బస్సులోనుంచి జారిపడి వృద్ధుని మృతి
Published Thu, Oct 20 2016 3:13 AM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM
భీమవరం టౌన్ : ఆర్టీసీ బస్సులో నుంచి జారిపడి గుర్తుతెలియని వృద్ధుడు మృతిచెందాడు. వన్‌టౌన్ ఎస్సై కె.సుధాకరరెడ్డి కథనం ప్రకారం.. భీమవరం బస్‌కాంప్లెక్స్‌లో బుధవారం ఉదయం 8.30 గంటలకు తాడేపల్లిగూడెం బస్సు ఎక్కిన గుర్తు తెలియని వృద్ధుడు బస్సు కదులుతుండగా డోరు వద్ద నుంచి కిందకు జారి పడిపోయాడు. బస్సు చక్రం అతనిపై నుంచి వెళ్లిపోవడంతో మృతిచెందాడు. అతను ఏ ఊరికి చెందిన వాడో తెలియడం లేదు. మృతుడి వయసు 65 ఏళ్లు ఉంటాయని భావిస్తున్నారు. తెల్లచొక్కా, తెల్ల లుంగి ధరించి ఉన్నాడు. మృతదేహాన్ని పోలీసులు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడి వివరాలు తెలిసిన వారు వన్‌టౌన్ సీఐ yì .వెంకటేశ్వరరావు సెల్‌నంబర్ : 94407 96632కు లేదా ఎస్సై కె.సుధాకరరెడ్డి సెల్ నంబర్ : 94407 96633కు సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు.
Advertisement
Advertisement