. కుటుంబ సభ్యులు అభ్యంతరం చెప్పడంతో ఈనెల 19న హైదరాబాద్ నుంచి బాబోజీగూడేనికి చేరుకున్నాడు. ఏదైనా అఘాయిత్యం చేసుకుంటాడేమోనన్న అనుమానంతో కుటుంబసభ్యులు అదే రోజు రాత్రి గ్రామానికి వచ్చారు. ఈనెల 20న ఉదయం బయటికి వెళ్లిన రామ్మూర్తి ఇంటికి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు ఆయన ఆచూకీ కోసం గాలిస్తుండగా గ్రామశివారులోని చెట్టుకు ఉరివేసుకొని మృతిచెందినట్లుగా గుర్తించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. -
వివాహిత ఆత్మహత్య
కె.బిట్రగుంట (సింగరాయకొండ): ఉరేసుకుని వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన జరుగుమల్లి మండలం కె.బిట్రగుంటలో గురువారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. నెల్లూరుకు చెందిన షేక్ సుభానీ బీఎస్పీసీఎల్ కంపెనీలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఉదయం డ్యూటీకి వెళ్లి తిరిగి మధ్యాహ్నం ఇంటికి రాగానే భార్య మస్తానమ్మ(25) చీరెతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడి ఉంది. పిల్లలు కలగలేదన్న మానసిక వేదనతోనే ఆత్మహత్యకు పాల్పడిందని భర్త సుభానీ చెబుతుండగా తమ బిడ్డ ఆత్మహత్యకు సుభానీయే కారణమని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రామకోటయ్య తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం రిమ్స్‌కు తరలించారు.