బస్సు ఢీకొని యువకుడి మృతి | bus accident.. youngster dead | Sakshi
Sakshi News home page

బస్సు ఢీకొని యువకుడి మృతి

Published Tue, Nov 1 2016 2:39 AM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM

bus accident.. youngster dead

తాడేపల్లిగూడెం రూరల్‌ : ఆర్టీసీ బస్సు ఢీకొని ఓ యువకుడు మృతి చెందిన ఘటన పెదతాడేపల్లి సమీపంలోని జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి జరిగింది. ఈ ప్రమాదంలో హర్యానాకు చెందిన గురుదీప్‌ కుమార్‌ (23) మృతి చెందాడు. కుమార్‌ రోడ్డు దాటుతుండగా రామచంద్రాపురం ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు ఢీకొంది. దీంతో కుమార్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. ఇతను పెదతాడేపల్లి శ్రీనివాసా ఆగ్రోస్‌ సర్వీసెస్‌కు చెందిన వరి కోతయంత్రానికి డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. సంస్థ అధినేత గూడవల్లి శ్రీనివాస్‌ ఫిర్యాదు మేరకు రూరల్‌ ఏఎస్‌ఐ కృష్ణాజీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం అనంతరం కుమార్‌ మృతదేహాన్ని హర్యానాకు తరలించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement