Hunting of Bombay Mills
-
ద్విభాషా చిత్రంలో..
మౌనమేలనోయి, ఒరేయ్, నీ జతగా నేనుండాలి తదితర తెలుగు చిత్రాలతో పాటు హిందీ చిత్రాల్లోనూ హీరోగా నటించిన సచిన్ జోషి నటిస్తున్న తాజా చిత్రం ‘హంటింగ్ ఆఫ్ బోంబే మిల్స్’. ఇప్పటివరకు సోలో హీరోగా చేసిన ఆయన ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర అంగీకరించడం విశేషం. తెలుగు, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రానికి అయుష్ రైనా దర్శకుడు. సచిన్ మాట్లాడుతూ -‘‘తొలిసారి బయటి బేనర్లో నటిస్తున్నాను. రచయిత ప్రవల్ రామన్ ‘హంటింగ్ ఆఫ్ బోంబే మిల్స్’ కథ మొత్తం చెప్పి కీలక పాత్రకు అడగ్గానే ఆశ్చర్యపోయాను. కానీ, కథ, పాత్ర నచ్చడంతో అంగీకరించాను. ఇందులో ధనిక పారిశ్రామికవేత్త పాత్ర నాది’’ అన్నారు. -
మళ్లీ జంటగా..?
‘షాహిద్ కపూర్, కరీనా కపూర్ల నిజజీవిత ప్రేమకథ అందరికీ తెలిసిందే. విడిపోయిన తర్వాత ఈ ఇద్దరూ కలిసి నటించడం మానేశారు. ఇక.. ఎప్పటికీ ఈ జోడీ కలిసి నటించరని చాలామంది ఫిక్స్ అయ్యారు కూడా. ఈ నేపథ్యంలో ‘ఉడ్తా పంజాబ్’ అనే చిత్రంలో వారు నటించనున్నారనే వార్త ప్రచారంలో ఉంది. ‘కరీనాతో కలిసి నటిస్తున్నారటగా’ అని షాహిద్‌ను అడిగితే, ‘‘తనతో నటించనని ఎప్పుడైనా చెప్పానా? ఈ చిత్రంలో నేను ఉన్నాను. మిగతా విషయాలను దర్శక, నిర్మాతలు చెబుతారు’’ అన్నారు. మరి, ఇంతకీ షాహిద్ పక్కన కరీనా ఉన్నట్టా? లేనట్టా? అధికారిక ప్రకటన వచ్చేవరకూ ఆగాల్సిందే!