ఉరివేసుకుని వృద్ధుడి ఆత్మహత్య | Old man who hung himself to death | Sakshi
Sakshi News home page

ఉరివేసుకుని వృద్ధుడి ఆత్మహత్య

Published Wed, Aug 24 2016 12:42 AM | Last Updated on Mon, Sep 4 2017 10:33 AM

Old man who hung himself to death

చందుపట్ల(భువనగిరి అర్బన్‌) :  ఉరి వేసుకుని వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంగళవారం రాత్రి మండలంలోని చందుపట్లలో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని చందుపట్ల గ్రామానికి చెందిన చిదరకంటి పోషయ్య(65) వ్యవసాయం చేస్తు జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యంతో తీవ్ర ఇబ్బందులు పడుతునట్లు చెప్పారు. తన వ్యవసాయ బావి వద్ద మంగళవారం సాయంత్రం చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడాడు. అటుగా వెళ్తున్న రైతులు, పశువుల కాపరులు చెట్టుకు వెలాడుతున్న మృతదేహన్ని చూసి కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతి చెందిన తిరును పరిశీలించారు. మృతదేహానికి పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలిచారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయనునట్లు రూరల్‌ పోలీసులు తెలిపారు. మృతునికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నట్లు చెప్పారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement